- Telugu News Photo Gallery Cinema photos Manchu Manoj weads mounika Reddy Going to To Kurnool with Huge Convey Photos Telugu Actors Photos
Manoj Weds Mounika: భారీ కాన్వాయ్‌తో తానే డ్రైవ్ చేస్తూ.. అత్తారింటికి మంచు మనోజ్..
మొత్తానికి ఒక్కటయ్యారు. ఇన్నేళ్లుగా నెట్టింట తిరిగిన న్యూస్‌ను.. రూమర్స్‌ను నిజం చేశారు. అంగరంగవైభవంగా జరిగిన వేడుకతో.. మళ్లీ ఫ్రెష్ గా సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు..
Updated on: Mar 05, 2023 | 12:47 PM

మొత్తానికి ఒక్కటయ్యారు. ఇన్నేళ్లుగా నెట్టింట తిరిగిన న్యూస్‌ను.. రూమర్స్‌ను నిజం చేశారు. అంగరంగవైభవంగా జరిగిన వేడుకతో..

మళ్లీ ఫ్రెష్ గా సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.. మన మంచు మనోజ్.. భూమా మౌనిక రెడ్డి పెళ్లి తరువాత కర్నూల్ బయలుదేరారు.

మార్చి 3న ఫిల్మ్ నగర్లో తన సోదరి మంచు లక్ష్మి నివాసంలో భూమా మౌనికరెడ్డిని వివాహం చేసుకున్నారు మనోజ్. ఇరువురి కుటుంబసభ్యులు.. సినీ ప్రముఖుల మధ్య వీరి మ్యారెజ్ ఘనంగా జరిగింది.

సినీ , రాజకీయ ప్రముఖులు వీరి పెళ్లికి హాజరై నూతన వధువరులను ఆశీర్వాదించారు. పెళ్లి అనంతరం కొత్త జంట ముందుగా కర్నూల్‌కు వెళ్లనుంది.

తాజాగా మనోజ్ తన సతీమణి మౌనిక రెడ్డితో కలిసి అత్తారింటికి బయలుదేరిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

తన సోదరి మంచు లక్ష్మి ఇంటి నుంచి నేరుగా మనోజ్, మౌనికలు కర్నూలుకు పయనమయ్యారు.

భారీ బందోబస్తు మధ్య రోడ్డు మొత్తం కార్లు.. కాన్వాయ్‌లతో వీరి ప్రయాణం సాగింది.

ఇందుకు సంబంధించిన ఫొటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

మొదట వీరు పొద్దుటూరు వెళ్లి అనంతరం ఆళ్లగడ్డ ప్రాంతంలోని మౌనిక తల్లిదండ్రుల సమాధులను దర్శించుకుని ఆశీర్వాదం తీసుకోనున్నారని సమాచారం.
