‘నువ్వు లేకుండా ఎలా బతకాలి..’ నటి మేఘా ఆకాశ్ వైరల్ పోస్ట్
చల్ మోహన రంగ, డియర్ మేఘ, లై వంటి పలు చిత్రాల్లో నటించిన నటి మేఘా ఆకాశ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. తాజాగా మేఘా తన ఇన్‌స్టా ఖాతాలో..
Updated on: Mar 04, 2023 | 7:30 AM

చల్ మోహన రంగ, డియర్ మేఘ, లై వంటి పలు చిత్రాల్లో నటించిన నటి మేఘా ఆకాశ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే

మార్చి 1న మేఘా ఆకాశ్ అమ్మమ్మ మరణించిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ ఎమోషనలైంది

డియర్ అమ్మమ్మ.. నువ్వు లేకుండా ఎలా బతకాలి? ఇలాంటి ఒక రోజు వస్తుందని నేనెప్పుడూ ఊహించలేదు. ఎంతో సరదాగా ఉండేదానికి. అందరి కడుపు నింపి వారి ముఖాల్లో చిరునవ్వు చూసి సంతోషించేదానివి.

నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్‌వి. నా లవ్ గాసిప్స్ నీతో పంచుకునేదానిని. ఇకపై నీతో మాట్లాడలేను. నీ మాటలు వినలేనని అనుకుంటేనే బాధగా ఉంది. ఇప్పుడు నువ్వు కోరుకున్న నీ వ్యక్తి దగ్గరకు వెళ్లిపోయావు. మనం కలిసున్న ఆదివారాలు మర్చిపోలేను. ఇకపై ఆదివారాలు గతంలో మాదిరి ఉండవు. మనం మళ్లీ కలుసుకునేంత వరకు.. రిస్ట్ ఇన్ ఫీస్ మై ఫస్ట్ లవ్..' అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది.

అమ్మమ్మ మరణం పట్ల తన ఆవేదనను తెల్పుతూ.. నటి మేఘా ఆకాశ్ పెట్టిన పోస్టు నెట్టింట వైరల్ అవుతోంది. పలువురు అభిమానులు ఆమెను ఓదార్చుతూ కామెంట్లు పెడుతున్నారు.





























