Viral News: విమానంలో ఆగని ఆగడాలు.. మద్యం మత్తులో స్టూడెంట్ తోటి ప్రయాణికుడిపై మూత్ర విసర్జన..

అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో తోటి ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేసిన విద్యార్ధి. తీవ్రంగా పరిగణించిన విమాన సిబ్బంది. ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ కి ఫిర్యాదు చేశారు.

Viral News: విమానంలో ఆగని ఆగడాలు.. మద్యం మత్తులో స్టూడెంట్ తోటి ప్రయాణికుడిపై మూత్ర విసర్జన..
Sleeping Student Urinates
Follow us

|

Updated on: Mar 05, 2023 | 12:33 PM

ఇటీవల విద్యావంతులు కూడా విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తూ ఇతరులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. రైళ్లలో, బస్సుల్లో ఇలాంటి సంఘటనలు తరచూ మనం చూస్తుంటాం. కానీ ఈ మధ్య విమానాల్లో కూడా ఇలాంటి సంఘటనలు కనిపిస్తున్నాయి. ఆ మధ్య ఎయిర్‌ ఇండియా విమానంలో ఓ వ్యక్తి తోటి ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేసిన సంఘటన అందరికీ తెలిసిందే. ఈ ఘటన మరువకముందే ఇలాంటి సంఘటనే మరోటి తాజాగా వెలుగులోకి వచ్చింది. న్యూయార్క్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానంలో ఓ విద్యార్థి తోటి ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేశాడు. మద్యం మత్తులో జరిగిన ఆ పొరబాటుకు విద్యార్థి సదరు వ్యక్తికి క్షమాపణలు చెప్పాడు. దాంతో బాధితుడు అవతలి వ్యక్తి విద్యార్థి అని తెలిసి, అతని కెరీర్‌ పాడుకాకూడదనే ఉద్దేశంతో మానవతా దృక్ఫథంతో ఫిర్యాదు చేయలేదని, ఎయిర్‌పోర్ట్‌ వర్గాలు తెలిపాయి. కాగా నిందితుడు ఓ అమెరికా యూనివర్సిటీలో చదువుకుంటున్నాడు.

ఈ విషయాన్ని తీవ్రంగా తీసుకుంది విమానసిబ్బంది. ఘటనపై వెంటనే ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌కి సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన సీఐఎస్ఎఫ్ సిబ్బంది విమానం ఢిల్లీ చేరుకోగానే విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై విమానంలోని మరికొందరినుంచి పోలీసులు వివరాలు సేకరించినట్టు ఎయిర్‌పోర్ట్‌ సిబ్బంది తెలిపారు. పౌర విమానయాన నిబంధనల ప్రకారం.. తోటి ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేసినట్టు రుజువైతే నిందితులపై క్రిమినల్ కేసు పెట్టే అవకాశం ఉంది. నిందితులపై విమానప్రయాణాలు చేయకుండా కొంతకాలం పాటు నిషేధం విధిస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ