HIV: హెచ్‌ఐవీ పేషెంట్‌కు ఇచ్చిన సిరంజితో చిన్నారులకు ఇంజెక్షన్.. ఏడాది చిన్నారికి పాజిటివ్.. ఆందోళనలో తల్లిదండ్రులు

ఇటాహ్ లోని రాణి అవంతి భాయి లోధి ప్రభుత్వ వైద్య కళాశాలలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఒక హెచ్‌ఐవీ పాజిటివ్ పేషెంట్ కు ఇంజెక్షన్ చేసిన సిరంజితో అనేక మంది చిన్నారులకు ఇంజెక్షన్ ఇచ్చాడు వైద్యుడు. అలా ఇంజెక్షన్ ఇచ్చిన చిన్నారుల్లో ఓ చిన్నారికి హెచ్‌ఐవీ పాజిటివ్‌ రిపోర్టు వచ్చింది.

HIV: హెచ్‌ఐవీ పేషెంట్‌కు ఇచ్చిన సిరంజితో చిన్నారులకు ఇంజెక్షన్.. ఏడాది చిన్నారికి పాజిటివ్.. ఆందోళనలో తల్లిదండ్రులు
Etah Medical College
Follow us

|

Updated on: Mar 05, 2023 | 9:13 AM

ఉత్తరప్రదేశ్‌లోని ఇటాహ్ మెడికల్ కాలేజీలోని ఎంసీహెచ్ విభాగంలో తీవ్ర నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది.హెచ్‌ఐవీ పాజిటివ్ పేషెంట్ కు వాడిన సిరంజితో తమ ఆస్పత్రికి చికిత్స కోసం వచ్చిన చిన్నారులకు ఇంజెక్షన్‌లు ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయం తెరపైకి రావడంతో కలకలం రేగింది. వెంటనే అస్వస్థతకు గురైన చిన్నారుల తల్లిదండ్రులు జిల్లా మెజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేశారు.

ఇటాహ్ లోని రాణి అవంతి భాయి లోధి ప్రభుత్వ వైద్య కళాశాలలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఒక హెచ్‌ఐవీ పాజిటివ్ పేషెంట్ కు ఇంజెక్షన్ చేసిన సిరంజితో అనేక మంది చిన్నారులకు ఇంజెక్షన్ ఇచ్చాడు వైద్యుడు. అలా ఇంజెక్షన్ ఇచ్చిన చిన్నారుల్లో ఓ చిన్నారికి హెచ్‌ఐవీ పాజిటివ్‌ రిపోర్టు వచ్చింది. వైద్యుల నిర్లక్ష్యం వల్ల దాదాపు ముగ్గురు చిన్నారుల ప్రాణాలకు ముప్పు వాటిల్లిందని.. హెచ్‌ఐవీ సోకిన చిన్నారిని వైద్యులు డిశ్చార్జి చేశారని వాపోతున్నారు. బాలిక తల్లిదండ్రులు జిల్లా మేజిస్ట్రేట్ అంకిత్ కుమార్ అగర్వాల్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ వ్యవహారంపై డీఎం విచారణకు ఆదేశించారు. ఈ మొత్తంపై విచారణ జరుపుతామని అధికారి తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

విచారణకు ఆదేశించిన డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్ 

ఇవి కూడా చదవండి

అదే సమయంలో డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌ను వివరణ కోరినట్లు బ్రజేష్ పాఠక్ తెలిపారు. ఈ వ్యవహారంపై  విచారణ జరిపి త్వరలో నివేదిక పంపాలని ఉపముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. వైద్యుడు దోషిగా తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని  తెలిపారు.

రోగి తల్లి ఆందోళన 

ఆసుపత్రిలో చేరిన బాలిక తల్లి మీనాక్షి తన కూతురుకి ఏడాది వయసు అని చెప్పింది. తన కూతురుకి డాక్టర్లు ఇంజెక్షన్ ఇచ్చారు. అయితే.. తన కూతురుకి సమీపంలో మరొక పిల్లను కూడా చేర్చుకున్నారు. ఆ చిన్నారికి వైద్యుడు ఏ సిరంజితో ఇంజక్షన్‌ చేసేవాడో.. అదే సిరంజితో తన కూతురికి ఇంజక్షన్‌ ఇచ్చేవారని చెప్పింది మీనాక్షి.. ఇదే విషయంపై పలుమార్లు ఆస్పత్రిలోని ఉద్యోగులతో చెప్పినా ఎవరూ తమ గోడుని పట్టించుకోలేదని వాపోయింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే తనకూతురుకి ఇప్పుడు ఎయిడ్స్ నిర్ధారణ అయిందని.. బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తోంది బాధితురాలి తల్లి మీనాక్షి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..