- Telugu News Photo Gallery Get amazing and incredible benefits with coconut oil by applying it to skin before sleeping check here for full details
Coconut Oil Benefits: నిద్రించే ముందు కొబ్బరి నూనెతో ఇలా చేస్తే.. తళతళ మెరిసే పోయే చర్మం మీ సొంతం..
కొబ్బరి నూనెతో ఎన్నో రకాల ప్రయోజనాలున్నాయి. అందుకే చిన్నప్పుడు అమ్మ తల నిండా ఈ నూనెనే రాసేది. అలాగే కొబ్బరి నూనెను నిద్రించే ముందు చర్మానికి రాసుకోవడం వల్ల కూడా ఎన్నో లాభాలు కలుగుతాయి. మరి అవేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Mar 05, 2023 | 7:00 AM

కొబ్బరి నూనె ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. జుట్టు.. చర్మం సమస్యలను తగ్గించడంలో ఎంతగానో సహయపడుతుంది. అలాగే వేసవిలో చర్మం ఎర్రబడడం.. మంట రావడం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

కొబ్బరి నూనెను అనేక సౌందర్య ఉత్పత్తులలో వాడుతారు. స్వచ్ఛమైన కొబ్బరి నూనెలో మంచి సువాసన ఉంటుంది. మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది ముఖం, శరీరానికి మాయిశ్చరైజర్‌గా ఉపయోగపడుతుంది. ఇది సహజంగా యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, ఇది చర్మాన్ని మృదువుగా చేయడానికి కూడా సహాయపడుతుంది.

కొబ్బరి నూనె జుట్టుకు మేలు చేస్తుంది. అంతేకాకుండా చర్మానికి తేమను అందిస్తుంది. ఇందులో అవసరమైన కొవ్వు ఆమ్లాలు..చర్మాన్ని లోపలి నుంచి మృదువుగా ఉంచుతాయి.

ముఖ్యంగా కొబ్బరి నూనెలో ఉండే లినోలెనిక్ యాసిడ్ చర్మానికి మేలు చేస్తోంది. రాత్రి పూట కొబ్బరి నూనెను రాసుకోవడం వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి. చర్మ సమస్యలను తగ్గించడమే కాకుండా.. చర్మం పొడిబారకుండా చేస్తుంది.

చర్మంపై నల్ల మచ్చలు ఉన్నవారు కొబ్బరి నూనెను ఉపయోగించడం మంచిది. ఇందులో కొల్లాజెన్ ఉంటుంది. ఇది ముడతలు వంటి వృద్ధాప్య లక్షణాలను నివారిస్తుంది.. అలాగే చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

పొడి చర్మంను నిరంతరం తేమగా ఉంచడంలో కొబ్బరి నూనె ఉపయోగపడుతుంది. వాతావరణం పొడిబారినట్టుగా.. గరుకుగా ఉన్నవారు రాత్రి పడుకునే ముందు కొబ్బరినూనేను ఉపయోగించాలి. ఇలా ప్రతిరోజూ చేయడం వలన ఫలితం ఉంటుంది.

కొబ్బరి నూనెలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి చర్మం మంటను తగ్గిచంజలో ఉపయోగపడతాయి. అలాగే మొటిమల సమస్య ఉన్నవారు. రాత్రి పూట కొబ్బరి నూనే అప్లై చేయడం వలన మొటిమలు తగ్గుతాయి.

పింపుల్స్ ఎక్కువగా ఉన్నాయంటే మీ ముఖంపై ఉందే చర్మ రంధ్రాలు మూసుకుపోయాయని అర్థం. రాత్రిళ్లు కొబ్బరి నూనెను అప్లై చేయడం వలన చర్మ రంధ్రాలు తెరుచుకుంటాయి. తద్వారా మొటిమల సమస్యకు చెక్ పెట్టినట్లవుతుంది.





























