Vedic Cricket: రాజ్ కోట్‌లో రెండ్రోజుల బ్రాహ్మణుల టోర్నమెంట్.. ధోతీ, కుర్తాలో క్రికెట్, సంస్కృతంలో కామెంట్రీ..
క్రికెట్ అంటేనే జెర్సీలు, హెల్మెట్లు.. బూట్లు..బ్రాండెడ్ బ్యాట్లు..బాల్స్.. ఇవేనా.. అవన్నీ రొటీన్ కదా.. మడిసన్నాక కాసింత కళా పోషణుండాలంటూ అందుకే రూటు మార్చారు.. ధోతీలు కట్టుకుని చతుష్కం ప్రాప్తం అంటూ దుమ్మురేపుతున్నారు. ఫోర్ కొడితే చౌకా అంటారు. మామూలుగా క్రికెట్‌లో అయితే.. బాల్‌ను కసితీరా కొడితే బౌండరీ వైపు దూసుకెళ్తుంది.
పంచెలు కట్టుకుని శ్లోకాలు చదివినంత మాత్రాన ఆటలో పట్టు లేదంటే ఎలా.. వాళ్లు బ్యాటు పట్టుకుంటే..ప్రతి బాల్.. చతుష్కం ప్రాప్తం కావాల్సిందే..ప్రత్యర్థి ఎవరైనా సరే..వీళ్లు బౌలింగ్ చేశారంటే.. బహిష్కృతం అవ్వాల్సిందే..140 కి.మీ వేగశ్య బూమ్రా బంతేన గచ్ఛతి, బ్యాటరేన సాస్టాంగ..అని కామెంటరీ చెబుతుంటే మైండ్ బ్లాక్ రెడ్ గ్రీన్ అవ్వదూ.. ఏంటీ ఒక్కపక్క క్రికెట్ గురించి చెబుతూనే.. మరో పక్క అర్థం కాని సంస్కృతం చెబుతున్నారనుకుంటున్నారా.. మరి సంప్రదాయ ధోతీ, కుర్తాలో ఆడుతూ..ఫోర్లు, సిక్సర్లు బాదే క్రికెటర్లు ఇలాగే ఉంటారు..ఇంతకీ వీళ్ల ఆట, రన్నింగ్ కామెంట్రీ ఎలా ఉంటుందంటే..
క్రికెట్ అంటేనే జెర్సీలు, హెల్మెట్లు.. బూట్లు..బ్రాండెడ్ బ్యాట్లు..బాల్స్.. ఇవేనా.. అవన్నీ రొటీన్ కదా.. మడిసన్నాక కాసింత కళా పోషణుండాలంటూ అందుకే రూటు మార్చారు.. ధోతీలు కట్టుకుని చతుష్కం ప్రాప్తం అంటూ దుమ్మురేపుతున్నారు. ఫోర్ కొడితే చౌకా అంటారు. మామూలుగా క్రికెట్‌లో అయితే.. బాల్‌ను కసితీరా కొడితే బౌండరీ వైపు దూసుకెళ్తుంది. అప్పుడు అందరూ అంపైర్ ఫోర్ ఇచ్చాడా లేదా అన్నదే చూస్తుంటారు. కానీ.. వీళ్ల క్రికెట్‌లో అయితే..చతుష్కం ప్రాప్తం అని సంస్కృతం కామెంట్రీ వినిపిస్తుంది. ఇంకా సింపుల్ చెప్పాలంటే.. వీళ్లు ఫోర్ కొడితే..వ్యాఖ్యాత చౌకా అని సంబరంగా చెబుతాడు.
కర్మకాండి బ్రాహ్మణులు..అంటే.. హిందూ ఆచారాలను నిర్వహించడంలో అధికారిక శిక్షణ తీసుకున్నవారు.. ఇలాంటి వాళ్లతో 8 జట్లుగా ఏర్పాటు చేసి రాజ్‌కోట్‌లో రెండ్రోజుల పాటు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఆట మొదలైనప్పటి నుంచీ ధోతీ, కుర్తాలతో ఫోర్లు, సిక్సులు బాదుతూ..మధ్యలో సింగిల్స్ చేస్తూ.. ఉరుకులు పెడుతూ పరుగులు తీస్తున్నారు. ధోతీ ధరించి సంస్కృత శ్లోకాలను ఆలపించే బ్రాహ్మణులు క్రికెట్ ఆడలేరనే అపఖ్యాతిని తొలగించడానికే తాము క్రికెట్ ఆడుతున్నామంటున్నారు కర్మకాండి బ్రాహ్మణులు
క్రికెట్ అంటేనే ఇంగ్లీష్ కామెంట్రీ వినిపిస్తుంది. కొంత కాలం నుంచీ.. స్థానిక భాషల్లోనూ కామెంట్రీ వినిపిస్తున్నారు. ఇప్పడు వీటన్నింటికీ భిన్నంగా.. సంస్కృతంలో కామెంట్రీ వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రాచీన భారతీయ భాషల్లో ఇలాంటి ఎన్నో వినబడని పదజాలాన్ని..సంస్కృతంలో వినిపిస్తూ ఆసక్తి కలిగిస్తున్నారు. ఈ టోర్నమెంట్‌ను భూదేవ్ సేవా సమితి ప్రత్యేకంగా రాజ్‌కోట్, జామ్‌నగర్ కర్మకాండి బ్రాహ్మణుల కోసమే నిర్వహించింది. రాజ్‌కోట్‌కు 15 కిలోమీటర్ల దూరంలోని మోర్బీ రోడ్డులోని రతన్‌పూర్ గ్రామంలో ఈ టోర్నీ జరిగింది.. ప్రత్యేకమైన క్రికెట్ మ్యాచ్‌లను ఆసక్తిగా ఆస్వాదించే సమీప గ్రామాల ప్రేక్షకులతో మైదానం కిటకిటలాడింది. ఎందుకంటే రొటీన్‌కు డిఫరెంట్‌గా క్రికెట్ ఆడారు..
వీళ్లంతా పక్కా క్రికెటర్లు కాదు.. డైలీ వేద మంత్రాలు చదివే సనాతన బ్రాహ్మణులు.. మనం మదర్ టంగ్‌లో కూడా కొన్ని పదాలను సరిగా పలకలేము.. కానీ..వీళ్లు సంస్కృతాన్ని అవపోసన పట్టినవాళ్లు..క్రికెట్‌లో కూడా ప్రతి పదాన్ని సంస్కృతంలోనే మాట్లాడుతూ..సంస్కృతంలోనే కామెంట్రీ చేస్తూ ఆసక్తి రేకెత్తిస్తున్నారు. హిందీ, ఇంగ్లీషులోనే ఎందుకివ్వాలి.. సంస్కృతంలో కామెంట్రీ ఎందుకు చెప్పకూడదని ఎదురు ప్రశ్నిస్తున్నారు. ముందుముందు ఇలాంటి క్రికెట్ టోర్నీలు దేశమంతటా నిర్వహిస్తామని భూదేవ్ సేవా సమితి నిర్వాహకులు చెబుతున్నారు.
ధోతీ, కుర్తాలో క్రికెట్, సంస్కృతంలో కామెంట్రీ.. ఇదే వాళ్ల స్టైల్.. మనదేశంలో క్రికెట్‌కు ఎంతో ఆదరణ ఉంది. సెలవులు వచ్చాయంటేనే చాలు.. చిన్నా పెద్దా అందరూ మైదానంలో దిగుతారు. ఇండియా క్రికెట్ టీంకు కూడా ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. ప్రపంచ కప్ మొదలు కొని గల్లీ క్రికెట్ ఎంతో పేరుగాంచింది. అలాంటి క్రికెట్‌లో సాధారణంగా ఇంగ్లిష్ లేదా హిందీలో కామెంట్రీ వినింటాం. ఆయా రాష్ట్రాలో మ్యాచులు జరిగితే అక్కడి ప్రాంతానికి చెందిన భాషలోనే కామెంట్రీ చెబుతారు. ఇదంతా ఎప్పుడూ ఉండేదే.. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసీ వేద విద్యార్థులు ఆడిన క్రికెట్ మ్యాచ్ కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వారు పసుపు, కుంకుమ రంగుల్లోని భారతీయ కుర్తా, ధోతీ ధరించి క్రికెట్ ఆడుతూ అలరించారు.
2001లో విడుదలైన ఆమీర్‌ఖాన్ లగాన్ చిత్రం ఇప్పటికీ ఓ సంచలనమే భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా పల్లెటూరి ధోతీ, కుర్తాలోనే క్రికెట్ గ్రౌండ్‌లో దిగి బ్రిటీష్ టీంని ఓడిస్తారు. ఈ ఆటలో బ్రిటీష్ టీం సభ్యులంతా ఓ ప్రత్యేకమైన యునిఫాంలో ఆడగా ఆమీర్‌ఖాన్ జట్టు మాత్రం నిత్యం వేసుకునే దుస్తులతోనే మైదానంలో దిగుతారు. ధోతీ, కుర్తా ధరించి ఇంగ్లాండ్ టీమ్‌ను ఇరగదీస్తారు.. ధోతీలు కట్టుకున్నా ఎలాంటి తడబాటు లేకుండా సునాసయంగా ఫోర్లు సిక్స్‌లు కొడుతూ అలరించారు. వీరి ఆటను చూస్తుంటే మరోసారి లగాన్ చూసినట్లనిపించింది.
అయితే వీరంతా ధోతీ, కుర్తాలో క్రికెట్ ఆడి అలరిస్తే అక్కడ చెప్పే కామెంట్రీ సంస్కృతంలో చెప్పి వావ్ అనిపించారు. ఆట వివరాలు, పరుగులు. క్రీడాకారుల ఆటతీరంతా ఏ మాత్రం తడబడకుండా సంస్కృతంలోనే అనర్గళంగా కామెంట్రీ చెప్పారు. ఇదే అంశాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల మన్‌కీ బాత్ కార్యక్రమంలో ప్రస్తావించారు. భారతీయ సంస్కృతిని కాపాడుకునేందుకు ఈ వస్త్రధారణలో క్రికెట్ ఆడి, సంస్కృతంలో కామెంట్రీ చెప్పామన్న విద్యార్థుల దేశ భక్తిని చూసి మోదీ మంత్రముగ్ధులయ్యారు.
క్రికెట్ అంటే బ్రిటీషోళ్ల ఆట అయినప్పటికీ దానిని జెంటిల్‌మన్ గేమ్ అని పిలుస్తారు. అయితే కాశీలోని చుటియాధారి వేదపతి విద్యార్థులు కూడా సంప్రదాయ దుస్తుల్లో ఈ ఆట ఆడుతున్నారు.. వీళ్లంతా వీలు చిక్కినప్పుడల్లా.. వారణాసిలోని సంపూర్ణానంద్ స్పోర్ట్స్ గ్రౌండ్‌లో క్రికెట్ ఆడుతారు..ఇక్కడ సంస్కృతం, వేదాలు చదువుతున్న విద్యార్థుల బృందాలు తమ సంప్రదాయ దుస్తుల్లో ఫోర్లు, సిక్స్‌లు కొడుతున్నారు. కాశీలో జరిగిన మ్యాచ్‌లో నాలుగు జట్లు పాల్గొన్నాయి.ఈ జట్ల సభ్యులంతా.. మంగళాచరణం, వేదమంత్రాలు పఠిస్తూ మైదానంలోకి ప్రవేశించారు. బ్యాట్లు పట్టుకుని మంత్రాలు చదువుతూ బాల్‌ను చతుష్కం ప్రాప్తం చేశారు.
పొడవైన జుట్టు, తిలకధారణ..ధోతీ కుర్తాలు..ఇవే ఈ క్రికెటర్ల ఆహార్యం..వీళ్ల క్రికెట్‌ను వీక్షించేవాళ్లు కూడా కర్మకాండి బ్రాహ్మణులే..వీళ్ల దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉండవు.. గట్టిగా చప్పట్లు.. కొడుతూ సంస్కృతంలోనే పొగుడుతూ మాట్లాడుకుంటారు. ఇదంతా ఒక ప్రత్యేక విధానంలా కనిపిస్తుంది. ధోతీ, కుర్తాలతో ఆడే క్రికెట్‌ను కూడా దేశవాళీ స్థాయికి..అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని బ్రాహ్మణ క్రికెటర్లు చెప్పుకుంటున్నారు.
ఇండియాలో క్రికెట్కు ఉండే క్రేజే వేరు. భారత్లో క్రికెట్ను ఓ మతంలా భావిస్తారు. అందుకే మ్యాచ్ ఏదైనా..అభిమానులు క్రికెట్ను మాత్రం చూడటం మానరు. ఇక క్రికెట్లో కామెంటరీకి ప్రత్యేక స్థానముంది. క్రికెట్ ఆటకు మజా దక్కాలంటే అది కామెంటరీతోనే. కామెంటరీ లేని క్రికెట్ను ఊహించుకోలేము. సాధారణంగా క్రికెట్ కామెంటరీ ఇంగ్లీష్లోనే ఉంటుంది. మనదేశంలో హిందీలోనూ క్రికెట్ కామెంటరీ వినొచ్చు. ఈ మధ్య కాలంలో తెలుగు ప్రేక్షకుల కోసం తెలుగులోనూ కామెంటరీ వినిపిస్తున్నారు. అయితే ఈ కామెంటరీ సంస్కృతంలోనూ వినే అవకాశం ఉంది.
ఆ మధ్య కర్ణాటక బెంగళూరులో గల్లీక్రికెట్ ఆడుతుండగా..సంస్కృతంలో కామెంటరీ చేశారు.. బ్రాహ్మణ పిల్లలంతా క్రికెట్ ఆడుతున్న సమయంలో ఓ వ్యక్తి గుక్క తిప్పుకోకుండా సంస్కృతంలో కామెంటరీని వినిపించాడు. మంత్రాలు చదివినట్టు నాన్ స్టాప్‌గా..ప్రతీ బంతి గురించి వివరించాడు. సంస్కృతంలో క్రికెట్ కామెంటరీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీన్ని చూసిన మోదీ అదే వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. సంస్కృతంలో కామెంటరీ చెప్పిన యువకుడిని ప్రధాని మోదీ ప్రశంసించారు.
మనదేశంలో భాషలకు మూలమైనదిగా చెప్పుకునే సంస్కృతంలో క్రికెట్ కామెంటరీ ఎలా ఉంటుందంటే..బూమ్రా బౌలింగ్ చేయడాన్ని..140 కి.మీ వేగశ్య బూమ్రా బంతేన గచ్ఛతి, బ్యాటరేన సాస్టాంగ…అంటూ చెబితే ఎలా ఉంది.. సంస్కృతంలో క్రికెట్ కామెంట్రీ ఇలాగే ఉంటుంది. ప్లేయర్లంగా సుబ్బరంగా పంచెలు కట్టుకుని..నామాలు పెట్టుకుని..కొప్పులు కట్టుకుని..కుర్తాలు వేసుకుని..బ్యాటు పట్టుకుని పరుగులు తీస్తుంటే.. అవతల కామెంట్రీ వినిపిస్తుంటే.. అసలు..అద్భుతహా..అనుకోండి. ఇప్పుడు రాజ్‌కోట్‌లో కర్మకాండి బ్రాహ్మణులు కూడా ఇదే చేశారు. బంతిని ఊదేశారు. హైదరాబాద్‌లో కూడా వేదాలు చదువుకునే బ్రాహ్మణ విద్యార్థులు ధోతీలతో క్రికెట్ ఆడారు. పలువురి ప్రశంసలు అందుకున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..