Onion Price: అక్కడ మార్కెట్ లో కేజీ ఉల్లి రూపాయి నాలుగు పైసలే.. కన్నీరు పెడుతున్న ఉల్లిరైతు
కోస్తే కంట కన్నీరు పెట్టించే ఉల్లిపాయలు.. ఇప్పుడు తనని పండిస్తున్న రైతు కంట కూడా కన్నీరుపెట్టిస్తోంది. రూపాయికి టీ కూడా రావడం లేదు.. ఇంకా చెప్పాలంటే బిచ్చగాడికి రూపాయి ఇస్తే.. వద్దు అనేటట్లు చూస్తున్నాడు. అయితే ఆ రాష్ట్రంలో కేజీ ఉల్లిపాయ ధర కేవలం రూపాయి నాలుగు పైసలు పలికింది.
మనదేశం అన్ని రంగాల్లో దినదినాభివృద్ధి సాధిస్తున్నా ఒక్క వ్యవసాయ రంగం మాత్రమే భారంగా మారింది.. ఆర్థికాభివృద్ధి ఎగసిపడుతున్నదని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వాలు వ్యవసాయాభివృద్ధిపై ప్రశ్నిస్తే.. సమాధానంగా నీరు నములుతారు. రైతు ఆరుగాలం కష్టించి.. ఎండనక వాననక.. పురుగనక పుట్రనక..పెట్టిన పెట్టుబడి వస్తుందో రాదో తెలియకపోయినా ఈ ఏడాది కష్టం,నష్టం నెక్స్ట్ ఇయర్ అయినా పంటలు పండి.. గిట్టుబాటు ధర లభించి..తీరుతుంది అనే ఆశతో.. వ్యవసాయం చేస్తున్నారు. మానవాళికి పట్టెడన్నం పెడుతున్నాడు. అయినప్పటికీ నవభారత రైతు దుస్థితి రోజు రోజుకీ దిగజారిపోతోంది.. అందుకు ఉదాహరణగా నిలుస్తుంది ఉల్లిరైతు పరిస్థితి. కోస్తే కంట కన్నీరు పెట్టించే ఉల్లిపాయలు.. ఇప్పుడు తనని పండిస్తున్న రైతు కంట కూడా కన్నీరుపెట్టిస్తోంది. రూపాయికి టీ కూడా రావడం లేదు.. అంతెందుకు రూపాయి ఇస్తే.. బిచ్చగాడు కూడా వద్దు అంటున్నాడు అయితే ఆ రాష్ట్రంలో కేజీ ఉల్లిపాయ ధర కేవలం రూపాయి నాలుగు పైసలు పలికింది. దీంతో ఉల్లిరైతు కన్నీరుని కళ్లకుగడుతున్న మరో ఉదంతం తెరపైకి వచ్చినట్లు అయింది.
పతనమైన ఉల్లిధరలు రైతులను కన్నీళ్ళు పెట్టిస్తున్నాయి. ఇది గుజరాత్‌లోని ఉలిరైతు పరిస్థితి. 472 కేజీల ఉల్లిపాయలు అమ్మితే ఆ రైతుకు వచ్చింది రూ.495 మాత్రమే. అయితే ఈ ఉల్లిని అమ్మడం కోసం మార్కెట్ కు తీసుకొచ్చినందుకు అయిన రవాణ ఖర్చే 626 రూపాయలు. ఆరుగాలం కష్టించిన రైతుకి ఉల్లి పంటను అమ్మడంతో లాభాలు లేకపోయినా.. కనీస ధర కూడా రాకపోగా.. 131 రూపాయలు నష్టం వచ్చింది. దీంతో రైతులు తమకు కనీసం రవాణా ఖర్చుకూడా రాలేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు.
మరోవైపు ఇటీవలే మహారాష్ట్రలో ఓ రైతు 5 క్వింటాళ్ళ ఉల్లిపాయలు అమ్మితే ఆ రైతుకి అక్షరాలా 2 రూపాయల చెక్కు చేతికిచ్చిన ఘటన రైతు దిమ్మదిరిగేలా చేసింది. ఇప్పుడు గుజరాత్, మహారాష్ట్రలోనే కాదు. ఉల్లి ధరలు దేశవ్యాప్తంగా రైతుకి కన్నీళ్ళు తెప్పిస్తోన్న స్థితి హడలెత్తిస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..