AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bulldozer: సైనికుల కోసం స్పెషల్‌ బుల్‌డోజర్‌.. ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా భారత శాస్త్రవేత్తల తయారీ

రెండు రకాల CSRV లను జమ్ము కశ్మీర్‌లోని భద్రతా బలగాలకు అప్పగించారు. ఈ బుల్‌డోజర్లు ఇప్పుడు జమ్మూ కశ్మీర్‌లో సూపర్‌ హిట్‌గా నిలిచాయి. ఉగ్రవాదులు దాక్కున్న ఇళ్ల నుంచి వారిని తరిమికొట్టేందుకు ఈ బుల్‌డోజర్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.

Bulldozer: సైనికుల కోసం స్పెషల్‌ బుల్‌డోజర్‌.. ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా భారత శాస్త్రవేత్తల తయారీ
Csrv For Indian Army
Surya Kala
|

Updated on: Mar 03, 2023 | 9:20 AM

Share

ఉగ్రవాదులను మట్టుబెట్టడం చాలా కష్టం. ఆయుధాలతో సైన్యం ఉన్నా కొన్నిసార్లు ఉగ్రమూకలు తృటిలో తప్పించుకుంటాయి. మహిళలు, పౌరులు అనే విచక్షణ ఉండదు కాబట్టి ఉగ్రవాదులు చెలరేగిపోతారు. భారత భద్రతదళాలు దగ్గరున్న కొత్త ఆయుధంతో ఇక ఉగ్రమూకల ఆటలకు చెక్‌ పడినట్టే. జమ్ము కశ్మీర్‌లో సాధారణ పౌరుల ఇళ్లలోకి చొరబడి కాల్పులు జరపడం ఉగ్రవాదులకు పరిపాటిగా మారింది. ఇకపై ఈ ఆటలు సాగవు

దేశ రాజకీయాల్లో బుల్‌డోజర్లు సృష్టిస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. బుల్‌డోజర్‌ రాజకీయాలు సుప్రీంకోర్టు వరకు వెళ్లిన సందర్భాలూ ఉన్నాయి. రాజకీయ ప్రతిఘటనకు మారుపేరుగా మారింది బుల్‌డోజర్‌. మాఫియా ముఠాలను మట్టిలో కలిపేందుకు బుల్‌డోజర్లు ఈ మధ్య కాలంలో చాలా ఉపయోగపడుతున్నాయి. ఈ బుల్‌డోజర్‌ మాత్రం పూర్తిగా డిఫరెంట్‌. ఇది చాలా అడ్వాన్స్‌డ్‌ బుల్‌డోజర్‌. గోడలు కూల్చేందుకు కాదు ఉగ్రవాదులను ముట్టుబెట్టేందుకు ఉపయోగపడుతుంది ఈ హైటెక్‌ బుల్‌డోజర్‌. ఇది ఆషామాషీగా ఉండదు, ఇందులో సైనికదళాలు సురక్షితంగా ఉండేందుకు బంకర్‌ కూడా ఉంది. దీన్ని బుల్లెట్లు ఏమి చేయలేవు, బాంబులూ ఏం చేయలేవు.

జమ్ము కశ్మీర్‌లో సైనికులకు అందుబాటులో ఉంచిన ఈ వాహనాన్ని ప్రేక్షకులకు చూపేందుకు టీవీ9 ప్రతినిధి ఎంతో శ్రమించారు. ఎంతో కష్టపడి సైనికాధికారుల నుంచి అనుమతి తీసుకున్నారు. యాంటీ టెర్రర్‌ బుల్‌డోజర్‌గా దీనికి పేరు పెట్టారు. దీన్ని క్రైసిస్‌ సిచ్యూయేషన్‌ రెస్పాన్స్‌ వెహికిల్‌ లేదా CSRVఅని కూడా అంటారు. రెండు రకాల CSRV లను జమ్ము కశ్మీర్‌లోని భద్రతా బలగాలకు అప్పగించారు. ఇందులో ఒకటి పెద్దది, మరొకటి చిన్నది. చిన్న వాహనాన్ని సన్న సందుల్లోకి కూడా తీసుకెళ్లవచ్చు. పెద్ద CSRV తయారీ కోసం పెద్ద JCBని మాడిఫై చేశారు. గ్రేడ్‌ 4 మెటల్‌తో దీన్ని రూపొందించారు. చెప్పాలంటే ఇది బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనం.

నలుగురు జవాన్లు, ఒక కమాండర్‌, ఒక ఆపరేటర్‌ ఈ వాహనంలో కూర్చొవచ్చు. ఫైరింగ్‌ కోసం ఇందులో ప్రత్యేకమైన పాయింట్స్‌ ఏర్పాటు చేశారు. వాటి ద్వారా ఉగ్రవాదులను మట్టుబెట్టవచ్చు. CSRV 180 నుంచి 360 డిగ్రీల వరకు తిరుగుతుంది. 18 నుంచి 20 అడుగుల ఎత్తు వరకు ఇది పైకి లేస్తుంది. ఇందులో నైట్‌విజన్‌ కెమెరా, లైట్లు కూడా ఉన్నాయి. కెమెరాలో చూస్తు కమాండర్‌- సైనికులకు ఆదేశాలు ఇచ్చే వెసులుబాటు ఇందులో ఉంది.ఈ ఆపరేషనల్‌ ఆర్మ్‌డ్‌ వెహికిల్‌ను భారీ ఆపరేషన్లలో ఉపయోగించవచ్చు.

దీనికి టైర్లు ఉండవు, ఇందులో చైన్‌ సిస్టమ్‌ ఉంది. ఇది కొండలు, గుట్టల నుంచి కూడా వెళ్తుంది. ఈ బుల్‌డోజర్లు ఇప్పుడు జమ్మూ కశ్మీర్‌లో సూపర్‌ హిట్‌గా నిలిచాయి. ఉగ్రవాదులు దాక్కున్న ఇళ్ల నుంచి వారిని తరిమికొట్టేందుకు ఈ బుల్‌డోజర్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.

ఇది మా దగ్గరకు వచ్చినప్పటి నుంచి మేము దీన్ని ఉపయోగిస్తున్నాం. ఇది మాకు ఎంతగానో సాయపడుతోంది. ఇది వచ్చిన తర్వాత విజయాలు కూడా అందుకుంటున్నామని ఆర్మీ అధికారులు చెప్పారు. ఈ వాహనం నుంచి ఉపయోగించే ఆయుధాలు ప్రత్యేకమైనవే కాదు హైటెక్కే కూడా. ఇందులో అమర్చిన థర్మల్‌ కెమెరాల ద్వారా గోడ వెలుపలి వైపు కూడా చూడవచ్చు. అక్కడి నక్కి ఉండే ఉగ్రవాదులను మట్టుబెట్టవచ్చన్నారు.

లెవల్‌ 4 నింజా హెల్మెట్‌. ఆర్మీ జవాన్లకు ఎంతో రక్షణ కల్పిస్తుంది. ఇందులో వైర్‌లెస్‌ కెమెరా ఉంది. ఇది ఇండియాలో తయారైనది. ఈ ఆయుధం రేంజ్‌ 200-300 మీటర్లు ఉంటుంది. ఇందులో 30 రౌండ్లు ఉంటాయి. ఇండియాలో ఇప్పటికే దీని వినియోగం మొదలైంది. ఇప్పటివరకు ఐదారుసార్లు మాత్రమే ఇది ఉపయోగపడింది. ఈ తరహా ఆర్మ్‌డ్‌ వెహికల్స్‌ వినియోగం ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్ల ఉంది. ఇజ్రాయేల్‌, ఆమెరికా, ఆస్ట్రియా, జర్మనీ వంటి దేశాల్లో వీటిని ఉపయోగిస్తున్నారు.

ఈ వాహన ఉపయోగం, కలిగే లాభాల గురించి CRPF DIG ఆలోక్‌ అవస్తితో టీవీ9 మాట్లాడింది. ఉగ్రవాదులు ఉంటేనే కేవలం వారిని మాత్రమే మట్టుబెట్టాలన్నది మా లక్ష్యం. ఈ క్రమంలో పౌరులకు నష్టం కలుగకుండా, మాకు నష్టం కలుగుకుండా చూస్తాం. మా అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ తరహా వాహనాలను శాస్త్రవేత్తలు అభివృద్ధిపరిచారు. ఇందులో మా సైనికులు సురక్షితంగా ఉంటారు. కొల్లెటరల్‌ డ్యామేజీ జీరో, మేము పిన్‌ పాయింటెడ్‌గా శత్రువులను చుట్టుముడతాం. సాధారణ JCBలో కూడా మేము 365 డిగ్రీ బంకర్‌ తయారు చేశాం. దాని ద్వారా మూడో అంతస్తు ఎత్తు వరకు వెళ్లి టార్గెట్‌ చేయగలమని చెప్పారు.

CSRV మేడిన్‌ ఇండియా. దీని ద్వారా ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టగలగడమే కాదు సైనిక బలగాల్లో ఇది ఆత్మవిశ్వాసం నింపుతోంది. ఈ వాహనం ఖరీదు 55 లక్షల రూపాయలు. విదేశాల్లో అయితే దీని ధర 6 కోట్ల రూపాయల వరకు ఉంటుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..