Chittur: ఆగని కాల్ మనీ ఆగడాలు.. వడ్డీ కట్టలేదని ఇంటికి తాళం.. అవమానంతో ఇంటి నుంచి వెళ్లిపోయిన మహిళ
మధ్య, సామాన్య తరగతి మనుషులు తమ అవసరాల కోసం అప్పుడికప్పుడు డబ్బులు తీసుకోవడానికి కొంతమంది వడ్డీవ్యాపారస్తులను ఆశ్రయిస్తారు. శక్తి మించి వడ్డీతో డబ్బులను అప్పు తీసుకుంటారు. ఆపై అసలు, వడ్డీ కట్టలేక నానా తిప్పలు పడతారు. వడ్డీ వ్యాపారస్తులు పెట్టె కష్టాలను అనుభవిస్తూ ఉంటారు. తాజాగా ఇటువంటి ఘటన చిత్తూరు జిలాల్లో చోటు చేసుకుంది.
చిత్తూరు జిల్లాలో వడ్డీ వ్యాపారుల ఆగడాలకు అంతులేకుండా పోతోంది. వడ్డీ కట్టలేదని ఇంటికి తాళం వేసిన ఘటన స్ధానికంగా చర్చనీయాంశం అయింది. ఫీరాన్ సాహెబ్ స్ట్రీట్ లో ఉంటోన్న పర్వీన్ బేగం వ్యాపారుల నుంచి కొంత డబ్బు అప్పుగా తీసుకుంది. సకాలంలో వడ్డీ కట్టలేదని ఇంటికి తాళం వేశారు వ్యాపారులు. రోజు వడ్డీ కోసం వేధిస్తున్నారని జిల్లా ఎస్పీకి స్పందనలో ఫిర్యాదు చేయడంతో వడ్డీ రాక్షసులు మరింతగా రెచ్చి పోయారు. పర్వీన్ బేగం పిల్లలు తమకు రేపటి నుంచి పరీక్షలని.. పరీక్షకు హాజరు కావాల్సిన ఉందని.. ఇంటికి తాళాలు వేయొద్దని కాళ్ళు పట్టుకొని వేడుకున్నారు. అయినప్పటికీ వడ్డీవ్యాపారుల హృదయాన్ని పిల్లల అభ్యర్ధన కరిగించలేదు. వారు కనికరించలేదు.
తన ఇంటికి తాళం వేయడం అవమానకరంగా భావించిన పర్వీన్ బేగం రెండ్రోజుల నుంచి కనిపించకుండా పోయింది. దీంతో బేగం ముగ్గురు పిల్లలు తమ తల్లి కనిపించక లేదంటూ పోలీసులను ఆశ్రయించారు. ఇంటికి తాళం వేయండంతో బయటే గత రెండు రోజులుగా కాలం వెళ్లదీస్తున్నారు పర్వీన్ బేగం ముగ్గురు పిల్లలు. పర్వీన్ ముగ్గురు పిల్లల్లో ఒకరు వాలంటీర్ కాగా.. మరో అమ్మాయి డిగ్రీ చదువుతోంది. మరోవైపు కాల్ మనీ ఘటనపై ఎస్పీ సీరియస్ అయ్యారు. పోలీసులతో ఇంటి తాళాలు తెరిపించిన వడ్డీ వ్యాపారుల ఆగడాలపై కేసు నమోదుకు ఆదేశించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..