- Telugu News Photo Gallery Spiritual photos Astrology Tips For Tulsi: keep these things in mind while tulsi puja in telugu
Vastu Tips for Tulasi: మీ కోరికలు నెరవేరాలంటే.. తులసిని పూజించేటప్పుడు ఈ పరిహారాలు చేసి చూడండి
తులసి మొక్క విష్ణువుకు చాలా ప్రీతికరమైనది. అందుకే తులసికి హరిప్రియ అనే పేరు వచ్చింది. ప్రతి ఇంట్లో తప్పకుండా తులసి మొక్క ఉంటుంది. క్రమం తప్పకుండా పూజిస్తారు. నిత్యం తులసిని పూజించే ఇళ్లలో ఎల్లవేళలా సుఖసంతోషాలు ఉంటాయని, లక్ష్మీదేవి నివసిస్తుందని విశ్వసిస్తారు.
Updated on: Mar 03, 2023 | 12:26 PM

Vastu Tips

తులసి ఆకుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. తులసి మొక్కను ఇంట్లో ఉంచడం.. పూజించడం వలన అన్ని రకాల ప్రతికూల శక్తులు ఇంట్లో నుండి పారిపోతాయి. తులసి మొక్కను క్రమం తప్పకుండా పూజించడం వల్ల అన్ని రకాల కోరికలు నెరవేరుతాయి.

హిందూ మత విశ్వాసాల ప్రకారం తులసి మొక్కలో ముగ్గురు దేవతలు నివసిస్తారు. తులసిని పూజించడం వల్ల దేవతలు త్వరగా సంతోషిస్తారు. కష్టాలు, పేదరికం, ప్రతికూల శక్తులు తరచుగా ప్రవేశించే ఇళ్లలో తులసి మొక్కను పెంచడం, క్రమం తప్పకుండా పూజించడం ద్వారా ఇవన్నీ తొలగిపోతాయని నమ్ముతారు.

తులసి మొక్కకు నీళ్ళు పోసి ఉదయం, సాయంత్రం దీపం వెలిగించడం వల్ల ఇంట్లో లక్ష్మీ దేవి, శ్రీమహావిష్ణువు అనుగ్రహం లభిస్తుంది. ఆ ఇంట్లో సుఖ సంతోషాలుంటాయని విశ్వాసం. తులసి పూజ సమయంలో తులసి మంత్రాన్ని పఠిస్తే అన్ని రకాల ఆర్థిక సమస్యలు దూరమవుతాయి.

Vastu Tips For Tulasi

తులసిని పూజించే సమయంలో పఠించాల్సిన మంత్రం.. మహాప్రసాద్ జనని సర్వ సౌభాగ్యవర్ధిని, ఆది వ్యాధి హర నిత్యం తులసీ త్వం నమోస్తుతే అంటూ.. మంత్రం పఠిస్తూ పూజించాలి.

అయితే శివుడు, గణేశుని పూజలో తులసి ఆకులను ఉపయోగించడం నిషేధించబడింది. అందుకే పొరపాటున కూడా తులసి ఆకులను పూజకు ఉపయోగించరాదు. నైవేద్యంగా పెట్టకూడదు.

స్నానం చేయకుండా తులసి మొక్కను తాకకూడదు.





























