Uzbekistan Cough Syrup Deaths: దగ్గు మందు తాగి 18 మంది చిన్నారులు మృతి చెందిన కేసులో ముగ్గురు అరెస్ట్‌.. పరారీలో కంపెనీ డైరెక్టర్లు

గత ఏడాది ఉజ్బెకిస్థాన్‌లో 18 మంది చిన్నారులు నోయిడాలో తయారైన దగ్గు సిరప్ తాగి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కేసులో నోయిడాకు చెందిన మారియన్ బయోటెక్ ఫార్మాస్యూటికల్ కంపెనీకి చెందిన ముగ్గురు అధికారులను పోలీసులు అరెస్టు..

Uzbekistan Cough Syrup Deaths: దగ్గు మందు తాగి 18 మంది చిన్నారులు మృతి చెందిన కేసులో ముగ్గురు అరెస్ట్‌.. పరారీలో కంపెనీ డైరెక్టర్లు
Uzbekistan Cough Syrup Deaths
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 05, 2023 | 8:50 AM

గత ఏడాది ఉజ్బెకిస్థాన్‌లో 18 మంది చిన్నారులు నోయిడాలో తయారైన దగ్గు సిరప్ తాగి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కేసులో నోయిడాకు చెందిన మారియన్ బయోటెక్ ఫార్మాస్యూటికల్ కంపెనీకి చెందిన ముగ్గురు అధికారులను పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ ఔషధాల తయారీ ఆరోపణలపై అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా గత ఏడాది (2022) డిసెంబర్‌లో భారత్‌లో తయారు చేసిన దగ్గు సిరప్‌ను తీసుకోవడం వల్ల ఉజ్బెకిస్తాన్‌లో దాదాపు 18 మంది పిల్లలు మృతిచెందరాఉ. ఈ సిరప్‌లను ల్యాబ్‌లో టెస్ట్‌ చేయగా ‘ఇథిలీన్ గ్లైకాల్’ అనే ప్రాణాంతక పదార్థం అధికమోతాదులో ఉన్నట్లు ఉజ్బెకిస్తాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సాథారణంగా పిల్లలు తాగే సిరప్‌లలో ఇథిలీన్ గ్లైకాల్ చాలా తక్కువ మోతాదులో ఉంటుంది. ఐతే నోయిడాలో తయారు చేస్తున్న దగ్గు సిరప్‌లలో దీని మోతాదు అధికంగా ఉండటం వల్లే పిల్లలు మృతి చెందినట్లు అధికారులు ధృవీకరించారు. అనంతరం ఈ దగ్గు సిరప్‌ను తయారు చేస్తున్న కేంద్రంపై అధికారులు దాడులు నిర్వహించి డాక్‌-1 మ్యాక్స్‌ దగ్గు సిరఫ్‌ నమూనాలను సేకరించి చండీగఢ్‌లోని రీజనల్ డ్రగ్స్ టెస్టింగ్ లాబొరేటరీ (RDTL)కి పంపారు. దీనిలో హానికారక పదార్ధాలు ఉన్నట్లు తేలడంతో సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO), నార్త్ జోన్‌కు చెందిన డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ సంబంధిత ఔషధాల అమ్మకాలు, విక్రయాలను వెంటనే నిలిపివేయాలని మారియన్ బయోటెక్‌ను ఆదేశించారు.

సీడీఎస్‌సీఓ డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ ఫిర్యాదు మేరకు మారియన్ బయోటెక్‌కు చెందిన ఇద్దరు డైరెక్టర్లతో సహా ఐదుగురు అధికారులపై గురువారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. వీరిలో తుహిన్ భట్టాచార్య (హెడ్ ఆపరేషన్). అతుల్ రావత్ (కెమిస్ట్రీ సైంటిస్ట్), మూల్ సింగ్ (అనలిటికల్ కెమిస్ట్) అనే ముగ్గురిని అరెస్టు చేయగా.. కంపెనీ డైరెక్టర్లు అయిన జయ జైన్, సచిన్ జైన్ పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు అడిషనల్‌ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సెంట్రల్ నోయిడా) రాజీవ్ దీక్షిత్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.