Gold Price Today: బంగారం కొనుగోలు దారులకు ఊరట.. శనివారం తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే?

బంగారం కొనుగోలు చేసేవారికి కాస్త ఊరట లభించింది.. గత మూడు రోజులుగా పెరుగుతూ వస్తోన్న పసిడి ధరలు శనివారం (మార్చి 4) మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి.

Gold Price Today: బంగారం కొనుగోలు దారులకు ఊరట.. శనివారం తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే?
Gold Price Today
Follow us
Basha Shek

|

Updated on: Mar 04, 2023 | 5:54 AM

బంగారం కొనుగోలు చేసేవారికి కాస్త ఊరట లభించింది.. గత మూడు రోజులుగా పెరుగుతూ వస్తోన్న పసిడి ధరలు శనివారం (మార్చి 4) మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రధాన నగరాల్లో తులం బంగారం ధరలో ఎలాంటి మార్పులు, చేర్పులు జరగలేదు. ప్రస్తుతం దేశంలోని బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,750 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.56,450 గా ఉంది. అయితే శనివారం వెండి ధరలు మాత్రం భారీగా పెరిగాయి. కిలో వెండిపై సుమారు రూ. 400 మేర పెరిగింది. ప్రస్తుతం బులియన్‌ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.66,900 పలుకుతోంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో ఏ సమయంలోనైనా పెరగవచ్చు. తగ్గవచ్చు. మీరు బంగారం కొనుగోలు చేసే సమయానికి ముందు ధరలు తెలుసుకోవడం ముఖ్యం.

ప్రధాన నగరాల్లో బంగారం ధరలిలా..

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,600గా ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,450 పలుకుతోంది.

ఇవి కూడా చదవండి

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.52,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,160గా ఉంది.

కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,450 ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,500

కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,450

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.51,750 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.56,450

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,450

విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,450 లుగా కొనసాగుతోంది.

వెండి ధరలిలా..

మారిన ధరలతో ఈరోజు చెన్నై, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.70,000పలుకుతోంది. అలాగే హైదరాబాద్‌, విజయవాడ, విశాఖ నగరాల్లోనూ ఇదే ధరకు లభిస్తుంది. ముంబై, ఢిల్లీ నగరాల్లో రూ.66,900కు లభిస్తోంది.

గమనిక: ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం.. క్లిక్ చేయండి