Hunger Deaths: తల్లి మృతితో ఇద్దరు కుమార్తెలు ఆత్మహత్య.. ఆకలి, అనారోగ్యమే కారణం అంటున్న స్థానికులు
ముగ్గురు మరణానికి కారణం ఆకలి, అనారోగ్యం అని చెప్పారు. వీరికి తినడానికి సరైన ఆహారం లేదని.. దీంతో ఇరుగుపొరుగువారు ఇచ్చిన ఆహారంతో పొట్ట నింపుకునేవారని.. తినడానికి రొట్టెలు, కూరలు వంటివి ఇచ్చేవారని.. చెప్పారు.
ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌లోని ఉపర్‌కోట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భోజ్‌పురాలో చోటు చేసుకున్న హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వృద్ధురాలు అనారోగ్యంతో మరణించింది. అనంతరం ఆ మహిళ.. ఇద్దరు కుమార్తెలు కూడా ఆత్మహత్యకు పాల్పడ్డారు. తల్లి మరణంతో కుమార్తెలు తమ జీవితాలను ముగించారు. ఈ ఘటన తర్వాత ఆ ప్రాంతంలో సంచలనం నెలకొంది. ముగ్గురు మరణానికి కారణం ఆకలి, అనారోగ్యం అని చెప్పారు. వీరికి తినడానికి సరైన ఆహారం లేదని.. దీంతో ఇరుగుపొరుగువారు ఇచ్చిన ఆహారంతో పొట్ట నింపుకునేవారని.. తినడానికి రొట్టెలు, కూరలు వంటివి ఇచ్చేవారని.. చెప్పారు. ఒకే ఇంట్లో ఉన్న ముగ్గురి మరణానికి పేదరికం, ఆకలి కారణమని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. పోలీసుల స్పందిస్తూ.. వృద్ధురాలు అనారోగ్యంతో మృతి చెందిందని, దీంతో మనస్తాపం చెంది కుమార్తెలిద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారని చెబుతున్నారు.
థానా ఉపర్‌కోట్ ప్రాంతంలోని భోజ్‌పురాలో ఉన్న ఇస్లాంనగర్ నివాసి నగీనా చాలా కాలంగా అనారోగ్యంతో ఉంది. నగీనా వైద్య కళాశాలలో చికిత్స పొందుతుంది. అయితే సరైన వైద్యం అందకపోవడంతో పాటు.. పేదరికం కారణంగా సరైన ఆహారం తినక పోవడంతో నగీనా మృతి చెందింది. తల్లి మరణించడంతో కుటుంబ సభ్యులు రోధించారు. తల్లి నగీనా మరణంతో ఇద్దరు కుమార్తెలు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపగా.. ఒకే ఇంట్లో ముగ్గురు మరణించడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఆ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది.
పేదరికంతో ఉన్న ఈ కుటుంబంలో ఆకలి కేకలు మిన్నంటేవని.. దీంతో ఇరుగుపొరుగువారు రొట్టెలు కూడా పంపేవారు. నగీనాకు మొత్తం ఏడుగురు పిల్లలు.. ఇప్పుడు ఇద్దరు తల్లి మరణంతో ఇద్దరు కుమార్తెలు ఆత్మహత్య చేసుకోగా.. 3 సంవత్సరాల క్రితం ఒక కుమార్తె మరణించింది.
ఘటనపై పోలీసులు విచారణ ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నట్లు తమకు సమాచారం అందిందని ఎస్‌ఎస్పీ కళానిధి నైతాని సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. పోలీసులు ముగ్గురి మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం పంపారు
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..