AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dhanush-Selvaraghavan: ‘విడాకుల తర్వాత మానసిక క్షోభ.. ధనుష్ చెప్పిన మాట అదే’.. డైరెక్టర్ సెల్వరాఘవన్ కామెంట్స్.. 

కథానాయికగా వరుస అవకాశాలు అందుకుంటూ కెరీర్ మంచి పీక్స్ లో ఉన్న సమయంలోనే 2006లో సెల్వరాఘవన్‏ను వివాహం చేసుకుంది. 

Dhanush-Selvaraghavan: 'విడాకుల తర్వాత మానసిక క్షోభ.. ధనుష్ చెప్పిన మాట అదే'.. డైరెక్టర్ సెల్వరాఘవన్ కామెంట్స్.. 
Dhanush, Selvaraghavan
Rajitha Chanti
|

Updated on: Mar 04, 2023 | 2:26 PM

Share
చిన్న చిన్న మనస్పర్థల కారణంగా వైవాహిక జీవితాలకు ముగింపు పలుకుతుంటారు చాలా మంది. సామాన్యులు కాదు.. డివోర్స్ తీసుకునేవారిలో సెలబ్రెటీలే అధికంగా ఉంటున్నారు. గత కొద్ది రోజులుగా టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో పలువురు నటీనటులు డివోర్స్ తీసుకుని షాకిచ్చారు. అందులో తమిళ్ డైరెక్టర్ సెల్వరాఘవన్.. హీరోయిన్ సోనియా అగర్వాల్ ఒకరు. సోనియా.. 7/G బృందావన్ కాలనీ సినిమాతో వెండితెరకు పరిచయమైంది. ఈ సినిమా సమయంలోనే డైరెక్టర్ సెల్వరాఘవన్ తో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. కథానాయికగా వరుస అవకాశాలు అందుకుంటూ కెరీర్ మంచి పీక్స్ లో ఉన్న సమయంలోనే 2006లో సెల్వరాఘవన్‏ను వివాహం చేసుకుంది.
కొంతకాలం అనోన్యంగా సాగిన వీరి జీవితాల్లో మనస్పర్థలు వచ్చాయి.. దీంతో వీరు 2010 విడాకులు తీసుకున్నారు. తాజాగా ఈ విషయం గురించి ఓపెన్ అయ్యారు సెల్వరాఘవన్. ఇటీవల తమిళ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సెల్వరాఘవన్ మాట్లాడుతూ విడాకులు తీసుకున్న తర్వాత చాలా మానసిక క్షోభకు గురయ్యానని.. ఆ సమయంలోనే తన తమ్ముడు ధనుష్ ఓ మాట చెప్పారని అన్నారు.
“నేను, సోనియా కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకున్నాం. అప్పుడు నా తమ్ముడు ధనుష్ ఓ మాట చెప్పాడు. దీని గురించి త్వరగా బయటపడు. దేవుడు నీకు సరైన అవకాశం ఇస్తాడు. అప్పటివరకు ఒంటరిగానే ఉండు. నిజంగానే విడాకులు తీసుకున్న తర్వాత చాలా మానసిక క్షోభకు గురయ్యాను. కానీ సరైన సమయంలో నా జీవితంలోకి గీతాంజలి వచ్చింది. ఆమె వల్ల నా జీవితంలో పెను మార్పు చోటు చేసుకుంది. ఇద్దరం సంతోషంగా ఉన్నాం ” అంటూ చెప్పుకొచ్చారు. సెల్వరాఘవన్ కు.. గీతాంజలి రామన్ తో 2011లో రెండో వివాహం జరిగింది. మరోవైపు సోనియా ఇప్పటికీ ఒంటరిగానే ఉంటుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్