Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Zinc Deficiency: శరీరంలో జింక్‌ లోపం లక్షణాలివే.. కనిపిస్తే వెంటనే ఈ ఆహారాలను తినడం ప్రారంభించండి.. లేకపోతే అంతే..!

శరీరంలో జింక్ లోపం ఉంటే ఆరోగ్యం దెబ్బతింటుంది. అనేక మార్పులు, ఆరోగ్య సమస్యలు చోటుచేసుకుంటాయి. అందువల్ల జింక్ లోపం కలగకుండా..

Zinc Deficiency: శరీరంలో జింక్‌ లోపం లక్షణాలివే.. కనిపిస్తే వెంటనే ఈ ఆహారాలను తినడం ప్రారంభించండి.. లేకపోతే అంతే..!
Zink Deficiency Symptoms
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Mar 05, 2023 | 8:20 AM

ఆరోగ్యకరమైన ఆహారం లేదా పోషకాల విషయానికి వస్తే ప్రజలు తరచుగా ప్రోటీన్, కాల్షియం లేదా విటమిన్ల గురించి మాట్లాడతారు. ఇటువంటి పోషకాలలో జింక్ కూడా ఒకటి. ఇది మనం తీసుకునే ఆహారం ద్వారానేలభిస్తుంది. అయితే చాలా మంది దీనిని సప్లిమెంట్ల రూపంలో తీసుకుంటారు. జింక్ మీ శరీరంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. శరీరంలో జింక్ లోపం ఉంటే ఆరోగ్యం దెబ్బతింటుంది. అనేక మార్పులు, ఆరోగ్య సమస్యలు చోటుచేసుకుంటాయి. అందువల్ల జింక్ లోపం కలగకుండా కొన్ని రకాల ఆహారాలను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే అసలు శరీరంలో జింక్ లోపం వల్ల ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి..? అది ఎదురవకుండా లేదా అధిగమించడానికి ఏయే ఆహారాలను తీసుకోవాలి..? అనే వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం..

జింక్ లోపం లక్షణాలు:

బరువు తగ్గడం, ఆలస్యం గాయం మానడం, అతిసారం, ఆకలి లేకపోవడం, మానసిక ఆరోగ్యంపై ప్రభావం, చాలా బలహీనంగా అనిపించడం, జుట్టు రాలడం, రుచి వాసన తగ్గడం వంటి లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే డాక్టర్‌ని సంప్రదించి సరైన చికిత్స తీసుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా జింక్ లోపం వల్ల కనిపించే లక్షణాలే. అలాగే..

జుట్టు రాలడం: శరీరంలో జింక్ లోపం ఉన్నప్పుడు జుట్టు రాలడం ప్రారంభమవుతుంది. దీనివల్ల బట్టతల వచ్చే అవకాశాలు ఉంటాయి. అందువల్ల జుట్టు రాలుతున్నట్లయితే శరీరంలో జింక్ లోపం ఉంటుందని గుర్తించాలి. ఆ కారణంగా వెంటనే ఆహారంపై శ్రద్ధ వహించి.. డైట్‌లో మార్పులు చేయాలి.

ఇవి కూడా చదవండి

సంతానోత్పత్తిపై ప్రభావం: జింక్ లోపం పురుషులకు చాలా ఇబ్బందిని కలిగిస్తుంది. దీనివల్ల పురుషుల సంతానోత్పత్తి ప్రభావితమవుతుంది. తండ్రి కావాలనుకుంటే తప్పనిసరిగా జింక్ తీసుకోవడంపై శ్రద్ధ వహించాలి. తగినంత పరిమాణంలో జింక్ తీసుకోని పురుషులు తండ్రి కావడానికి చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

రోగనిరోధక శక్తి బలహీనం: శరీరానికి సంబంధించి అనేక విధులకు జింక్ అవసరమవుతుంది. ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. మళ్లీ మళ్లీ అనారోగ్యం బారిన పడకుండా కాపాడుతుంది. కానీ మీ శరీరంలో జింక్ లోపం ఉంటే అది రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుందని గుర్తుంచుకోండి.

జింక్ లోపం ఎదురవకుండా తీసుకోవలసిన ఆహారాలు..

గుడ్డు పచ్చసొన: కోడిగుడ్డుని తరచుగా మనం బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకుంటాము. కానీ జిమ్‌కి వెళ్లే వ్యక్తులు ఇందులోని పచ్చసొనను తినడం మానేస్తారు. జింక్‌కు సంబంధించిన పచ్చసొన రిచ్ సోర్స్ అని గుర్తుంచుకోవాలి. విటమిన్ B12, థయామిన్, విటమిన్ B6, ఫోలేట్, పాంథోనిక్ యాసిడ్, కాల్షియం, ఐరన్, ఫాస్పరస్ ఇందులో అధికంగా ఉంటాయి.

వెల్లుల్లి: వెల్లుల్లి భారతీయ ఇళ్లలో ఎక్కువగా ఉపయోగించే మసాలా వస్తువు. ఇందులో జింక్, విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, కాల్షియం, మెగ్నీషియం, అయోడిన్, ఐరన్, పొటాషియం పుష్కలంగా లభిస్తాయి. వెల్లుల్లి ప్రభావం వేడిగా ఉంటుంది కాబట్టి వేసవి కాలంలో పరిమిత పరిమాణంలో తీసుకోవాలి.

పుచ్చకాయ గింజలు: సాధారణంగా మనం పుచ్చకాయను ఇష్టంగా తింటాము కానీ ఈ పండు గింజలను డస్ట్‌బిన్‌లో వేస్తాము. అయితే ఈ గింజల ప్రయోజనాలు తెలిస్తే మీరు అలా చేయరు. ఈ పండు విత్తనాలలో జింక్ ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. పుచ్చకాయ గింజలను కడిగి ఎండలో ఆరబెట్టి ఆహారంలో చేర్చుకుంటే చాలా మంచిది.

గమనిక: అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..