AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: నిత్యం ఈ 4 కూరగాయలను తింటే.. సర్వరోగాలకు స్వస్తి పలికినట్లే..!

కొన్ని రకాల కూరగాయలను డైట్‌లో చేర్చుకుంటే ఊబకాయం, గుండె జబ్బులు, క్యాన్సర్, కొలెస్ట్రాల్, అధిక బీపీ వంటి సమస్యల నుంచి సులభంగా..

Health Tips: నిత్యం ఈ 4 కూరగాయలను తింటే.. సర్వరోగాలకు స్వస్తి పలికినట్లే..!
health benefits with Vegetables
శివలీల గోపి తుల్వా
|

Updated on: Mar 05, 2023 | 8:10 AM

Share

ప్రస్తుత కాలంలో పెరిగిపోతున్న ఆరోగ్య సమస్యలకు మనం పాటిస్తున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లే ప్రధాన కారణమని చెప్పుకోవాలి. సమయానికి భోజనం తినకపోవడం, తిన్నా అందులో పోషకాలు లేకపోవడం వల్ల ఈ ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అయితే ఆరోగ్యంగా ఉండడానికి కొన్ని రకాల కూరగాయలను పచ్చిగానే తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. వీటి నుంచి శరీరానికి అనేక పోషకాలు అందుతాయని.. అందువల్ల వీటిని డైట్‌లో చేర్చుకుంటే ఊబకాయం, గుండె జబ్బులు, క్యాన్సర్, కొలెస్ట్రాల్, అధిక బీపీ వంటి సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చని చెబుతున్నారు. పచ్చి కూరగాయలు ఎక్కువగా తినకపోయినా వీటిని మీ ఆహారంలో ఏదో ఒక విధంగా చేర్చినా కూడా సరిపోతుంది. మరి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తినాల్సిన ఆ 4 కూరగాయలు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

  1. పాలకూర: పాలకూరలో పోషకాలు అధికంగా ఉంటాయి. అందుకే దీనిని సూపర్ ఫుడ్స్ కేటగిరీలో సూచిస్తారు. ఇందులో ఐరన్, ప్రోటీన్, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం, ఫోలేట్ వంటి అంశాలు ఉంటాయి. అలాగే ఇది విటమిన్ ఎకి మంచి మూలం. పాలకూర శరీరాన్ని నియంత్రిస్తుంది. కీళ్ల మధ్య ద్రవపదార్థం ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. కణాలకు పోషకాలను అందిస్తుంది క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఇన్‌ఫెక్షన్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. శరీరంలో రక్తం కొరతను తీర్చుతుంది. ఈ కారణంగా రక్తహీనత తగ్గుతుంది. కంటి చూపు, జీర్ణక్రియ మెరుగ్గా ఉంటాయి.
  2. క్యారట్: క్యారెట్‌లో విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఇందులో ఐరన్, సోడియం, పొటాషియం, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, విటమిన్లు ఎ, డి, సి, బి 6 మొదలైన పోషకాలు ఉంటాయి. అంతేకాదు ఇందులో అతితక్కువ కొవ్వు ఉంటుంది. దీని రెగ్యులర్‌గా వాడితే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. కంటి చూపు బాగవుతుంది. బిపిని నియంత్రిస్తుంది కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది. చర్మం మెరిసిపోతుంది శరీరంలో రక్తం కొరత తగ్గుతుంది.
  3. బ్రోకలీ: క్యాబేజీలా కనిపించే ఆకుపచ్చ బ్రోకలీ ఆరోగ్యానికి చాలా మంచిది. బ్రోకలీలో ప్రోటీన్, కాల్షియం, క్వెర్సెటిన్, కార్బోహైడ్రేట్, ఐరన్, విటమిన్ ఎ, సి మొదలైన పోషకాలు ఉంటాయి. రోజూ బ్రోకలీని తీసుకోవడం వల్ల గుండె జబ్బులతో పాటు క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధుల ప్రమాదం కూడా తగ్గుతుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది డిప్రెషన్ వంటి సమస్యలను నివారిస్తుంది.
  4. వెల్లుల్లి: వెల్లుల్లిని వంటగదిలోని సూపర్ ఫుడ్‌గా పరిగణిస్తారు. దీనిని ఔషధాలలో వినియోగిస్తారు. వెల్లుల్లిలో కాల్షియం, ఇనుము, రాగి, పొటాషియం, భాస్వరం పుష్కలంగా ఉంటాయి. దీని రెగ్యులర్ వినియోగం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. జలుబు, ఆస్తమా వంటి వ్యాధులను నివారిస్తుంది. వెల్లుల్లి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది హృదయ సంబంధ వ్యాధుల నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది. రోజూ ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తీసుకుంటే చాలా మంచిది.

గమనిక : అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం..

Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?