Intestinal Parasites : కడుపులో ప్రమాదకరమైన పురుగులు.. ఆహార అలవాట్ల వల్లే అధిక వృద్ధి.. సమస్యలు కూడా అధికమే

పరాన్న జీవులుగా పిలిచే వీటిని శరీరానికి తీవ్ర హాని చేస్తుంది. ఒక్కోసారి ప్రమాదకర వ్యాధులకు కూడా కారణమవుతాయి. వీటిలో వివిధ రకాల పురుగులు, ప్రోటోజోవా లేదా ఇతర సూక్ష్మజీవులు ఉన్నాయి. అవి కలుషితమైన ఆహారం, నీరు ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయి.

Intestinal Parasites : కడుపులో ప్రమాదకరమైన పురుగులు.. ఆహార అలవాట్ల వల్లే అధిక వృద్ధి.. సమస్యలు కూడా అధికమే
Digestion
Follow us
Srinu

|

Updated on: Mar 05, 2023 | 6:45 PM

ప్రస్తుత కాలంలో మారిన ఆహార అలవాట్ల కారణంగా వివిధ సమస్యలు మనల్ని వేధిస్తున్నాయి. ముఖ్యంగా పేగు సంబంధిత సమస్యలు కూడా అధికంగా వస్తున్నాయి. ముఖ్యంగా మన పేగుల్లో కొన్ని రకాలైన పురుగులు ఎక్కువగా వృద్ధి చెందుతున్నాయి. పరాన్న జీవులుగా పిలిచే వీటిని శరీరానికి తీవ్ర హాని చేస్తుంది. ఒక్కోసారి ప్రమాదకర వ్యాధులకు కూడా కారణమవుతాయి. వీటిలో వివిధ రకాల పురుగులు, ప్రోటోజోవా లేదా ఇతర సూక్ష్మజీవులు ఉన్నాయి. అవి కలుషితమైన ఆహారం, నీరు ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఈ పరాన్నజీవులు విరేచనాలు, కడుపు నొప్పి, వాంతులు, బరువు తగ్గడం, రక్తహీనత వంటి అనేక రకాల లక్షణాలను కలిగిస్తాయి. శరీరంలో ఈ జీవుల ఉనికి సంకేతాలను అర్థం చేసుకోవడంతో పాటు చికిత్సా పద్ధతులను పాటిస్తే పేగుల్లో పరాన్నజీవుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. 

లక్షణాలు ఇవే

పేగు పరాన్నజీవులు ఎలాంటి లక్షణాలు లేకుండా ఎక్కువ కాలం మానవ శరీరంలో ఉంటాయి. చాలా రోజులకు లక్షణాలు కనిపిస్తే ముఖ్యంగా అవి పొత్తికడుపు నొప్పి, అతిసారం, వికారం, వాంతులు, ఉబ్బరం, విరేచనాలు, పురీషనాళం చుట్టూ దద్దుర్లు లేదా దురదలు లేదా సున్నితత్వం, అలసట, బరువు తగ్గడం, మీ మలంలో పురుగులు కనబడడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. 

చికిత్స ఇలా..

పేగుల్లో పరాన్నజీవులను ఎదుర్కోవడం అనేది వాటి తీవ్రతపై ఆధారపడి ఉంటుంది. వైద్యుల సూచనతో కొన్ని రకాల మందులు వాడితే పేగుల్లో పరాన్నజీవుల సమస్య నుంచి బయటపడవచ్చు. వైద్యులు వ్యాధి తీవ్రతకు అనుగుణంగా మందులను సూచిస్తారు. మీ పరిస్థితిని బట్టి మీకు ఒకే మోతాదు అవసరం కావచ్చు లేదా అనేక వారాల పాటు మందులు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే కొన్ని సాంప్రదాయ ఔషధాలతో పాటు ఆవదం వంటి ప్రత్యామ్నాయ చికిత్సలు కూడా వీటి నివారణకు ఉపయోగపడతాయి. 

ఇవి కూడా చదవండి

చికిత్స కంటే నివారణే ముఖ్యం

పరాన్న జీవుల నుంచి రక్షణ కోసం కొన్ని నియమాలు పాటిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఆహారం తీసుకునే ముందు కచ్చితంగా చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. అలాగే పరిశుభ్రమైన వాతావరణంలో ఆహారం వండాలి. ఇలా చేయడం వల్ల కడుపులోకి సూక్ష్మ క్రిములు వెళ్లకుండా నిరోధించవచ్చు. వాడే నీటితో తాగు నీరు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. పరాన్న జీవులు వృద్ధి చెందకుండా ముందు నుంచే డైవార్మింగ్ చికిత్సను తీసుకోవడం ఉత్తమం. ప్రతిరోజూ తీసుకునే ఆహారంలో తగినంత ఫైబర్, విటమిన్-సి, జింక్‌తో పాటు ప్రోబయోటిక్స్ ఉండేలా చూసుకోవాలి. కార్భోహైడ్రేట్‌ల అధిక వినియోగాన్ని కూడా అదుపులో ఉంచాలి. 

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..