Pain Relievers: ప్రతిదానికి పెయిన్ కిల్లర్ వేసుకుంటున్నారా? ఐతే ఇది మీకోసమే..
తల నొప్పి, నడుం నొప్పి, పంటి నొప్పి, చివరికి అజీర్తితో కడుపునొప్పి వచ్చినా.. ఇలా ఏ సమస్యకైనా పెయిన్ కిల్లర్స్ మాత్ర గుటుక్కున మింగేస్తాం. ప్రతి చిన్న సమస్యకు సర్వరోగ నివారిణిలాగా పెయిన్ కిల్లర్స్ తీసుకుంటే..
తల నొప్పి, నడుం నొప్పి, పంటి నొప్పి, చివరికి అజీర్తితో కడుపునొప్పి వచ్చినా.. ఇలా ఏ సమస్యకైనా పెయిన్ కిల్లర్స్ మాత్ర గుటుక్కున మింగేస్తాం. ప్రతి చిన్న సమస్యకు సర్వరోగ నివారిణిలాగా పెయిన్ కిల్లర్స్ తీసుకుంటే కాలేయం, కిడ్నీ జబ్బులు తప్పవని అంటున్నారు. నిజానికి నొప్పి నివారణ మందులను వేసుకునే ముందు తప్పనిసరిగా మూడు అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి. మొదటిది అవి సురక్షితమైనవై ఉండాలి. రెండు తక్కువ ప్రభావం కలిగినవై ఉండాలి. మూడోది తక్కువ కాలం మాత్రమే వినియోగించాలి. సాధారణ పెయిన్ కిల్లర్స్‌లో ఎసిటమినోఫిన్ లేదా ఇబ్యుప్రోఫెన్, డిక్లొఫినాక్ మొదలైన నాన్ స్టిరాయిడల్ యాంటీఇన్‌ఫ్లమేటరీ డ్రగ్స్ ఉంటాయి. ఇలాంటి రసాయనాలతో కూడిన మాత్రలు వేసుకోవడం వల్ల శరీరం త్వరగా జబ్బుపడిపోతుంది. దీంతో ఉన్న రోగం అటుంచితే కొత్తరోగాలు పుట్టుకొస్తాయి. ఐతే మరేం చెయ్యాలి అనుకుంటున్నారా..? మన ఆయుర్వేదంలో ఒంటి నొప్పులకు చక్కటి చిట్కాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం..
కర్పూరాన్ని పూజలోనే కాదు.. ఆయుర్వేదంలో కూడా ఉపయోగిస్తారు. పెయిన్ కిల్లర్‌గా పనిచేసే శక్తి కర్పూరానికి ఉంది. కండరాల నొప్పులను, కండరాలు పట్టేయడం వంటి సమస్యలను తగ్గిస్తుంది. అలాగే గాయాలు, దెబ్బలు తగిలినప్పుడు వాపుతో పాటు నొప్పి కూడా వస్తుంది. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులను తగ్గించడంలో కర్పూరం మనకు ఎంతో సహాయపడుతుంది. నొప్పుల నివారణలో కర్పూరం ఎలా వాడాలో తెలుసుకుందాం.. ఒక గిన్నెలో ఆవ నూనెను తీసుకుని, అందులో కర్పూరాన్ని వేసి కరిగించాలి. కర్పూరం కరిగిన తరువాత ఈ నూనెను గోరు వెచ్చగా చేసి నొప్పి ఉన్న ప్రాంతంలో రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల నొప్పి కలిగించే నరాలు శాంతించడంతో పాటు రక్తనాళాలు వ్యాకోచించి రక్తప్రసరణ క్రమబద్ధం చేస్తుంది. బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్లు దీనితో మసాజ్ చేసిన తర్వాత గోరువెచ్చిన నీటిలో ఒక క్లాత్ వేసి కాపడంలా పెట్టుకుంటే నొప్పి త్వరగా తగ్గి, రిలీఫ్‌గా ఉంటుంది. దీనిని పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా ఉపయోగించవచ్చు. నొప్పితో బాధపడుతున్నప్పుడు ఆయింట్ మెంట్‌లు, పెయిన్ కిల్లర్ మందులను వాడడానికి బదులుగా ఇలా కర్పూరాన్ని వాడితే ఎలాంటి సైడ్ ఎఫెక్టులు ఉండవు. షాపులోకి వెళ్లి పెయిన్ కిల్లర్‌ను వేసుకోవడం తేలికే.. కానీ వాటి వల్ల భవిష్యత్తులో అనారోగ్య సమస్యలు వస్తాయి.
మరిన్ని ఆరోగ్య సమాచారం కోసం క్లిక్ చేయండి.