Anantapur: గుప్పెడంత గుండెకు ఏమౌతుంది? కబడ్డీ ఆడుతూ కుప్పకూలిన 19 ఏళ్ల విద్యార్థి.. చికిత్స పొందుతూ మృతి..

గత వారం రోజులుగా ఎక్కడో చోట విద్యార్థులు హార్ట్ ఎటాక్ తో  మరణిస్తున్న వార్తలు వింటూనే ఉన్నాం.. తాజాగా అనంతపురంలో విషాదం నెలకొంది. 19 ఏళ్ల స్టూడెంట్ గుండెపోటుతో మృతి చెందాడు.

Anantapur: గుప్పెడంత గుండెకు ఏమౌతుంది? కబడ్డీ ఆడుతూ కుప్పకూలిన 19 ఏళ్ల విద్యార్థి.. చికిత్స పొందుతూ మృతి..
Tanuja Nayak
Follow us
Surya Kala

|

Updated on: Mar 07, 2023 | 8:31 PM

ఇటీవల జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే..  గుండె పోటు రావడానికి వయసుతో సంబంధం లేదనిపిస్తోంది. గత రెండేళ్లుగా సెలబ్రెటీలు, సామాన్యులు అందరూ జిమ్ చేస్తూనో.. డ్యాన్స్ చేస్తూనో రకరాల రీజన్స్ తో గుండెపోటుకు గురై హఠాత్తుగా మరణిస్తున్నారు. ఇప్పుడు స్టూడెంట్స్ వంతు వచ్చినట్లుంది. గత వారం రోజులుగా ఎక్కడో చోట విద్యార్థులు హార్ట్ ఎటాక్ తో  మరణిస్తున్న వార్తలు వింటూనే ఉన్నాం.. తాజాగా అనంతపురంలో విషాదం నెలకొంది. 19 ఏళ్ల స్టూడెంట్ గుండెపోటుతో మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే..

అనంతపురం పట్టణంలో ని PVKK కాలేజీలో మొదటి సంవత్సరం బీఫార్మసీ చదువుతున్న తనూజ నాయక్ (19) గుండెపోటుతో మరణించాడు. ఈనెల 1వ తేదీన కాలేజీ గ్రౌండ్లో కబడ్డీ ఆడుతూ తనూజ నాయక్ గ్రౌండ్ లోనే హఠాత్తుగా కుప్పకూలిపోయాడు. తనూజ నాయక్ ను చికిత్స నిమిత్తం బెంగళూరులోని ఎమ్మెస్ రామయ్య హాస్పిటల్ కు తరలించారు. బీఫార్మసీ విద్యార్థి చికిత్స పొందుతూ ఈరోజు తుది శ్వాస విడిచాడు.

మృతుడు తనూజ నాయక్ ది మడకశిర మండలం ఈ అచ్చంపల్లి తాండాకు చెందిన యువకుడు. ఆడుతూ పాడుతూ తిరిగే కన్న కొడుకు హఠాత్తుగా మరణించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గ్రామం శోకసంద్రంలో మునిపోయింది. తనూజ నాయక్.. కబడ్డీ ఆడుతూ కుప్పకూలిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..