Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మామూలు మోసగాళ్లు కాదు.. ముందే స్కెచ్ వేసి ఓ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నారు.. కట్ చేస్తే

అందరూ కష్టపడి సంపాదిస్తుంటే.. కొందరు మాత్రం సులభంగా సంపాదించాలన్న తపనతో అడ్డదారులు తొక్కుతున్నారు. తాజాగా.. బీమా కంపెనీకి మోసం చేద్దామనుకున్న ముగ్గురు వ్యక్తులకు దిమ్మతిరిగే షాక్ తగిలింది.

మామూలు మోసగాళ్లు కాదు.. ముందే స్కెచ్ వేసి ఓ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నారు.. కట్ చేస్తే
LIC Crime News
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Mar 09, 2023 | 12:02 PM

అందరూ కష్టపడి సంపాదిస్తుంటే.. కొందరు మాత్రం సులభంగా సంపాదించాలన్న తపనతో అడ్డదారులు తొక్కుతున్నారు. తాజాగా.. బీమా కంపెనీకి మోసం చేద్దామనుకున్న ముగ్గురు వ్యక్తులకు దిమ్మతిరిగే షాక్ తగిలింది. ముంబైలో జీవించి ఉన్న వ్యక్తిని ‘చనిపోయాడు’ అని నమ్మించి రూ.కోట్లలో జీవిత బీమా (LIC) సంస్థను మోసం చేయడానికి ప్రయత్నించిన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ముంబై పోలీసులు తెలిపారు. నిందితులను దినేష్ తక్సలే, అనిల్ లత్కే, విజయ్ మాల్వాడేగా గుర్తించారు. ఎల్‌ఐసీ అధికారి ఓంప్రకాష్ సాహు ఫిర్యాదు మేరకు ఫిబ్రవరి 21, 2023న ఐపీసీ సెక్షన్ 465, 467, 468, 479, 420, 120 (బీ), 511 కింద కేసు నమోదు చేసినట్లు ముంబై పోలీస్ డీసీపీ మనోజ్ పాటిల్ తెలిపారు.. దీనిపై విచారణను ముమ్మరం చేసినట్లు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2015 ఏప్రిల్ 21న దినేష్ తక్సలే అనే వ్యక్తి ఎల్‌ఐసీ నుంచి రూ.2 కోట్ల పాలసీ తీసుకున్నాడు. ఆ తర్వాత నిందితులు సుమారు ఏడాది పాటు సకాలంలో ప్రీమియం చెల్లించారని ప్రాథమిక విచారణలో తేలింది. ఆ తర్వాత 2017 మార్చి 14న ఈ కేసులో అరెస్టయిన ఇతర నిందితులు పూణేలోని బెల్వాండి పోలీస్ స్టేషన్ పరిధిలో 2016 డిసెంబర్ 25న రోడ్డు ప్రమాదంలో దినేష్ మరణించినట్లు బీమా క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.

Mumbai Crime News

Mumbai Crime News

ఈ దరఖాస్తును స్వీకరించిన ఎల్‌ఐసీ విచారణ ప్రారంభించింది. దాదాపు 6 ఏళ్ల విచారణ తర్వాత దినేష్‌ చనిపోలేదని ఎల్‌ఐసీ గుర్తించింది. ఎల్‌ఐసీ పాలసీని కొనుగోలు చేసేందుకు దినేష్ ఇచ్చిన పత్రాలు కూడా నకిలీవని ఎల్‌ఐసీ విచారణలో తేలింది.

ఇవి కూడా చదవండి

పాలసీని కొనుగోలు చేసే సమయంలో దినేష్ వ్యవసాయం చేస్తూ ఏడాదికి రూ.35 లక్షలు సంపాదిస్తున్నట్లు ఎల్‌ఐసీకి తెలిపినట్లు డీసీపీ పాటిల్ తెలిపారు. అంతేకాకుండా, అతను ఒక మెస్‌ను కూడా నడుపుతున్నాడని.. దాని ద్వారా అతనికి సంవత్సరానికి రూ.7-8 లక్షలు సంపాదిస్తున్నాడని పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..