Rudraksha: రుద్రాక్షమాలను ధరిస్తున్నారా..? అయితే ఈ విషయాలను తప్పక తెలుసుకోండి..

రుద్రాక్ష ధరించడం వల్ల సానుకూల ఆలోచనలు వస్తాయని జ్యోతిష్య నిపుణులు కూడా అంటున్నారు. అయితే రుద్రాక్షను ధరించడానికి కొన్ని నియమాలు..

Rudraksha: రుద్రాక్షమాలను ధరిస్తున్నారా..? అయితే ఈ విషయాలను తప్పక తెలుసుకోండి..
Rudraksha
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Mar 05, 2023 | 6:30 AM

సనాతన హిందూ ధర్మంలో రుద్రాక్షకు చాలా ప్రత్యేక స్థానం ఉంది. జగత్ పిత అయిన పరమ శివుడే స్వయంగా ఆభరణంగా రుద్రాక్షను ధరించాడు. అలాంటి రుద్రాక్షను ధరించడం వల్ల కలిగే అనేక ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయని శాస్త్రాలు చెబుతున్నాయి. హిందూ ధర్మ విశ్వాసాల ప్రకారం, రుద్రాక్ష పూసలను ధరించడం వల్ల అనేక శారీరక, మానసిక ప్రయోజనాలు ఉన్నాయి. రుద్రాక్ష ధరించడం వల్ల సానుకూల ఆలోచనలు వస్తాయని జ్యోతిష్య నిపుణులు కూడా అంటున్నారు. అయితే రుద్రాక్షను ధరించడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. కాబట్టి వాటిని దృష్టిలో ఉంచుకుని ధరించాలి. శాస్త్రం ప్రకారం.. రుద్రాక్షను మణికట్టు, మెడ, గుండెపై ధరించవచ్చు. ముఖ్యంగా మెడలో రుద్రాక్షను ధరించడం అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. స్నానం తర్వాత దీనిని ధరించడం, శివుడిని పూజించడం వలన అనుకూలమైన ప్రయోజనాలు లభిస్తాయి.

ఆ నేపథ్యంలో రుద్రాక్షను మణికట్టుపై ధరించాలనుకుంటే.. అక్కడ 12 రుద్రాక్షలను ధరించవచ్చు. మెడలో అయితే 36 రుద్రాక్షల మాల ధరించవచ్చు. ఇక శ్రావణ మాసం రుద్రాక్ష ధరించడానికి అత్యంత పవిత్రమైన మాసంగా పరిగణించబడుతుంది. ఇదే కాకుండా శివరాత్రి నాటి నుంచి కూడా రుద్రాక్షను ధరించవచ్చు. అలాగే పూజానంతరం ఏ నెలలోనైనా సోమవారం ధరించవచ్చు. రుద్రాక్ష ధరించే ముందు దానిని శివునికి అంకితం చేయాలి.

రుద్రాక్షను ఎవరెవరు ధరించకూడదు..?

  1. బిడ్డ తల్లి: సనాతన హిందూ ధర్మంలోని విశ్వాసాల ప్రకారం.. స్త్రీలు కూడా రుద్రాక్షను ధరించవచ్చు. అయితే బిడ్డ పుట్టిన తర్వాత సూతకం కాలం ముగిసే వరకు ఆమె రుద్రాక్షను తీసివేయాలి. ఎందుకంటే నవజాత శిశువు పుట్టిన తరువాత.. ఒక దారం కడతారు. అయితే..శిశువు జన్మించిన తర్వాత కొన్ని రోజులు మైల రోజులు.. కనుక  బిడ్డ పుట్టిన వెంటనే బిడ్డ కు లేదా తల్లి రుద్రాక్షను వేయవద్దు. అలాగే రుద్రాక్ష ధరించిన వ్యక్తి కొత్తగా జన్మించిన శిశువు దగ్గరకు.. ఆ బిడ్డ తల్లి ఉన్న ప్రదేశంలోకి ప్రవేశించకూడదు. ఏదైనా కారణం వల్ల అక్కడికి వెళ్లాల్సి వస్తే ముందుగా రుద్రాక్షను తీసివేయాలి.
  2. మాంసాహారం తినేవారు: మాంసాహారం తీసుకునేవారు రుద్రాక్షను ధరించకూడదు. సనాతన హిందూ ధర్మంలోని విశ్వాసాల ప్రకారం.. రుద్రాక్ష ధరించినవారు ధూమపానం, మాంసాహారం వంటి వాటి నుంచి దూరంగా ఉండాలి. మాంసాహారం తినడం వల్ల రుద్రాక్ష అపవిత్రం అవుతుందని నమ్ముతారు. దీని వల్ల భవిష్యత్తులో బాధపడాల్సి వస్తుంది. ఈ రుద్రాక్ష వలన చెడు ఫలితాలు వస్తాయి. అందుకే మాంసాహారం తినే వారు రుద్రాక్షను ధరించకూడదు.
  3. నిద్ర పోయేవారు: నిద్రపోయేటప్పుడు రుద్రాక్షను తీసివేయాలి. మీరు దానిని తీసివేసి, నిద్రపోయేటప్పుడు మీ దిండు కింద ఉంచవచ్చు. ఇలా చేయడం వల్ల మీకు చెడు కలలు కూడా రావు. నిద్ర లేనివారు లేదా నిద్ర సమస్యలు ఉన్నవారు కూడా దీని వల్ల ప్రయోజనం పొందుతారు. పడుకునేటప్పుడు రుద్రాక్ష ధరించి నిద్రపోకండి.
  4. శ్మశాన వాటికకు వెళ్లేవారు: రుద్రాక్షను ధరించి శ్మశాన వాటికకు వెళ్లడం శ్రేయస్కరం కాదు. అందుకే శ్మశాన వాటికకు వెళ్లేటప్పుడు ఎల్లప్పుడూ రుద్రాక్షను తీసివేయండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

రాత్రివేళ బట్టలు ఉతుకుతున్నారా.? ఇది తెలిస్తే.. ఇక ఆ పని చెయ్యరు!
రాత్రివేళ బట్టలు ఉతుకుతున్నారా.? ఇది తెలిస్తే.. ఇక ఆ పని చెయ్యరు!
నయన్ రూట్‌ నే ఫాలో అవుతున్న నాగచైతన్య-శోభిత.! వీడియో.
నయన్ రూట్‌ నే ఫాలో అవుతున్న నాగచైతన్య-శోభిత.! వీడియో.
కాబోయే భర్త ఎవరో చెప్పకనే చెప్పేసిన రష్మిక. ఫుల్‌ ఖుషీలో ఫ్యాన్స్
కాబోయే భర్త ఎవరో చెప్పకనే చెప్పేసిన రష్మిక. ఫుల్‌ ఖుషీలో ఫ్యాన్స్
గుండెలు పిండేసే ఘటన.. ఏ జంతువుకూ ఈ దుస్థితి రాకూడదు
గుండెలు పిండేసే ఘటన.. ఏ జంతువుకూ ఈ దుస్థితి రాకూడదు
పెళ్లి ఫిక్సయ్యాక ప్రియుడు జంప్‌.. బాధితురాలు చేసింది ఇదే !!
పెళ్లి ఫిక్సయ్యాక ప్రియుడు జంప్‌.. బాధితురాలు చేసింది ఇదే !!
బాబాగుడిలోకి ఎంట్రీ ఇచ్చిన అపర భక్తుడు..ఆ తర్వాత ??
బాబాగుడిలోకి ఎంట్రీ ఇచ్చిన అపర భక్తుడు..ఆ తర్వాత ??
తన డ్రైవర్‌కే డ్రైవర్‌గా మారిన ఎమ్మెల్యే.. ఏం జరిగిందంటే ??
తన డ్రైవర్‌కే డ్రైవర్‌గా మారిన ఎమ్మెల్యే.. ఏం జరిగిందంటే ??
మేం అంబానీల కంటే తక్కువ కాదు.. వైరల్ అవుతున్న వెడ్డింగ్ కార్డ్
మేం అంబానీల కంటే తక్కువ కాదు.. వైరల్ అవుతున్న వెడ్డింగ్ కార్డ్
వాట్సాప్‌లో సీక్రెట్‌ చాటింగ్‌.. ఈ ఫీచర్‌ ఎలా పని చేస్తుంది ??
వాట్సాప్‌లో సీక్రెట్‌ చాటింగ్‌.. ఈ ఫీచర్‌ ఎలా పని చేస్తుంది ??
యవ్వనం కోసం ఏదో చేస్తే.. ఇంకేదో అయ్యింది
యవ్వనం కోసం ఏదో చేస్తే.. ఇంకేదో అయ్యింది