Throat Cancer: గొంతు క్యాన్సర్ లక్షణాలివే.. మీలో కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకండి.. లేకపోతే ప్రాణాంతకమే..
క్యాన్సర్‌కు సమయపాలన, పోషకాలు లేని ఆహార అలవాట్లు, జీవనశైలి ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఈ క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించి.. సరైన సమయంలో..
ప్రస్తుత కాలంలో అనేక మంది క్యాన్సర్ కారణంగా చనిపోతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం.. 2020లో ఒక కోటి మందికి పైగా ప్రజలు క్యాన్సర్‌తోనే మరణించారు. ఇంకా వివరంగా చెప్పుకోవాలంటే ప్రతి ఆరుగురిలో ఒకరు క్యాన్సర్ సమస్యతోనే చనిపోతున్నారు. నిజానికి మానవులను పట్టిపీడిస్తున్న ప్రాణాంతక ఆరోగ్య సమస్యలలో క్యాన్సర్ కూడా ఒకటి. ఇక ఈ క్యాన్సర్ బారిన పడినవారిలో చాలా తక్కువ మంది మాత్రమే ప్రాణాలతో బయటపడతారు. అయితే క్యాన్సర్‌కు సమయపాలన, పోషకాలు లేని ఆహార అలవాట్లు, జీవనశైలి ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఈ క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించి.. సరైన సమయంలో చికిత్స చేయించుకుంటే ఈ వ్యాధి ముప్పు నుంచి బయటపడవచ్చని వారు సూచిస్తున్నారు. క్యాన్సర్‌లో అనేక రకాలు ఉన్నాయి. అందులో గొంతు క్యాన్సర్ కూడా ఒకటి. ఇంకా ఇది కూడా చాలా ప్రమాదకరమైనది.
ఎంతో మంది దీని బారినపడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. సిగరెట్, ఆల్కహాల్, పొగాకు, గుట్కా మొదలైనవి గొంతు క్యాన్సర్‌కు ప్రధానంగా కారణం. గొంతు క్యాన్సర్ సంకేతాలను సకాలంలో గుర్తించినట్లయితే.. ఈ ప్రాణాంతక వ్యాధిని నివారించవచ్చు. చెవిలో నొప్పి, మెడలో వాపు, మింగడంలో ఇబ్బంది, గొంతు క్యాన్సర్ వంటి కొన్ని సంకేతాల ఆధారంగా ఈ వ్యాధిని ప్రారంభంలోనే గుర్తించవచ్చు. ఎవరిలోనైనా ఈ లక్షణాలు కనిపిస్తే.. వెంటనే అప్రమత్తమై.. వైద్యుడిని సంప్రదించినట్లయితే.. గొంతు క్యాన్సర్‌కు సులభంగా చికిత్స చేయవచ్చు.
గొంతు క్యాన్సర్ లక్షణాలు
- గొంతులోని కొన్ని క్యాన్సర్లలో కఫం కనిపిస్తుంది. మీలో ఎక్కువ కాలం కఫం ఉంటే ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకండి.
- స్వరంలో మార్పు వస్తుంది. గొంతు క్యాన్సర్‌కు ప్రారంభ లక్షణం ఇదే. ధ్వని మార్పు రెండు వారాలయినా..చక్కబడకుంటే.. వెంటనే డాక్టర్ వద్దకు వెళ్లాలి.
- ఆహారం మింగడంలో ఇబ్బందిగా ఉన్నా.., గొంతులో ఆహారం వేలాడుతున్నట్లు అనిపించినా.. వెంటనే డాక్టర్ వద్దకు వెళ్లాలి. ఇది గొంతు క్యాన్సర్‌కు సంకేతం కావచ్చు.
- ఏ రకమైన క్యాన్సర్ వచ్చినా బరువు తగ్గడం జరుగుతుంది. అందువల్ల ఎలాంటి కారణం లేకుండా అకస్మాత్తుగా బరువు తగ్గినట్లయితే.. వెంటనే అప్రమత్తమవ్వాలి.
- చెవిలో నిరంతరం నొప్పి ఉండి.. అది త్వరగా తగ్గకపోతే అప్రమత్తమవ్వాలి. అది గొంతు క్యాన్సర్ సంకేతంగా ఉంటుంది.
- మెడ కింది భాగంలో వాపు వచ్చి చికిత్స చేసినా నయం కాకపోతే అది క్యాన్సర్‌కు కారణం కావచ్చు. ఈ సందర్భంలో వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
గొంతు క్యాన్సర్ రకాలు:
- నాసోఫారింజియల్ క్యాన్సర్: ఇది నాసికా రంధ్రాల నుంచి ప్రారంభమవుతుంది. ఇది ముక్కు వెనుక నుంచి మొదలవుతుంది.
- ఓరోఫారింజియల్ క్యాన్సర్: ఇది నోటి వెనుక భాగం నుంచి మొదలవుతుంది. టాన్సిల్స్ క్యాన్సర్ ఇందులో భాగమే.
- హైపోఫారింజియల్ క్యాన్సర్: ఇది అన్నవాహికకు వచ్చే క్యాన్సర్.
- గ్లోటిక్ క్యాన్సర్: ఇది స్వరపేటిక నుంచి ప్రారంభమవుతుంది.
- సుప్రాగ్లోటిక్ క్యాన్సర్: ఇది స్వరపేటిక పై భాగం నుంచి మొదలవుతుంది. ఈ క్యాన్సర్ఉన్న వారు ఆహారాన్ని మింగలేరు.
- సబ్‌గ్లోటిక్ క్యాన్సర్: ఇది స్వరపేటిక దిగువ నుంచి మొదలయ్యే క్యాన్సర్.
మరిన్ని ఆరోగ్యసంబంధిత వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..