Holi 2023: ఇంట్లోనే సహజంగా హోలీ రంగులు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోండి..
మన దేశంలో పండుగులకు పెట్టింది పేరు, ప్రతి నెల ఏదో ఒక ఉత్సవం చేసుకొని ప్రజలు తమ ఆనందాలను పంచుకుంటారు.

మన దేశంలో పండుగులకు పెట్టింది పేరు. ప్రతి నెల ఏదో ఒక ఉత్సవం చేసుకొని ప్రజలు తమ ఆనందాలను పంచుకుంటారు. అందుకే భారత దేశానికి ల్యాండ్ ఆఫ్ ఫెస్టివల్స్ అనే పేరుంది. వసంత రుతువులో వచ్చే తొలి పండగ హోలీ, దీన్నే రంగుల పండగ అంటారు. త్రేతా యుగంలో శ్రీరామ చంద్రుడు ఈ రోజే పెళ్లి కొడుకు అయ్యాడని ప్రతీతి.
హోలీ ఆడే సంప్రదాయం మనదేశంలో పురాతన కాలం నుంచి ఉంది. అయితే ఒకప్పుడు ప్రకృతి ప్రసాదించి రంగులతో పండుగ జరుపుకునే వారు, కానీ మార్కెట్ ను సింథటిక్ రంగులు ముంచెత్తుతున్నాయి. అవి సులువుగా లభిస్తున్నప్పటికీ, ఈ రంగులు హానికరమైన రసాయనాల నుండి తయారు చేయబడినందున చర్మానికి, ఆరోగ్యానికి చాలా హానికరం. నిపుణుల అభిప్రాయం ప్రకారం, హోలీ సమయంలో రంగుల వల్ల కలిగే హాని నుండి చర్మాన్ని రక్షించడానికి సహజ రంగులను ఉపయోగించడం ఉత్తమ మార్గం. మీరు ఈసారి రసాయన రంగులతో కాకుండా సహజ రంగులతో హోలీ ఆడాలనుకుంటే, ఇంట్లో సహజమైన రంగులను తయారు చేసుకునే సులభమైన చిట్కాలు మీకోసం..
పసుపు రంగు:
పసుపు పొడి ఇంట్లోనే పసుపు రంగును తయారు చేయడానికి సులభమైన మార్గం. పసుపు రంగును సిద్ధం చేయడానికి, పసుపు, శనగ పిండిని సమాన పరిమాణంలో తీసుకోండి. వాటిని కలపి వాడుకోవచ్చు. నీటిలో కలిపే తడి రంగును తయారు చేయాలనుకుంటే, పసుపు రంగు బంతి పువ్వులను తీసుకొని నీటిలో ఉడకబెట్టడం ద్వారా వాటర్ కలర్ తయారు చేయవచ్చు.




ఎరుపు రంగు:
ఇంట్లో రెడ్ కలర్ చేయడానికి, కొన్ని ఎరుపు మందార పువ్వులను తీసుకోండి. వాటిని ఎండబెట్టండి. ఎండిన పువ్వులను మెత్తగా పొడి చేయండి. ఎరుపు రంగును సిద్ధం చేయడానికి మీరు ఎర్ర చందనం కూడా ఉపయోగించవచ్చు. పొడి పరిమాణాన్ని పెంచడానికి, సమాన పరిమాణంలో బియ్యం పిండిని కలపండి. మీరు తడి రంగులు చేయాలనుకుంటే, దానిమ్మ తొక్కలను నీటిలో ఉడకబెట్టి వాటర్ కలర్ వాడుకోవచ్చు.
గ్రీన్ కలర్:
ఇంట్లో చాలా సులభంగా లభించే గోరింటాకు పొడితో గ్రీన్ కలర్ తయారు చేసుకోవచ్చు. గోరింట పొడిని నీటిలో కలపి వాడుకోవచ్చు. అలాగే ఆకు కూరలను నీటిలో ఉడకబెట్టడం ద్వారా కూడా ఆకుపచ్చ రంగును తయారు చేసుకోవచ్చు.
మెరూన్ కలర్:
ఇంట్లో మెరూన్ రంగును సులభంగా తయారు చేయడానికి మీకు బీట్‌రూట్ అవసరం పడుతుంది. మొదట బీట్‌రూట్‌ను ముక్కలు చేసి దాన్ని మిక్సీలో వేసి ఆ ముద్దను నీటిని రాత్రంతా నానబెట్టండి. వస్త్రంతో వడకడితే చిక్కటి మెరూన్ రంగు సిద్ధం అవుతుంది.
బ్లూ కలర్:
నీలి రంగు మందారం రేకుల నుండి ఇంట్లోనే చాలా సులభంగా బ్లూ కలర్ తయారు చేసుకోవచ్చు. పూల రేకులను ఎండబెట్టి, దాని నుండి పొడిని తయారు చేయండి. తర్వాత బియ్యం పిండిలో కలపాలి.
మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..



