Brahmotsavam: వైభవంగా వట్టెం వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. కలశాభిషేకంలో పాల్గొన్న జూపల్లి రామేశ్వరరావు దంపతులు
వట్టెం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తృతీయ పుష్కర బ్రహ్మోత్సవములు కన్నుల పండగలా నిర్వహిస్తున్నారు. శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీ మన్నారాయణ రామానుజ జీయర్ స్వామి మంగళ శాసనములతో ప్రతిష్ట చేయబడింది.
తెలంగాణ రాష్ట్ర తిరుపతిగా పేరుగాంచిన వట్టెం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తృతీయ పుష్కర బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నాగర్ కర్నూల్ జిల్లా, బిజినేపల్లి మండలం, వట్టెం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తృతీయ పుష్కర బ్రహ్మోత్సవములు కన్నుల పండగలా నిర్వహిస్తున్నారు. ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటవరకు ప్రాతఃకాలారాధన, అర్చన, సేవా కాలము, నివేదన, శాంతి పాఠం, తీర్థ ప్రసాద గోష్టి వైభవంగా జరుతున్నాయి. చతుస్థానార్చన, మూల మంత్ర హోమములు, శ్రీ సుదర్శన ఇష్టి కూడా నిర్వహిస్తున్నారు. నివేదన, పూర్ణాహుతి, బలి ప్రధానం, శాత్తు మొఱు, తీర్థ ప్రసాద గోష్టి నిర్వహిస్తున్నామని ఆలయ సిబ్బంది తెలిపారు. తృతీయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగిన సహస్ర కలశాభిషేకంలో శ్రీ చిన్న జీయర్ స్వామి, మైహోం గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు దంపతులు పాల్గొన్నారు. శ్రీ చిన్న జీయర్ స్వామి భక్తులకు మంగళాసీస్సులు ఇచ్చారు.
1986-87 ఏడాదిలో ఆలయ ఏర్పాటు సమయంలో ఇది కరువుజిల్లాగా ఉండేదని శ్రీ చిన్న జీయర్ స్వామి చెప్పారు. ఇక్కడ ఉన్న వేలాది ఎకరాలు భూమి సాగులోకి రావాలని ఆ దేవున్ని కోరుకున్నామన్నారు. దేవుడి అనుగ్రహం వల్లే ఇప్పుడు ఈ ప్రాంతం అభివృద్ధిలోకి వచ్చిందన్నారు. ప్రభుత్వం చేపట్టిన వెంకట్రాద్రి రిజర్వాయర్ ప్రాజెక్టుతో ఈ ప్రాంతమంతా సస్యశ్యామలం అవుతోందన్నారు శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి అన్నారు. ఇక్కడ కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వరస్వామి అనుగ్రహం అందరికీ ఉంటాయని స్వామిజీ తెలిపారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..