AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tunisha Sharma: తెరపైకి సీరియల్ హీరోయిన్ తునీషా ఆత్మహత్య కేసు.. నటుడు షీజన్ ఖాన్‏కు బెయిల్..

తాజాగా ఈ కేసులో నటుడికి మహారాష్ట్ర వసాయ్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ. లక్ష పూచీకత్తు, పాస్ పోర్ట్ సమర్పించాలనే షరతుతో అతడిని విడుదల చేయాలని శనివారం తీర్పునిచ్చింది.

Tunisha Sharma: తెరపైకి సీరియల్ హీరోయిన్ తునీషా ఆత్మహత్య కేసు.. నటుడు షీజన్ ఖాన్‏కు బెయిల్..
Tunisha Sharma
Rajitha Chanti
|

Updated on: Mar 04, 2023 | 3:07 PM

Share

హిందీ సీరియల్ హీరోయిన్ తునీషా శర్మ ఆత్మహత్య బుల్లితెర ఇండస్ట్రీలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. తాను నటిస్తోన్న సీరియల్ సెట్‏లోని మేకప్ గదిలో తునీషా ఉరివేసుకుని సూసైడ్ చేసుకుంది. గమనించిన యూనిట్ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆమె తుదిశ్వాస విడిచింది. తునీషా ఆత్మహత్య కేసులో ఆమె ప్రియుడు నటుడు షీజన్ ఖాన్ ను అరెస్ట్ చేసి రిమాండ్‏కు తరలించారు పోలీసులు. తాజాగా ఈ కేసులో నటుడికి మహారాష్ట్ర వసాయ్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ. లక్ష పూచీకత్తు, పాస్ పోర్ట్ సమర్పించాలనే షరతుతో అతడిని విడుదల చేయాలని శనివారం తీర్పునిచ్చింది.

తునీష్ శర్మను ఆత్మహత్యను ఉసిగొల్పాడనే ఆరోపణలతో గతేడాది డిసెంబర్ 25న షీజన్ ఖాను ను పోలీసులు అరెస్ట్ చేశారు.అనంతరం కోర్టులో హజరపరిచి జ్యూడీషియల్ కస్టడీలోకి తీసుకున్నారు. టీవీ సీరియల్స్‏తోపాటు పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది తునీషా. బాలనటిగా కెరీర్ ఆరంభించిన ఆమె ఇప్పుడిప్పుడే మెయిన్ రోల్స్ చేస్తుంది.

ఇవి కూడా చదవండి

అయితే ఆమె నటిస్తోన్న షూటింగ్ స్పాట్లోని మేకప్ గదిలో డిసెంబర్ 24న ఉరివేసుకుని సూసైడ్ చేసుకుంది. ఆమె మరణానికి ఆమె ప్రియుడు ఫ్రెండ్ హీరో షీజన్ ఖాన్ అని పోలీసులు నిర్ధారణకు రావడంతో ఆతడిని అరెస్ట్ చేయడం కూడా సెన్సేషన్ గానే మారింది. కొద్దిరోజులు ప్రేమలో ఉన్న వీరిద్దరు ఆ తర్వాత విడిపోయారు. అనంతరం కొద్ది రోజులకే తునీషా ఆత్మహత్య చేసుకోవడంతో అతడిపై ఆరోపణలు అనుమానాలు వ్యక్తమయ్యాయి.