- Telugu News Photo Gallery Cinema photos Rashmi Gautam fires on netizens over Naga Shourya viral video
మరో ఆత్మహత్య కోసం ఎదురుచూస్తున్నారా?.. రష్మి గౌతమ్ ఫైర్
ఓ యువకుడు నడిరోడ్డుపై ప్రేయసి చెంప మీద కొట్టడం.. కారులో వెళుతున్న టాలీవుడ్ యువ హీరో నాగశౌర్య చూసి అతనితో గొడవకు దిగడం.. దీనిపై యాంకర్ రష్మి స్పందించడం..
Updated on: Mar 02, 2023 | 7:47 AM

ఓ యువకుడు నడిరోడ్డుపై ప్రేయసి చెంప మీద కొట్టడం.. కారులో వెళుతున్న టాలీవుడ్ యువ హీరో నాగశౌర్య చూసి అతనితో గొడవకు దిగడం.. తెలిసిందే

అమ్మాయి మీద చేయి చేసుకోవడం తప్పని, ఇందుకుగానూ సారీ చెప్పి తీరాల్సిందేనని వాదించగా ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది

ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ కొందరేమో రియల్ హీరో అని మెచ్చుకుంటుంటే, లవర్స్ మధ్య వంద సమస్యలు ఉంటాయి. నువ్వు మధ్యలో కల్పించుకోవడం అవసరమా? అంటూ నాగశౌర్యని విమర్శించడం మొదలుపెట్టారు

'వాడి గర్ల్‌ఫ్రెండ్ వాడిష్టం. ఆ అమ్మాయికి ఏం ప్రాబ్లమ్ లేనప్పుడు ఈ అతిగాడికి ఏం సమస్యో..', 'ఆ అమ్మాయి ఏం తప్పు చేసిందో ఎవడికి తెలుసు? అయినా వాడి లవర్‌ను వాడు కొట్టుకుంటుంటే నీకేంటి?', 'లవర్స్ మధ్య వంద గొడవలు ఉంటాయి. ఇప్పుడు అది గెలకడం అవసరమా', కొట్టడం తప్పే కానీ.. ఈ విషయం వల్ల ఆ అమ్మాయి తల్లిదండ్రులకి తెలిస్తే పరిస్థితి ఏంటి. ఇకపై ఆ అమ్మాయికి అన్ని టెన్షన్లే’ అంటూ కామెంట్లు చేశారు.

వీటి స్క్రీన్‌షాట్లను యాంకర్ రష్మీ ట్విటర్‌లో షేర్ చేస్తూ నాగశౌర్య చేసిన దాన్ని సమర్ధించింది.. సదరు నెటిజన్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 'వాడి లవర్ వాడి ఇష్టమట.. అమ్మాయినే సపోర్ట్ చేస్తున్నారంటూ కామెంట్లు చేయడం ఎంత సిగ్గుచేటు. తను ఎంత ఒత్తిడికి లోనవుతుందో ఎవరికి తెలుసు? మరో ఆత్మహత్య జరగాలని ఎదురుచూస్తున్నారా?' అని ఫైర్ అయింది.





























