AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: పరీక్ష రాస్తున్న కొడుకు స్లిప్ ఇచ్చేందుకు వెళ్లి పోలీసులతో చావుదెబ్బలు తిన్న తండ్రి..వీడియో వైరల్

మొదటి రోజు అంటే మార్చి 2వ తేదీ మరాఠీ పేపర్. అదే రోజు.. తన కొడుకు పరీక్ష రాసేందుకు ఓ స్లిప్ ఇవ్వడానికి తండ్రి పరీక్ష కేంద్రానికి వెళ్ళాడు. పోలీసుల దృష్టిలో పడి చావు దెబ్బలు తిన్నాడు.

Viral Video: పరీక్ష రాస్తున్న కొడుకు స్లిప్ ఇచ్చేందుకు వెళ్లి పోలీసులతో చావుదెబ్బలు తిన్న తండ్రి..వీడియో వైరల్
Viral Video
Surya Kala
|

Updated on: Mar 05, 2023 | 11:48 AM

Share

ప్రస్తుతం మహారాష్ట్రలో టెన్త్, ఇంటర్ బోర్డు పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షల్లో ఎటువంటి చీటింగ్‌ జరగకుండా పరీక్షలను నిర్వహించేందుకు రాష్ట్ర విద్యామండలి సన్నద్ధమయింది. అయితే తాజాగా ఓ వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియోలో స్కూల్‌లో తన బిడ్డకు కాపీ స్లిప్ ఇచ్చేందుకు వెళ్లిన ఓ తండ్రిని పోలీసులు చితకబాదినట్లు కనిపిస్తుంది. ఈ వీడియో అంతకంతకూ వైరల్ అవుతోంది. ఈ ఘటన జల్గావ్ జిల్లాలోని చోప్రా తహసీల్‌కు చెందిన అడవాడ్ గ్రామానికి చెందిన నూతన్ జ్ఞాన మందిర్ విద్యాలయంలో చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

పరీక్ష జరుగుతున్న సమయంలో పరీక్షా కేంద్రానికి 100 మీటర్ల వరకు నిషేధిత ప్రాంతంగా ప్రకటించారు. నూతన్ జ్ఞాన మందిర్ విద్యాలయంలో 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు అంటే మార్చి 2వ తేదీ మరాఠీ పేపర్. అదే రోజు.. తన కొడుకు పరీక్ష రాసేందుకు ఓ స్లిప్ ఇవ్వడానికి తండ్రి పరీక్ష కేంద్రానికి వెళ్ళాడు. పోలీసుల దృష్టిలో పడి చావు దెబ్బలు తిన్నాడు.

ఇవి కూడా చదవండి

తనను పట్టుకున్న పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అతడిని కర్రలతో కొట్టారు. ఈ ఘటనను అక్కడున్న స్థానికులు తమ కెమెరాల్లో బంధించారు. అనంతరం వీడియో వైరల్ అయ్యింది. ప్రస్తుతం ఈ విషయంపై జల్గావ్ లో చర్చ మొదలైంది.

మొదట.. ఆ తండ్రిని గుర్తించి పరీక్ష కేంద్రానికి దూరంగా తీసుకుని వెళ్లారు. సమీపంలోకి రావొద్దని సలహా ఇచ్చారు. అయితే పోలీసుల సలహాలను లైట్ తీసుకున్నాడు. అక్కడ ఉన్న మిగిలిన వారు కూడా ఆ తండ్రికి అలా వెళ్ళవద్దు అని చెప్పారు. అయినప్పటికీ అతను వినకుండా తన కొడుక్కి కాపీ కొట్టేందుకు స్లిప్ ఇవ్వడానికి మళ్ళీ మళ్లీ ప్రయత్నించాడు. నిషేధిత ప్రాంతంలోకి వెళ్ళాడు. అప్పుడు ఆ తండ్రిని పోలీసులు కర్రలతో కొట్టారు. ఆ తర్వాత ఆ వ్యక్తి నేలపై పడిపోయాడు. వైరల్ వీడియోలో ఇదంతా స్పష్టంగా కనిపిస్తోంది.

పోలీసులను తేలిగ్గా తీసుకున్న తండ్రి  అతడిని కొట్టిన పోలీసు అధికారి పేరు గణేష్ వువా. జలగావ్ పోలీస్‌లోని ఈ అధికారులు అడవాడ పోలీస్ స్టేషన్‌లో అసిస్టెంట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ పోస్ట్‌పై పనిచేస్తున్నారు. ప్రస్తుతం అతడి చర్యపై పోలీసు శాఖ నుంచి ఎలాంటి స్పందన లేదు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..