Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WTC 2023 Final: ఇండోర్ టెస్టులో ఓటమితో డబ్ల్యూటీసీ ఫైనల్ నుంచి భారత్ ఔట్? ఇక ఆశలన్నీ ఆ సిరీస్‌పైనే..

Ind vs Aus World Test Championship: ఇండోర్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు మ్యాచ్ జరుగుతోంది. ఇండోర్ టెస్ట్ మ్యాచ్ టీమ్ ఇండియా పరంగా చాలా ముఖ్యమైనది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే భారత జట్టు ఫైనల్‌కు చేరుకుంటుంది.

WTC 2023 Final: ఇండోర్ టెస్టులో ఓటమితో డబ్ల్యూటీసీ ఫైనల్ నుంచి భారత్ ఔట్? ఇక ఆశలన్నీ ఆ సిరీస్‌పైనే..
Teamindia
Follow us
Venkata Chari

|

Updated on: Mar 03, 2023 | 11:32 AM

ఇండోర్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడో టెస్టు మ్యాచ్‌లో ఎట్టకేలకు కంగారులకు ఓ విజయం సొంతమైంది. ఈ మ్యాచ్‌లో భారత్ ఆరంభం ప్రత్యేకంగా లేదు. ఆట మొదటి రోజున ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 109 పరుగులకే పరిమితమైంది. అలాగే రెండవ రోజున భారత్ పునరాగమనం చేసి, ఆస్ట్రేలియాను 197 పరుగులకు ఆలౌట్ చేసింది. 88 పరుగుల ఆధిక్యాన్ని పొందింది. ఆ తర్వాత భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 163 ​​పరుగులకు ఆలౌటైంది. దీంతో మూడో రోజు మ్యాచ్‌లో కంగారూ జట్టు నాల్గో ఇన్నింగ్స్‌లో 76 పరుగుల లక్ష్యాన్ని సులువుగా ఛేదించింది. దీంతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో మూడో టెస్టులో 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో కంగారూ జట్టు 2-1తో పునరాగమనం చేసింది. సిరీస్‌లోని చివరి మ్యాచ్ మార్చి 9 నుంచి 13 వరకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది.

ఇండోర్‌లో ఓటమి డబ్ల్యూటీసీ సమీకరణాన్ని క్లిష్టతరం చేయనుందా?

ఇండోర్ టెస్ట్ భారత్‌కు చాలా ముఖ్యమైనది. కానీ, ఈ మ్యాచ్‌లో భారత్ ఓటమిపాలైంది. ఒకవేళ విజయం సాధిస్తే భారత జట్టు ఫైనల్‌కు చేరుకేనేది. ఓడిన నేపథ్యంలో భారత్‌ ఫైనల్‌కు చేరుకోవడం కోసం ఎదురుచూపులు పెరిగాయి. ఇండోర్ టెస్టులో ఓడిపోవడంతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో సులభంగా ఫైనల్‌కు చేరుకోవాలనే భారత ఆశలకు అడ్డుకట్ట పడింది.

ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌ను 2-1తో గెలిస్తే లేదా 2-2తో డ్రా అయితే న్యూజిలాండ్-శ్రీలంక సిరీస్ ఫలితంపై భారత్ ఆధారపడాల్సి ఉంటుంది. ఇటువంటి పరిస్థితిలో న్యూజిలాండ్‌తో జరిగే రెండు మ్యాచ్‌లలో శ్రీలంక కనీసం ఒక మ్యాచ్‌లోనైనా ఓడిపోవాలని భారత్ కోరుకోవాల్సి ఉంటుంది. న్యూజిలాండ్ వంటి బలమైన జట్టుపై శ్రీలంక గెలవడం చాలా కష్టం. అది కూడా న్యూజిలాండ్‌ను స్వదేశంలో ఓడించడం కష్టమే కావొచ్చు. ఈ సిరీస్ తర్వాతే డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆడే రెండో జట్టు ఏదో తెలియనుంది. ఆస్ట్రేలియా ఇప్పటికే ఫైనల్ చేరిన తొలి జట్టుగా నిలిచింది.

ఇవి కూడా చదవండి

ఆస్ట్రేలియాకు డ్రా..

ఆస్ట్రేలియాకు కూడా సమీకరణం స్పష్టంగా ఉంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఇండోర్ విజయంలో ఫైనల్‌తో తమ స్థానం పదిలం చేసుకుంది. మరో మ్యాచ్‌లో ఓడినా ఆస్ట్రేలియా ఫైనల్ ఆడనుంది. అంటే ఆస్ట్రేలియా 3-0 లేదా 3-1 తేడాతో సిరీస్‌ను కోల్పోయినా ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ చివరి మ్యాచ్ జూన్ 7 నుంచి ఓవల్ మైదానంలో జరగనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..