Optical Illusion: గజిబిజి గందరగోళం.. ఈ ఫొటోలో సీక్రెట్ దాగుంది.. దానిని 15 సెకన్లలో కనిపెడితే మీ కళ్లల్లో పవర్ ఉన్నట్లే..
సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో ఫొటోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటోలు నెటిజన్లకు సవాల్ చేస్తూ గందరగోళానికి గురిచేస్తాయి. ఆ ఫొటోల్లో చూడటానికి ఏం లేనట్టు కనిపిస్తూ మన కళ్లను మోసం చేసేలా ఝలక్ ఇస్తుంటాయి.

సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో ఫొటోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటోలు నెటిజన్లకు సవాల్ చేస్తూ గందరగోళానికి గురిచేస్తాయి. ఆ ఫొటోల్లో చూడటానికి ఏం లేనట్టు కనిపిస్తూ మన కళ్లను మోసం చేసేలా ఝలక్ ఇస్తుంటాయి. వాస్తవానికి ఎక్కువ సమయం తీసుకోకుండా ఆప్టికల్ భ్రమల (ఆప్టికల్ ఇల్యూషన్) చిత్రాలను పరిష్కరించడం అనేది.. చాలా మందికి సాధ్యం కాదు. అయితే, తక్కువ సమయంలో ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటోలో ఉన్న విషయాలను గుర్తిస్తే.. మన చూపుతోపాటు, మైండ్ షార్ప్ గా ఉన్నట్లు అర్ధం.. అందుకే చాలా మంది ఆప్టికల్ ఇల్యూషన్స్, పజిల్స్ ను ఇష్టపడుతుంటారు. వీటి ద్వారా మన మైండ్ ఎంత షార్ప్ అనేది తెలిసిపోతుంది. తాజాగా అలాంటి ఆప్టికల్ ఇల్యూషన్ పజిల్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తప్పుగా ఉన్న ఈ పదాల మధ్య ఓ కరెక్ట్ పదం దాగుంది. దాన్ని కనిపెట్టడం పెద్ద సవాలుగా మారింది.
సాధారణంగా.. ఆప్టికల్ ఇల్యూషన్ టెస్ట్.. ఉత్కంఠతోపాటు విశ్వాసాన్ని పెంచుతుంది. సోషల్ మీడియాలో బాగా వైరలవుతోన్న ఈ ఫొటోలో GARILC పదాలు కనిపిస్తున్నాయి. దీనిలో ఓ కరెక్ట్ పదం దాగుంది. అదే GARLIC.. గార్లిక్ అంటే (GARLIC) అంటే తెలుగులో మసాలా దినుసు ఎల్లిపాయ.. అయితే, GARILC అనే పదాల మధ్య దాగున్న.. GARLIC పదం అందరినీ అయోమయానికి గురిచేస్తోంది.
ఈ ఫొటోలో మొత్తం 21 అడ్డం వరుసలు.. 9 నిలువు వరుసలు ఉన్నాయి. దీనిలో GARLIC పదం ఉంది.. కనిపెట్టండి.. ఈ ఫొటోలోని పదాన్ని 15 సెకన్లలో కనిపెట్టాలి. అలా కనుగొంటే.. మీ దృష్టి, మైండ్ షార్పుగా ఉందని అర్ధం. మరి మీరు ఈ ఆప్టికల్ ఇల్యూషన్ ఛాలెంజ్‌ని స్వీకరించడానికి సిద్ధంగా ఉంటే.. ఈ కింద ఇచ్చిన ఫొటోను ఒకసారి చూడండి..





Optical Illusion
చిత్రాన్ని జాగ్రత్తగా చూసినా కరెక్ట్ పదం కనిపించకపోతే.. చింతించకండి.. సమాధానం కనుగొనడానికి సహాయం చేస్తాం.. సమాధానం నిలువుగా తొమ్మిదవ వరుసలో GARLIC పదం దాగుంది.
ఇప్పుడు మీలో చాలామంది ఈ సమాధానాన్ని గుర్తించి ఉండవచ్చు.. కానీ కొంతమంది కొంచెం ఇబ్బందిగా ఉండవచ్చు. తొమ్మిద నిలువు వరుసలో ఐదవ వరుసలో దాగుంది.

Optical Illusion Pic
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..