AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karnataka: కర్ణాటక ఎన్నికలకు ముందు బీజేపీకి షాక్‌.. లంచం తీసుకుంటూ పట్టుబడిన ఎమ్మెల్యే కొడుకు..

కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార బీజేపీకి షాక్ తగిలింది. BJP ఎమ్మెల్యే కుమారుడు లంచం తీసుకుంటూ లోకాయుక్తకు అడ్డంగా దొరికిపోయాడు.

Karnataka: కర్ణాటక ఎన్నికలకు ముందు బీజేపీకి షాక్‌.. లంచం తీసుకుంటూ పట్టుబడిన ఎమ్మెల్యే కొడుకు..
Karnataka News
Shaik Madar Saheb
|

Updated on: Mar 03, 2023 | 1:50 PM

Share

కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార బీజేపీకి షాక్ తగిలింది. BJP ఎమ్మెల్యే కుమారుడు లంచం తీసుకుంటూ లోకాయుక్తకు అడ్డంగా దొరికిపోయాడు. దావణగెరె జిల్లా చన్నగిరి బీజేపీ ఎమ్మెల్యే విరూపాక్షప్ప మదల్ కర్ణాటక సోప్స్ అండ్‌ డిటర్జెంట్స్‌ లిమిటెడ్‌ (కేఎస్‌డీఎల్‌) ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన కుమారుడు ప్రశాంత్‌ మదల్ తన కార్యాలయంలో 40 లక్షల రూపాయలు తీసుకుంటూ లోకాయుక్త అధికారులకు దొరికిపోవడం కలకలం రేపింది. రూ.40లక్షలు లంచం తీసుకుంటుండగా లోకాయుక్త అధికారులు ప్రశాంత్‌ ను అదుపులోకి తీసుకున్నారు. ప్రశాంత్‌ తన నుంచి లంచం డిమాండ్‌ చేసినట్లు ఓ కాంట్రాక్టర్‌.. వారం క్రితం లోకాయుక్తను ఆశ్రయించాడు. దీంతో ప్రశాంత్‌ను పట్టుకునేందుకు లోకాయుక్త అధికారులు వల పన్నారు. మైసూర్‌ శాండిల్‌ సబ్బు తయారు చేసే కాంట్రాక్టర్‌ ప్రశాంత్ చైర్మన్‌ కార్యాలయంలో 40 లక్షలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం జరిపిన సోదాల్లో కోటీ 70లక్షల నగదును గుర్తించామన్నారు అధికారులు. తన తండ్రికి బదులుగా ప్రశాంత్‌ లంచం తీసుకుంటున్నాడనే అనుమానాన్ని అధికారులు వ్యక్తం చేశారు.

బెంగళూరు వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (BWSSB) చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ అయిన ప్రశాంత్ కుమార్‌ను కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ (KSDL) కార్యాలయం నుంచి అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. కేఎస్‌డీఎల్‌ కార్యాలయం నుంచి కనీసం మూడు బ్యాగుల నగదు లభించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 2008 బ్యాచ్ కర్నాటక అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ అధికారి అయిన శ్రీ కుమార్ సబ్బు మరియు ఇతర డిటర్జెంట్‌ల తయారీకి అవసరమైన ముడిసరుకును కొనుగోలు చేయడానికి ఒక ఒప్పందం కోసం ఒక కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ పట్టుబడ్డారని.. కేఎస్‌డీఎల్‌ చైర్మన్‌ విరూపాక్షప్ప బదులు ఆయన సెటిల్‌మెంట్లు చేస్తున్నట్లు లోకాయుక్త అధికార వర్గాలు తెలిపాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..