AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diabetic Medicine: హవ్వ.. బరువు తగ్గడానికి మధుమేహం మందా..? ఆందోళన వ్యక్తం చేస్తున్న వైద్యులు

ఓ యూజర్ డయాబెటిక్ డ్రగ్ ఓజెంపిక్ బరువు తగ్గించండంలో కీలకపాత్ర పోషిస్తుందని తెలుపుతూ ఓ వీడియో చేశాడు. క్షణాల్లోనే అది వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఆ వీడియోకు 600 మిలియన్ వ్యూస్ ఉన్నాయి. అంతేకాదు ఈ డ్రగ్ కారణంగా మూడు నెలల్లో ఏకంగా 40 కిలోలు తగ్గుతారంటూ వీడియో పోస్ట్ చేయడంతో ఎక్కువ మంది ఈడ్రగ్ వాడకంపై మొగ్గు చూపుతున్నారు.

Diabetic Medicine: హవ్వ.. బరువు తగ్గడానికి మధుమేహం మందా..? ఆందోళన వ్యక్తం చేస్తున్న వైద్యులు
Nikhil
|

Updated on: Mar 05, 2023 | 6:15 PM

Share

ప్రస్తుతం యువత ఎక్కువగా సోషల్ మీడియాపై దృష్టి పెడుతున్నారు. గతంలో ఖళీ సమయాల్లో మాత్రమే బ్రౌజింగ్ చేసే వాళ్లు ప్రస్తుతం ఏ సమయంలోనైనా టైం పాస్ చేయడానికి సోషల్ మీడియాపైనే ఆధారపడుతున్నారు. అయితే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాను కొంతమంది సొంత వైద్యం తీసుకోవడానికి వాడుతున్నారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో డయాబెటిక్ మెడిసిన్ ఒకదానిని బరువు తగ్గడానికి ఉపయోగపడుతుందని ఓ యూజర్ పెట్టడం పెను సంచలనమైంది. మన దగ్గర టిక్‌టాక్ బ్యాన్ అయినా ఇతర దేశాల్లో మాత్రం టిక్‌టాక్‌ను విరివిగా ఉపయోగిస్తున్నారు. అయితే ఇందులో ఓ యూజర్ డయాబెటిక్ డ్రగ్ ఓజెంపిక్ బరువు తగ్గించండంలో కీలకపాత్ర పోషిస్తుందని తెలుపుతూ ఓ వీడియో చేశాడు. క్షణాల్లోనే అది వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఆ వీడియోకు 600 మిలియన్ వ్యూస్ ఉన్నాయి. అంతేకాదు ఈ డ్రగ్ కారణంగా మూడు నెలల్లో ఏకంగా 40 కిలోలు తగ్గుతారంటూ వీడియో పోస్ట్ చేయడంతో ఎక్కువ మంది ఈడ్రగ్ వాడకంపై మొగ్గు చూపుతున్నారు. అయితే ఇలా డాక్టర్ సూచన లేకుండా ఇలాంటి డ్రగ్స్‌ను వాడడం చాలా ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు. ఈ డ్రగ్ వాడడం వల్ల ప్రస్తుతానికి బరువు తగ్గినా ధీర్ఘకాలంలో దీని దుష్ప్రభావాలు ఎలా ఉంటాయనేది ఎలాంటి పరిశోధనలు చేయలేదని వారు పేర్కొంటున్నారు.

డెన్మార్క్ ఫార్మాస్యూటికల్ సంస్థ నోవో నార్డిస్క్ నుంచి ఇంజెక్షన్ డ్రగ్‌ను మొదట్లో టైప్ 2 డయాబెటిస్‌కు చికిత్స చేయడానికి అనేక దేశాలలో వాడారు. ఆమోదించబడింది. ఈ ఔషధంలో సెమాగ్లుటైడ్, రక్తంలో చక్కెరను నియంత్రించే హార్మోన్ గ్రాహకాలతో బంధిస్తుంది. గ్లూకోజ్ స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇన్సులిన్ విడుదలను ప్రేరేపిస్తుంది. ఇది ఒక వ్యక్తి సంబంధించిన కడుపు నుంచి ఆహారం ఎంత త్వరగా వెళ్లిపోతుందో? వారి ఆకలిని తగ్గిస్తుంది. 2021 ప్రారంభంలో పీర్-రివ్యూడ్ రీసెర్చ్ ఔషధాన్ని ఉపయోగించిన దాదాపు మూడు వంతుల మంది వారి శరీర బరువులో 10 శాతానికి పైగా కోల్పోయారని కనుగొన్నారు. అప్పటి నుంచి ఊబకాయం చికిత్సకు ప్రత్యేకంగా వుయ్‌గోవి అనే సంస్థ అధిక మోతాదుతో సెమాగ్లుటైడ్ ఔషధాన్ని అభివృద్ధి చేసింది. ఇది 2021లో యునైటెడ్ స్టేట్స్‌లో, గత సంవత్సరం యూరప్, యూకేలో ఉపయోగం కోసం ఆమోదించబడింది. అయితే ఈ ఔషధం ఇంకా యూకే, ఫ్రాన్స్‌తో పాటు అనేక ఇతర దేశాలలో మార్కెట్లో లేదు. కానీ ఓజెంపిక్ సాధారణ ప్రిస్క్రిప్షన్‌తో అందుబాటులో ఉంది. దీంతో ఎక్కువ మంది దీన్ని వాడడానికి ఇష్టపడుతున్నారు. అయితే దీని వాడకం ప్రమాదకరం కానప్పటికీ సరైన ప్రిస్క్రిప్షన్ మేరకు వాడాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ డ్రగ్ ఎక్కువ శాతం అందుబాటులో లేకపోవడంతో ఫేక్ ప్రిస్క్రిప్సన్లతో చాలా మంది ఓజెంపిక్ కొనుగోలు చేస్తున్నారు. 

దుష్ప్రభావాలు ఇవే

సెమాగ్లుటైడ్ దుష్ప్రభావాల గురించి వైద్యులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ డ్రగ్ తీసుకున్న వెంటనే వికారంగా అనిపిస్తుంది. అధిక మొత్తంలో దీన్ని వినియోగిస్తే అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అలాగే మలబద్ధకం , థైరాయిడ్ క్యాన్సర్ వంటి ప్రమాదాలు పెంచే అవకాశం ఉంది. దీర్ఘకాలంలో ఊబకాయం ఉన్న రోగుల్లో దీన్ని కేవలం బరువు తగ్గడం కోసమే ఉపయోగిస్తే అది శరీరానికి చాలా నష్టం చేస్తుందని సూచిస్తున్నారు. 

ఇవి కూడా చదవండి

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలుంటే నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇకపై అన్నింటికీ ఒకే కార్డు.. డెబిట్, క్రెడిట్ అన్నింటికీ ఒక్కటే
ఇకపై అన్నింటికీ ఒకే కార్డు.. డెబిట్, క్రెడిట్ అన్నింటికీ ఒక్కటే
ఒక్క రోజులోనే ధురంధర్ రికార్డ్ బ్రేక్ చేసిన సినిమా..
ఒక్క రోజులోనే ధురంధర్ రికార్డ్ బ్రేక్ చేసిన సినిమా..
కోపాన్ని దాచుకోవడం ఇంత ప్రమాదకరమా..? ఈ విషయం తెలిస్తే షాకవుతారు..
కోపాన్ని దాచుకోవడం ఇంత ప్రమాదకరమా..? ఈ విషయం తెలిస్తే షాకవుతారు..
వివాహం తర్వాత ఆధార్ కార్డులో భర్త పేరును ఎలా జోడించాలి?
వివాహం తర్వాత ఆధార్ కార్డులో భర్త పేరును ఎలా జోడించాలి?
కేతువు ఎఫెక్ట్.. ఈ రాశుల వారి జీవితంలో కొత్త మలుపే!
కేతువు ఎఫెక్ట్.. ఈ రాశుల వారి జీవితంలో కొత్త మలుపే!
ఇది ఏం అదృష్టం సామీ.. ఈ రాశులకు కోరిన కొర్కెలు తీర్చుకునే సమయంఇదే
ఇది ఏం అదృష్టం సామీ.. ఈ రాశులకు కోరిన కొర్కెలు తీర్చుకునే సమయంఇదే
రూ.18 వేల ఇన్వెస్ట్‌మెంట్‌తో రూ.2.5 కోట్ల లాభం..!
రూ.18 వేల ఇన్వెస్ట్‌మెంట్‌తో రూ.2.5 కోట్ల లాభం..!
ఆ సినిమాతో జగపతి బాబు లైఫ్ మారిపోయింది..
ఆ సినిమాతో జగపతి బాబు లైఫ్ మారిపోయింది..
గౌహతి గడ్డపై భారత్‌కు గండం..హర్షిత్ అవుట్.. టీమిండియా ప్లాన్ ఇదే
గౌహతి గడ్డపై భారత్‌కు గండం..హర్షిత్ అవుట్.. టీమిండియా ప్లాన్ ఇదే
మహేష్ బాబుకు ఇష్టమైన యాంకర్ అతడే.. ఇంటర్వ్యూ కోసం ప్రత్యేకంగా..
మహేష్ బాబుకు ఇష్టమైన యాంకర్ అతడే.. ఇంటర్వ్యూ కోసం ప్రత్యేకంగా..