AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్‌.. నడిచొచ్చేవారికి కూడా దివ్య దర్శనం టోకెన్లు.. ఎప్పటినుంచంటే?

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది భక్తులకు మరింత త్వరగా స్వామి వారి దర్శనం అయ్యేలా నడకదారిలో వెళ్లే భక్తులకు కూడా దివ్య దర్శనం టోకెట్లు ఇవ్వాలని నిర్ణయించింది

Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్‌.. నడిచొచ్చేవారికి కూడా దివ్య దర్శనం టోకెన్లు.. ఎప్పటినుంచంటే?
Tirumala
Basha Shek
|

Updated on: Mar 04, 2023 | 9:50 AM

Share

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది భక్తులకు మరింత త్వరగా స్వామి వారి దర్శనం అయ్యేలా నడకదారిలో వెళ్లే భక్తులకు కూడా దివ్య దర్శనం టోకెట్లు ఇవ్వాలని నిర్ణయించింది.అలిపిరి, శ్రీవారిమెట్టు నడకమార్గాల్లో వచ్చే భక్తులకు దివ్యదర్శనం టోకెన్లు జారీ చేయనుంది. నడక మార్గాల్లో వచ్చే భక్తుల్లో 60 శాతం మంది వద్ద దర్శన టికెట్లు ఉండడం లేదని గుర్తించామని, కాబట్టి వారికి దివ్యదర్శనం టోకెన్లు జారీ చేయాలని నిర్ణయించినట్టు టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్ రూపొందిస్తున్నామని, అది అందుబాటులోకి రాగానే టోకెన్ల జారీ ప్రారంభిస్తామని ఈవో పేర్కొన్నారు. ఇక శ్రీవాణి దర్శన టికెట్లు కలిగిన వారికి తిరుమలలోని ఎస్‌ఎన్‌జీహెచ్‌, ఏటీజీహెచ్‌ అతిథి గృహాల్లో 88 గదులు కేటాయించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక అన్నమయ్య భవనంలో టీటీడీ డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడిన ఈవో టీడీడీ తీసుకురానున్న సంస్కరణల గురించి మాట్లాడారు. ఏప్రిల్‌ మొదటి వారానికి తిరుమలకు 10 ఒలెక్ట్రా ఎలక్ట్రిక్‌ బస్సులు అందుబాటులోకి వస్తాయని, వీటిని ధర్మరథం బస్సుల స్థానంలో ఉపయోగిస్తామని ఈవో పేర్కొన్నారు. తిరుమలలో గదుల కేటాయింపు విచారణ కేంద్రాల్లో రాగి బాటిళ్ల విక్రయానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు.

కాగా తిరుమలలో మార్చి 1 నుంచి ఫేస్ రికగ్నిషన్ విధానం అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ విధానం సత్ఫలితాలు ఇస్తోందని ఈవో ధర్మారెడ్డి తెలిపారు. నూతన విధానం ద్వారా దళారీల బెడద తప్పిందన్నారు. గదులు రొటేషన్ చేసే విధానం కూడా ఆగిపోయిందని చెప్పారు. ఈ విధానంతో నిజమైన భక్తులే గదులు పొందుతున్నారన్నారు. రానున్న రోజుల్లో ఈ విధానాన్ని ఇంకా పటిష్టం చేస్తామని ధర్మారెడ్డి పేర్కొన్నారు. శ్రీవారి సర్వదర్శనం, లడ్డూ ప్రసాదం, గదుల కేటాయింపు, రిఫండ్‌ చెల్లింపునకు ఫేస్‌ రికగ్నిషన్‌ టెక్నాలజీని టీటీడీ ప్రయోగాత్మకంగా అమలు చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..