AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Women’s Day: అంగవైకల్యాన్ని జయించి వాలంటీర్ నుంచి చైర్మన్‌గా ఎదిగిన ముంతాజ్ పఠాన్.. నేటి యువతకు ఆదర్శం

ముంతాజ్ పుట్టుకతోనే పోలియో వ్యాధి బారిన పడింది. దీంతో తన ఎదగటానికి ఎంతో కష్టపడింది. పదవ తరగతి వరకూ నేల మీద పాక్కుంటూ వెళ్లిన ముంతాజ్ తన వైకల్యాన్ని చూసి ఎప్పుడూ భయపడలేదు. ఏదో ఒకటి సాధించాలన్న తపనతోనే ముందడగు వేసింది.

Women's Day: అంగవైకల్యాన్ని జయించి వాలంటీర్ నుంచి చైర్మన్‌గా ఎదిగిన ముంతాజ్ పఠాన్.. నేటి యువతకు ఆదర్శం
Mumtaj Pathan
Surya Kala
|

Updated on: Mar 05, 2023 | 12:44 PM

Share

ధైర్యంతో ముందడగు వేస్తే అంగవైకల్యం వెనకడుగు వేస్తోంది. సమాజం వేసే నిందలు, ఆరోపణలు పట్టించుకోకండా పనిచేస్తే నేడు కాకపొతే రేపైనా విజయం తధ్యం అని నమ్మిన మహిళా ఆంధ్రప్రదేశ్ లోని అత్యున్నతమైన పదవిని చేపట్టారు. పదవిలోకి వచ్చిన తర్వాత కూడా సమాజ సేవే ధ్యేయంగా మందుడుగు వేస్తున్నారు. తన వైకల్యాన్ని దాటే క్రమంలో అనేక కష్టాలు పడినా ప్రస్తుతం సాధించిన ప్రగతి పలువురి ప్రశంసలు అందుకుంటుంది.

ముంతాజ్ పఠాన్… ఐదుగురి సంతానంలో నాలుగో వ్యక్తి.. తండ్రి సుభానీ పఠాన్ కట్టెల అడితిలో రోజు వారీ కూలీగా పనిచేసేవారు. తల్లి ఖతీజాబీ హౌస్ వైఫ్. తన ఐదుగురి సంతానంలో ఇద్దరూ అంకవైకల్యంతో ఉండటం ఆ కుటుంబాన్ని బాధించేది. ముంతాజ్ పఠాన్ అక్క టీకా వేసిన తర్వాత అంగవైకల్యాన్నికి గురైతే.. ముంతాజ్ పుట్టుకతోనే పోలియో వ్యాధి బారిన పడింది. దీంతో తన ఎదగటానికి ఎంతో కష్టపడింది. పదవ తరగతి వరకూ నేల మీద పాక్కుంటూ వెళ్లిన ముంతాజ్ తన వైకల్యాన్ని చూసి ఎప్పుడూ భయపడలేదు. ఏదో ఒకటి సాధించాలన్న తపనతోనే ముందడగు వేసింది. పదవ తరగతి వరకూ గుంటూరులోని ఎస్ కే బిఎం స్కూల్లో చదివిన ముంతాజ్ ఇంటర్, డిగ్రీ టిజేపిఎస్ కాలేజ్ నుండి పూర్తి చేసింది. ఆ తర్వాత తను ఎవరికి భారం కాకుండా ఉండాలన్న ఉద్దేశంతో ప్రవేటు జాబ్స్ చేసింది. ప్రవేటు జాబ్ చేసుకుంటూనే ఎంఏ పొలిటికల్ సైన్స్ ప్రవేటుగా పూర్తి చేసింది. డిగ్రీ చదువుతుండగానే సోషల్ సర్వీస్ లోకి అడుగు పెట్టింది. జేఎంజే సంస్థతో కలిసి అనేక సేవా కార్యక్రమాల్లో పొల్గొనేది. తను చేస్తున్న సేవా కార్యక్రమాలను అధికారులకు చూపిస్తూ తాను స్వచ్చందంగా పనిచేసేందుకు అవకాశం కల్పించాలని అధికారుల చుట్టూ తిరిగింది. చివరికి అప్పటి జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ మీ సేవా కేంద్రాన్ని ముంతాజ్ కు కేటాయించారు. దీంతో తనకు దగ్గరకు వచ్చే విభిన్న ప్రతిభావంతులకు మీ సేవా ద్వారా ఉచితంగానే అనేక సేవలు అందించేది.

అనంతరం వైసిపి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాలంటీర్ గా పని చేస్తానని ముందుకొచ్చింది. ఏడాది పాటు గుంటూరు నగరంలోనే వాలంటీర్ గా పనిచేసింది. అనంతరం ఆమె చేస్తున్న పనిని గమనించిన స్తానికులు ఆ సమాచారాన్ని ప్రభుత్వ పెద్దలకు చేర వేశారు. దీంతో ఆమెను 2021 లో ఆంద్రప్రదేశ్ విభిన్న ప్రతిభావంతులు, వయో వ్రద్దుల సహాయ సంస్థకు ఛైర్ పర్సన్ గా నియమించారు. ఇప్పటి వరకూ ఆ సంస్థకు మహిళను నియమించడం ఇదే మొదటి సారి. ముంతాజ్ పఠాన్ ముందు వరకూ పురుషులే ఆ సంస్థ ఛైర్మన్ లు గా వ్యవహరించారు. పదవి వచ్చిన తర్వాత కూడా తన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తుంది. ప్రభుత్వం ఇచ్చిన కారును స్వంతంగా తనే నడుపుకుంటూ డ్రైవర్ కు ఇవ్వాల్సిన జీతాన్ని పేదల కోసం ఖర్చు చేస్తుంది. బ్రతికి ఉన్నతం కాలం సమాజ సేవకే తాను అధిక ప్రాధాన్యత ఇస్తానని చెప్పింది. అంగవైకల్యం గురించి పట్టించుకోవద్దని, సమాజం నుండి వచ్చే విమర్శలను చెవికెక్కించుకోకుండా ధైర్యంతో ముందుడగు వేయాలని మహిళలను సూచించింది.

ఇవి కూడా చదవండి

ముంతాజ్ ను చిన్నప్పుడు తల్లిదండ్రులు ఏటి అగ్రహారంలో వదిలిపెట్టి తమ సొంతూరైన ఆదోని వెళ్లిపోయారు. దీంతో అక్కడే ఉండే మహిళ కుమారి ముంతాజ్ ను చేరదీసింది. ముంతాజ్ తన వద్ద దానిని తోటి వారి పంచి పెట్టేది ఆ గుణం చిన్నప్పటి నుండే ఉందని కుమారి తెలిపారు. తనకున్న దాంట్లో కొద్దిగానైనా పక్క వారికి ఇచ్చేదన్నారు. అటువంటి ముంతాజ్ ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో ఉండటం ఆనందంగా ఉందన్నారు. ఆమె ప్రతిభను, సేవా గుణాన్ని గుర్తించి ఛైర్ పర్సన్ గా నియమించిన జగన్ కు ధన్యావాదాలు తెలిపారు. అంతేకాదు తనకు పదవి ఉన్నా లేకపోయిన సేవ చేస్తూనే ఉంటానని ముంతాజ్ చెబుతుంది.

Reporter: T. Nagaraju

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..