Air India: బంగారం అక్రమ రవాణా చేస్తూ దొరికిన ఎయిర్ ఇండియా స్టాప్..
బంగారం అక్రమ రవాణా చేస్తూ ఎయిర్ ఇండియా విమానం క్యాబిన్ సిబ్బంది ఒకరు అడ్డంగా బుక్కయ్యాడు. తనిఖీల అనంతరం ఆ ఉద్యోగిని
బంగారం అక్రమ రవాణా చేస్తూ ఎయిర్ ఇండియా విమానం క్యాబిన్ సిబ్బంది ఒకరు అడ్డంగా బుక్కయ్యాడు. తనిఖీల అనంతరం ఆ ఉద్యోగిని అదుపులోకి తీసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు విచారిస్తున్నారు. వాయనాడ్‌కు చెందిన షఫీని కొచ్చి విమానాశ్రయంలో అరెస్టు చేసినట్లు కస్టమ్స్ ప్రివెంటివ్ కమిషనరేట్ తెలిపింది. అక్రమంగా 1,487 గ్రాముల బంగారం తరలిస్తున్న కస్టమ్స్ అధికారులు గుర్తించారు. బహ్రెయిన్-కోజికోడ్-కొచ్చి సర్వీసులో క్యాబిన్ క్రూ మెంబర్ షఫీ బంగారం తీసుకువస్తున్నట్లు కస్టమ్స్ సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన అధికారులు తనిఖీలు చేపట్టారు. బంగారాన్ని చేతులకు చుట్టి, చొక్కా స్లీవ్‌ను కప్పుకుని గ్రీన్ ఛానల్ గుండా తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఇదిలా ఉండగా, సింగపూర్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులను చెన్నై విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 6.8 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ 3కోట్ల 32లక్షల రూపాయలు ఉంటుందని చెన్నై కస్టమ్స్ తెలిపింది.
Kochi | Air India cabin crew Shafi, a native of Wayanad, was arrested at Kochi Airport for smuggling 1,487 gms of gold. The cabin crew was of Bahrain-Kozhikode-Kochi service. Further interrogation underway: Customs Preventive Commissionerate pic.twitter.com/1nxVzF2fA7
— ANI (@ANI) March 8, 2023
మరిన్ని వీడియోస్ కోసం: Videos
Ranbir Kapoor: సెలబ్రిటీ లైఫ్ ఈజీ కాదంటున్న రణబీర్.. ఏమైయింది అంటే..? వీడియో
Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్‌కు దిమ్మతిరిగే పంచ్ ఇచ్చిన బన్నీ.. వీడియో.
Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!