Manish Sisodia: సిసోడియా అరెస్ట్‌ను ఖండిస్తూ ప్రధాని మోదీకి విపక్షాల లేఖ..

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్‌ను ఖండిస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి విపక్షాలు లేఖ రాశాయి. తెలంగాణ ముఖ్యమంత్రి సహా 9 మంది విపక్ష నేతలు ప్రధాని మోదీకి లేఖ రాశారు.

Manish Sisodia: సిసోడియా అరెస్ట్‌ను ఖండిస్తూ ప్రధాని మోదీకి విపక్షాల లేఖ..
Pm Modi
Follow us

|

Updated on: Mar 05, 2023 | 11:02 AM

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్‌ను ఖండిస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి విపక్షాలు లేఖ రాశాయి. తెలంగాణ ముఖ్యమంత్రి సహా 9 మంది విపక్ష నేతలు ప్రధాని మోదీకి లేఖ రాశారు. దేశం ప్రజాస్వామ్యం నుంచి నిరంకుశత్వం వైపు పయనిస్తోందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు నేతలు. ప్రతిపక్షాలపై ఇలాంటి చర్యలు నిరంకుశత్వమని నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని లేఖ రాసిన వారిలో సీఎంలు, మాజీ సీఎంలు, ముఖ్య నేతలు ఉన్నారు.

ప్రతిపక్షాలపై సీబీఐ, ఈడీలను ప్రయోగిస్తున్నారని, కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందంటూ బీజేపీ పాలనా విధానాలను తూర్పారబట్టారు. అంతేకాదు.. విపక్షాలపై దర్యాప్తు సంస్థలతో దాడులు చేయడం, బీజేపీలో చేరగానే ఆ కేసులను నీరుగార్చడం జరుగుతోందని విమర్శించారు. అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిస్వా శర్మను ఉదాహరణగా పేర్కొంటూ సంచలన ఆరోపణలు చేశారు. ప్రత్యర్థి పార్టీల నుంచి నేతలను చేర్చుకోవడం, ఆపై క్లిన్‌చిట్ ఇస్తున్నట్లు లేఖలో తూర్పారబట్టారు.

గవర్నర్ వ్యవస్థపైనా విమర్శలు..

ఈ లేఖలో విపక్ష నేతలు గవర్నర్ల వ్యవస్థ దుర్వినియోగంపైనా సంచలన ఆరోపణలు చేశారు. గవర్నర్ల వ్యవస్థను అడ్డుపెట్టుకుని, ప్రభుత్వాలను పరిపాలన చేయకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో కేంద్ర ప్రభుత్వ సంస్థల ప్రతిష్ట మసకబారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

బీజేపీ ఏం సమాధానం చెబుతుంది?

కాగా, ఈ లేఖపై బీజేపీ నుంచి ఇంతవరకు ఎలాంటి స్పందన రాలేదు. ఈ లేఖపై బీజేపీ ఎలా స్పందిస్తుంది? ఈ లేఖకు ప్రధాని నరేంద్ర మోదీ సమాధానమిస్తారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా దర్యాప్తు సంస్థల దుర్వినియోగంపై బీజేపీ ఏం సమాధానం చెబుతుందనేది ఇంట్రస్టింగ్‌గా మారింది.

ఈ నేతల సంతకాలు..

ఈ లేఖపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా సంతకాలు చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?