AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Garbha Sanskar: గర్భస్థ శిశువుకు గీత, రామాయణ పాఠాలు.. ‘గర్భ సంస్కారం’ కార్యక్రమాన్ని ప్రారంభించిన న్యాస్

శిశువు నెలలు గడిచే కొలదీ..తల్లి తీరుని పరిశీలిస్తుందని.. అనేక విషయాలు నేర్చుకుంటుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్‌ఎస్‌ఎస్‌తో అనుబంధం ఉన్న ఓ సంస్థ కడుపులో ఉన్న శిశువులకు 'సంస్కారం' అందించాలనే లక్ష్యంతో ఒక కార్యక్రమాన్ని తీసుకువస్తోంది.

Garbha Sanskar: గర్భస్థ శిశువుకు గీత, రామాయణ పాఠాలు.. 'గర్భ సంస్కారం' కార్యక్రమాన్ని ప్రారంభించిన న్యాస్
Garbha Sanskar
Surya Kala
|

Updated on: Mar 06, 2023 | 7:17 PM

Share

మహాభారతంలో అర్జునుడు తనయుడు తల్లి సుభద్ర గర్భంలో ఉన్న సమయంలోనే తండ్రి చెబుతున్న యుద్ధ నియమాలను విన్నాడట. అంటే గర్భస్థ శిశువు తల్లి గర్భంలో ఉన్న సమయంలోనే బాహ్యప్రపంచంలో జరిగే విషయాలను అభ్యసించే నేర్పు ఉందని తెలుస్తోంది. ఇదే విషయాన్నీ శాస్త్రజ్ఞలు కూడా తల్లి గర్భంలోని శిశువు నెలలు గడిచే కొలదీ..తల్లి తీరుని పరిశీలిస్తుందని.. తల్లి నుంచి భూమి మీదకు రాకుండానే అనేక విషయాలు నేర్చుకుంటుందని చెబుతున్నారు. అందుకనే గర్భిణీ స్త్రీ మంచి విషయాలను వినాలని.. సంతోషంగా జీవించలాని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆర్‌ఎస్‌ఎస్‌తో అనుబంధం ఉన్న ఓ సంస్థ కడుపులో ఉన్న శిశువులకు ‘సంస్కారం’ అందించాలనే లక్ష్యంతో ఒక కార్యక్రమాన్ని తీసుకువస్తోంది.

ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ సంస్థ అయిన సంవర్ధినీ న్యాస్ గర్భిణీ స్త్రీలకు కడుపులోనే సంస్కృతి, విలువలను నేర్పేందుకు ‘గర్భ సంస్కార్’ పేరుతో ప్రచారాన్ని ప్రారంభించింది. అదే విషయాన్ని సంవర్ధినీ న్యాస్ జాతీయ ఆర్గనైజింగ్ సెక్రటరీ మాధురీ మరాఠే తెలిపారు.

గర్భంలో ఉన్న శిశువులకు సాంస్కృతిక విలువలను అందించే విధంగా సంవర్ధినీ న్యాస్ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది.  గైనకాలజిస్టులు, ఆయుర్వేద వైద్యులు, యోగా శిక్షకులతో పాటు, గర్భధారణ సమయంలో గీతా పఠనం, రామాయణం..  యోగాభ్యాసంతో కూడిన కార్యక్రమాలను ప్లాన్ చేస్తోంది. ఈ కార్యక్రమాలను మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి రెండేళ్లలోపు శిశువుల వరకు అందించనున్నారు. “గర్భంలో ఉన్న శిశువు 500 పదాల వరకు నేర్చుకోగలదు కనుక గీత శ్లోకాలు, రామాయణ చౌపాయిలను పఠించడంపై దృష్టి సారించనున్నామని అన్నారు. గర్భ సంస్కార్ ప్రచారం ముఖ్య లక్ష్యం..  శిశువు కడుపులో ఉన్న సమయంలోనే ‘సంస్కారం’  నేర్చుకునేలా చూడడమని తెలిపారు. ఈ ప్రక్రియ శిశువుకు రెండు సంవత్సరాల వయస్సు వచ్చే వరకు కొనసాగుతుందని మాధురీ మరాఠే చెప్పారు.

ఇవి కూడా చదవండి

ఆర్‌ఎస్‌ఎస్ మహిళా విభాగం, రాష్ట్ర సేవికా సమితికి చెందిన సంవర్ధినీ న్యాస్..  ఈ ప్రచారంలో కనీసం 1,000 మంది గర్భిణీ మహిళలను చేరదీయాలని యోచిస్తోందని ఆమె చెప్పారు. ఇప్పటికే జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఒక వర్క్‌షాప్‌ను నిర్వహించారని, ఇందులో ఎయిమ్స్-ఢిల్లీకి చెందిన పలువురు గైనకాలజిస్టులు హాజరయ్యారని ఆమె తెలిపారు.

యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్‌లోని నివేదిక ప్రకారం.. గర్భంలో ఉన్నప్పుడే శిశువులు భాషను గ్రహించడం ప్రారంభిస్తారని అధ్యయనాలు చెబుతున్నాయి. గర్భధారణ వయసు 30 వారాల వచ్చినప్పుడు శిశువు వినే విధంగా ఇంద్రియ, మెదడులోని నాడులు అభివృద్ధి చేయబడతాయని చెప్పారు. దీంతో గర్భంలో ఉన్న శిశువు తల్లులు చెప్పే విషయాలు వింటారని పేర్కొన్నారు.

“పిల్లల మెదడును ప్రభావితం చేయడంలో తల్లిదే మొదటి ప్రాధాన్యత అని యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఫర్ లెర్నింగ్ అండ్ బ్రెయిన్ సైన్సెస్ సహ-రచయిత..  కో-డైరెక్టర్ ప్యాట్రిసియా కుహ్ల్ పేర్కొన్నట్లు వెబ్‌సైట్ పేర్కొంది. ” అచ్చు శబ్దాలు బిగ్గరగా వినిపిస్తుంటే వాటిని గర్భంలోని పిండి ఆసక్తిగా వింటుందని చెప్పారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..