Andhra News: ఫేస్‌బుక్‌లో కామెంట్‌ చేశాడని కిడ్నాప్‌.. గుండు గీయించి అవమానించిన వైనం

ఫేస్‌బుక్‌లో తన గురించి కామెంట్‌ చేసినందుకు ఓ వ్యక్తిపై ఆటో ఫైనాన్షియర్‌ దాడి చేసి, శిరోముండనం చేయించాడు. తిరుపతిలో చోటుచేసుకున్న ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. వివరాల్లోకెళ్తే..

Andhra News: ఫేస్‌బుక్‌లో కామెంట్‌ చేశాడని కిడ్నాప్‌.. గుండు గీయించి అవమానించిన వైనం
Facebook
Follow us

|

Updated on: Mar 05, 2023 | 9:40 AM

ఫేస్‌బుక్‌లో తన గురించి కామెంట్‌ చేసినందుకు ఓ వ్యక్తిపై ఆటో ఫైనాన్షియర్‌ దాడి చేసి, శిరోముండనం చేయించాడు. తిరుపతిలో చోటుచేసుకున్న ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. వివరాల్లోకెళ్తే.. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా, చంద్రగిరి మండలం ఆరేపల్లి రంగంపేటకు చెందిన వంశీ ఆటో నడుపుతూ జీవనం సాగించేవాడు. ఫేస్‌బుక్‌లో పరిచయమైన తెలంగాణ రాష్ట్రం కరీంనగర్‌కు చెందిన ఓ మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. సమీప ముస్లింపేటకు చెందిన అన్వర్‌కు వంశీకి తన ఆటో అద్దెకు ఇచ్చాడు. వీరి మధ్య స్నేహం ఏర్పడటంతో అన్వర్‌ తరచూ వంశీ ఇంటికి వస్తూ పోతూ ఉండేవాడు. ఈ క్రమంలో వంశీ భార్యతో అన్వర్‌ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. నెలన్నర కిందట ఆమె పుట్టింటికి వెళ్తున్నానని భర్తతో చెప్పి, అన్వర్‌ వద్దకు చేరుకుంది. విషయం తెలుసుకున్న వంశీ బెంగళూరు చేరుకుని ఆటో నడుపుకుంటూ జీవించేవాడు.

ఈ క్రమంలో అన్వర్‌ ఫేస్‌బుక్‌ ఖాతాలో అతనితోపాటు తన భార్య కలిసి ఉన్న ఫొటోను వంశీ చూసి.. కింద కామెంట్‌ సెక్షన్‌లో ‘RIP’ అని పోస్టు పెట్టాడు. దీన్ని జీర్ణించుకోలేని అన్వర్‌, తన స్నేహితుడు హర్షతో కలిసి బెంగళూరు చేరుకుని ఫిబ్రవరి 8న వంశీని కిడ్నాప్‌ చేశాడు. అనంతరం చంద్రగిరి తీసుకువచ్చి నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి అక్కడ వంశీకి గుండు గీయించాడు. అనంతరం వంశీని బెదిరించి, ఫేస్‌బుక్‌లో తప్పుడు కామెంట్‌ పెట్టడంతో చింతిస్తూ గుండు కొట్టించుకున్నానంటూ చెప్పించి వీడియో సైతం తీశారు. వంశీ తన గోడునంత ఆటో యూనియన్‌ వారికి చెప్పుకోవడంతో తాజాగా ఈ విషయం వెలుగులోకొచ్చింది. ఐతే ఈ సంఘటపై చంద్రగిరి పోలీస్‌ స్టేషన్‌లో ఎటువంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?