Viral Video: లాక్ అప్‌లోని నిందితులు రీల్ షూట్.. ఇన్స్టాలో షేర్.. ఘటనపై ఎస్పీ సీరియస్..
ఈ నలుగురు నిందితులను పోలీసులు సుల్తానా చౌకీలోని లాకప్‌లో ఉంచారు. ఈ నిందితులు బెయిల్‌పై బయటకు వచ్చే లోపు.. లాకప్ లోపల, వెలుపల నుండి అనేక వీడియోలను రూపొందించారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు.
రాజస్థాన్‌లోని ఝుంఝును జిల్లాకు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. సుల్తానా పోలీస్ పోస్ట్‌లోని లాకప్‌లో ఉన్న నలుగురు యువకులు ఈ వీడియోను రూపొందించారు. ఈ వీడియో వైరల్ అయి.. ఝుంఝు పోలీసుల దృష్టికి చేరుకుంది. పోలీసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఎస్పీ ఈ విషయంపై విచారణకు ఆదేశించారు. ఖైదీల చేతికి మొబైల్ ఎలా వెళ్ళిందంటూ స్టేషన్ ఇన్‌ఛార్జ్ ను ఎస్పీ మృదుల్ కచావా ప్రశ్నించారు. అంతేకాదు ఖైదీలు వీడియో తీస్తుంటే.. పోలీసులు ఎక్కడున్నారని ప్రశ్నించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..తిమౌ ఛోటీ చురు నివాసి అయిన 19 ఏళ్ల చందన్ జాట్ హత్యా దాడికి సంబంధించిన కేసులో నిందితులైన మార్చి 1న కయంసర్‌లో నివాసముంటున్న 23 ఏళ్ల అమిత్ జాట్, 22 ఏళ్ల భవానీ జాట్‌తో పాటు మరో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ నలుగురు నిందితులను పోలీసులు సుల్తానా చౌకీలోని లాకప్‌లో ఉంచారు. ఈ నిందితులు బెయిల్‌పై బయటకు వచ్చే లోపు.. లాకప్ లోపల, వెలుపల నుండి అనేక వీడియోలను రూపొందించారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. ఈ వీడియో కొద్ది సేపటికే వైరల్‌గా మారడంతో ఝుంఝును ఎస్పీ ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.
హత్యానేరం కింద కేసు నమోదు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది జనవరి 4న కయంసర్ నివాసి వీరేంద్ర సింగ్ ఈ నలుగురు నిందితులపై చిరావా పోలీస్ స్టేషన్ లో తన తమ్ముడిని హత్య చేశారంటూ ఫిర్యాదు చేశాడు. జనవరి 3వ తేదీ రాత్రి 7.30 గంటల ప్రాంతంలో తన తమ్ముడు నరేంద్ర సింగ్ ఇంటి నుంచి బయటకు వెళ్లాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తహ్రీర్‌లో పేర్కొన్నాడు.
మార్గమధ్యలో అదే గ్రామానికి చెందిన కేయంసర్ నివాసి అమిత్ కుమారుడు హవాసింగ్ జాట్, భవానీ కుమారుడు విద్యాధర్ జాట్, సోను మీనా అలియాస్ సాకా సహా మరో ఐదుగురు యువకులు బొలెరోలో వచ్చి తన సోదరుడిపై దాడి చేశారని.. కర్రలు, రాడ్‌లతో కొట్టారని తెలిపాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన రేంద్ర సింగ్ ను చిరావాలోని ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అక్కడి నుంచి ప్రథమ చికిత్స అనంతరం ఝుంఝు కు తరలించారు.
రీల్ వీడియో వైరల్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో రకరకాల ఫోటోలు.. పాటలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఓ వీడియోలో నిందితులు బయటకు వస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. లాకప్ లోపల షూట్ చేసిన ఒక వీడియో కూడా ఉంది. అందులో నిందితులు నవ్వుతూ కనిపించారు.
దీంతో పాటు అరెస్టయిన నిందితుడి సోదరుడి వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో కత్తి వంటి ఆయుధాలతో కనిపిస్తున్నాడు. సమాజంలో భయాందోళనలు రేకెత్తించేందుకే ఈ వీడియో తీశారని.. ఇందుకోసం సోషల్ మీడియాలో ఈ వీడియోను కూడా పోస్ట్ చేశారు.
ఆర్డీ గ్యాంగ్‌తో సంబంధాలు ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్న పోలీసులు అరెస్టయిన నిందితులకు ఆర్డీ గ్యాంగ్‌తో సంబంధం కలిగి ఉండవచ్చని పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి. వాస్తవానికి ఈ వీడియో ఫస్ట్ టైం RD గ్రూప్ WhatsApp గ్రూప్ లో కనిపించింది. బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత కూడా నిందితులు ఇన్‌స్టాగ్రామ్‌లో RD గ్రూప్, బాజ్ గ్రూప్‌లను ట్యాగ్ చేశారు. బెయిల్ రావడంతో సంతోషం వ్యక్తం చేస్తూ వెల్ కమ్ బ్రదర్స్ వంటి కామెంట్స్ తో సోషల్ మీడియాలో తమ సంతోషం వ్యక్తం చేస్తున్నారు కొందరు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..