Manchu Manoj: పెళ్లి తరువాత అత్తారింటికి మంచు మనోజ్.. కాన్వాయ్ చూస్తే కళ్లు చెదరాల్సిందే..
పెళ్లి అనంతరం కొత్త జంట ముందుగా కర్నూల్‌కు వెళ్లనుంది. తాజాగా మనోజ్ తన సతీమణి మౌనిక రెడ్డితో కలిసి అత్తారింటికి బయలుదేరిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలకు పెళ్లితో చెక్ పెట్టారు మంచు మనోజ్. మార్చి 3న ఫిల్మ్ నగర్లో తన సోదరి మంచు లక్ష్మి నివాసంలో భూమా మౌనికరెడ్డిని వివాహం చేసుకున్నారు మనోజ్. ఇరువురి కుటుంబసభ్యులు.. సినీ ప్రముఖుల మధ్య వీరి మ్యారెజ్ ఘనంగా జరిగింది. సినీ , రాజకీయ ప్రముఖులు వీరి పెళ్లికి హాజరై నూతన వధువరులను ఆశీర్వాదించారు. పెళ్లి అనంతరం కొత్త జంట ముందుగా కర్నూల్‌కు వెళ్లనుంది. తాజాగా మనోజ్ తన సతీమణి మౌనిక రెడ్డితో కలిసి అత్తారింటికి బయలుదేరిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
తన సోదరి మంచు లక్ష్మి ఇంటి నుంచి నేరుగా మనోజ్, మౌనికలు కర్నూలుకు పయనమయ్యారు. భారీ బందోబస్తు మధ్య రోడ్డు మొత్తం కార్లు.. కాన్వాయ్‌లతో వీరి ప్రయాణం సాగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతుంది. మొదట వీరు పొద్దుటూరు వెళ్లి అనంతరం ఆళ్లగడ్డ ప్రాంతంలోని మౌనిక తల్లిదండ్రుల సమాధులను దర్శించుకుని ఆశీర్వాదం తీసుకోనున్నారని సమాచారం.
2015లో మనోజ్ కు ప్రణతిరెడ్డితో వివాహం జరిగింది. కానీ 2019లో వీరిద్దరు పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. ఇక ఇటు మౌనికరెడ్డికి కూడా గతంలో బెంగుళూరుకు చెందిన ఓ వ్యాపారవేత్తతో పెళ్లి జరిగి విడాకులు అయ్యాయి. వీరిద్దరి ఇది రెండో పెళ్లి అన్న సంగతి తెలిసిందే. అయితే కొద్ది రోజులుగా మంచు మనోజ్ పెళ్లికి సంబంధించిన అనేక రూమర్స్ చక్కర్లు కొట్టాయి. ఈ క్రమంలోనే మార్చి 3న మంచు లక్ష్మి నివాసంలో మూడు మూళ్ల బంధంతో ఒక్కటయ్యారు మంచు మనోజ్, మౌనిక.
Lovely couple @HeroManoj1 and #BhumaMounika headed to Kurnool from Hyderabad with a huge Convoy. ??
First they will meet & take blessings from Ram Subbareddy garu in Proddatur & later the couple will pay tribute to Bhooma Nagireddy and Shobha Nagireddy in Allagadda.#MMWeds pic.twitter.com/KElYvpBbM4
— Phani Kandukuri (@phanikandukuri1) March 5, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.