భారత్‌కు పొంచి ఉన్న ఎల్‌ నినో ముప్పు.. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయ్‌!

సెప్టెంబర్ 2020 నుంచి కొనసాగుతోన్న లా నినాకు మూడేళ్ల తర్వాత బ్రేక్‌ పడనుంది. పసిఫిక్‌ సముద్రం మధ్య, తూర్పు ప్రాంత ఉపరితలంలో అధిక ఉష్ణోగ్రతలకు కారణమయ్యే ఎల్‌నినో ప్రభావం రాబోయే నెలల్లో..

భారత్‌కు పొంచి ఉన్న ఎల్‌ నినో ముప్పు.. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయ్‌!
El Nino Climate crisis
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 04, 2023 | 8:10 AM

సెప్టెంబర్ 2020 నుంచి కొనసాగుతోన్న లా నినాకు మూడేళ్ల తర్వాత బ్రేక్‌ పడనుంది. పసిఫిక్‌ సముద్రం మధ్య, తూర్పు ప్రాంత ఉపరితలంలో అధిక ఉష్ణోగ్రతలకు కారణమయ్యే ఎల్‌నినో ప్రభావం రాబోయే నెలల్లో పెరగనున్నదని ప్రపంచ వాతావరణ సంస్థ(డబ్ల్యూఎమ్‌వో) హెచ్చరించింది. ఈ ప్రాంతాల్లో సాధారణం కంటే 4 నుండి 5 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా ఉంటే ఎల్ నినో పరిస్థితులు ఏర్పడతాయి. రానున్న రోజుల్లో గ్లోబల్ టెంపరేచర్‌ అపాధారణ స్థాయిలో పెరిగే అవకాశం ఉందని డబ్ల్యూఎంఓ సెక్రటరీ జనరల్ పీటెరీ తాలస్ తెలిపారు. ఎల్‌-నినో ప్రభావం మార్చి-మే మధ్య 90 శాతం సంభవించవచ్చని పేర్కొంది. ఎల్‌నినో, లానినా ప్రభావాలు సహజంగా సంభవిస్తాయని డబ్ల్యూఎమ్‌వో తెల్పింది. వీటి ప్రభావం సీజనల్‌గా కురిసే వర్షపాతాలపై పడుతుందని, ఫలితంగా వర్షపాతం తగ్గి ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరగడానికి కారణమవుతున్నాయని డబ్ల్యూఎమ్‌వో పేర్కొంది. ఎల్ నినో సదరన్ ఆసిలేషన్ (ENSO) తాజా సమాచారం ప్రకారం.. ఎల్ నినో కారణంగా రాబోయే మూడేళ్లలో అంటే 2026లోపు ఒక ఏడాది అత్యంత వేడి సంవత్సరంగా నమోదయ్యే అవకాశం 93 శాతం ఉంది. ముఖ్యంగా భారత్‌లో వర్షపాతం తగ్గి హీట్‌వేట్‌ ప్రమాదం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ హెచ్చిరించింది.

గడచిన ఏళ్లలో 2016లో ఏర్పడిన ఎల్‌ నినో పరిస్థితులు ఎన్నడూలేని విధంగా అత్యంత వేడి వాతావరణాన్ని సృష్టించిన ఏడాదిగా మిగిలిపోయింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా భూగోళ ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతోంది. ఇది 2016 రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.