Yami Gautam Secrets : ఫెయిర్ అండ్ లవ్లీ బ్యూటీ యామీ గౌతమ్ బ్యూటీ సీక్రెట్ ఇదే.. డైలీ మీరు ఇలా చేస్తే అందం మీ సొంతం
.తాను చాలా సింపుల్‌గానే ఉంటానని చర్మ రక్షణకు ప్రత్యేక చర్యలు ఏమీ తీసుకోనని, అందరూ నార్మల్‌గా ఉండే పద్ధతినే తానూ ఫాలో అవుతానని యామీ గౌతమ్ తెలిపారు. ఉదయాన్నే లేవగానే కచ్చితంగా నీరు తాగుతానని తెలిపింది.

ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ ద్వారా దేశవ్యాప్తంగా ఫేమస్ అయిన యామీ గౌతమ్ గురించి తెలియని వాళ్లు ఎవరూ ఉండరు. చూడచక్కని రూపం అందమైన ముఖంతో ఈ బ్యూటీ యువత మనస్సును కట్టి పడేసింది. యాడ్ తర్వాత సినిమాల్లోకి ప్రవేశించిన ఈ బ్యూటీ అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒకేలా ఉంటుంది. అయితే యామీ గౌతమ్ అందం వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి? డైలీ ఆమె ఏం చేస్తూ తన అందాన్ని కాపాడుకుంటుంది? ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె తన బ్యూటీ సీక్రెట్స్‌ను చెప్పింది. ఆమె అందం రక్షణకు ఆమె వాడే టిప్స్ ఏంటో మనమూ ఓ సారి తెలుసుకుందాం.తాను చాలా సింపుల్‌గానే ఉంటానని చర్మ రక్షణకు ప్రత్యేక చర్యలు ఏమీ తీసుకోనని, అందరూ నార్మల్‌గా ఉండే పద్ధతినే తానూ ఫాలో అవుతానని యామీ గౌతమ్ తెలిపారు. ఉదయాన్నే లేవగానే కచ్చితంగా నీరు తాగుతానని తెలిపింది. తన బెడ్ పక్కన రాత్రి సమయంలో కచ్చితంగా వాటర్ బాటిల్ పెట్టుకుంటానని ఉదయం లేవగానే నీరు తాగుతానని స్పష్టం చేసింది.
అలాగే టిఫిన్ కింద ఇడ్లీ, కొబ్బరి చట్నీ తీసుకుంటానని తెలిపింది. ఒకవేళ అది కుదరకపోతే అవకాడో టోస్ట్, హాఫ్ బాయిల్డ్ ఎగ్ తీసుకుంటానని వివరించింది. ఒకవేళ అది కూడా కుదరకపోతే ఏదైనా హార్డ్ టోస్ట్ తీసుకుంటానని వెల్లడించింది. అలాగే ఉదయం రెడీ అయ్యే సమయంలో కచ్చితంగా 80ల నాటి పాటలు వింటానని పేర్కొంది. ఉదయం 6:30కే నిద్ర లేస్తానని, రాత్రి సమయంలో కచ్చితంగా 9 గంటలకల్లా పడుకుంటానని వివరించింది. కచ్చితంగా 8:30 లేదా 9 గంటలు పడుకుంటానని స్పష్టం చేసింది. కచ్చితంగా ఉదయమే లేచి కుటుంబ సభ్యులతో చాయ్ తాగడం చాలా ఇష్టమని పేర్కొంది. ముఖ్యంగా ఎక్కడ షూట్‌లో ఉన్నా వీలైనంత మేరకు కుటుంబ సభ్యులతో మాట్లాడడం, చాట్ చేయడానికి ఇష్టపడతానని పేర్కొంది. ఇది తన మూడ్‌ను నార్మల్ చేస్తుందని పేర్కొంది. నైట్ షూట్‌లను అస్సలు ఇష్టపడడని తెలిపింది. అయితే ఈ ఇంటర్వ్యూలో ఆమె అందానికి హ్యాపీగా ఉండడమే అస్సలు సీక్రెట్ అని చెప్పింది. ఎలాంటి టెన్షన్‌లు లేకుండా ఆరోగ్యంగా ఉండడమే తన అందం వెనుక ఉన్న రహస్యమని చెబుతుంది. అయితే ఈ ఇంటర్వ్యూలో ఫన్నీ థింగ్ ఏంటంటే అస్సలు తన దగ్గర డబ్బులు ఉంచుకోనని తెలిపింది. మాగ్జిమమ్ కార్డ్స్ ద్వారా పే చేస్తానని చెప్పింది. తప్పనిసరి పరిస్థితుల్లో ఫిజికల్‌గా డబ్బు కావాల్సి వచ్చినా తన దగ్గర ఉండవని నవ్వేస్తూ జవాబిచ్చింది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..







