Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kiwis for Health: ఎముకల పటిష్టత, మెరిసే చర్మం కావాలంటే కివీలు తినాల్సిందే.. ఇంకెన్నో ప్రయోజనాలు కూడా.. అవేమిటంటే..

మన శరీరానికి అన్ని రకాల పోషకాలు సమపాళ్లలో అంటే సరిపడా అందేలా చూసుకోవాలి. అందుకోసం సరైన డైట్‌ను ప్లాన్‌ చేసుకోవాలి. అటువంటి డైట్‌కు..

Kiwis for Health: ఎముకల పటిష్టత, మెరిసే చర్మం కావాలంటే కివీలు తినాల్సిందే.. ఇంకెన్నో ప్రయోజనాలు కూడా.. అవేమిటంటే..
Kiwi Fruits For Health
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Feb 21, 2023 | 6:23 PM

తాజా పండ్లు, కూరగాయలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాటిలో మన శరీరానికి కావాల్సిన విటమిన్లు, మినరల్స్, ఫైబర్‌లు వంటి పలు రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే మన శరీరానికి అన్ని రకాల పోషకాలు సమపాళ్లలో అంటే సరిపడా అందేలా చూసుకోవాలి. లేకపోతే పోషకాహార లోపం ఏర్పడే అవకాశం ఉంది. అందుకోసం సరైన డైట్‌ను ప్లాన్‌ చేసుకోవాలి. అటువంటి డైట్‌కు ఇంకా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పండ్లలో కివీ కూడా ఒకటి. ఈ పండును మన డైట్‌ లేదా రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా చర్మ సంరక్షణ నుంచి వ్యాధినిరోధకత వరకు అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మరి కీవి పండ్లతో కలిగే ఆ ప్రయోనాలు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

మెరిసే చర్మం: కివీ పండులో విటమిన్‌ సి పుష్కలంగా ఉంటుంది. ఈ విటమిన్‌ సి చర్మాన్ని ఆరోగ్యంగా, నాజూకు, మెరిసేలా ఉంచుతుంది. వంద గ్రాముల కివీ పండు తింటే ఒక రోజులో దేహానికి అవసరమైన సి విటమిన్‌లో అధిక శాతం లభిస్తుంది. అంతేకాక కివీ పండులో యాంటీ ఆక్సిడెంట్స్‌ ఉండడం వల్ల మన చర్మం పాలిపోకుండా, ముడుతలు పడకుండా ఉంటుంది. పచ్చి కివీ ముక్కలు తినడం ద్వారా కానీ, లేదంటే నేరుగా చర్మానికి రాసుకోవడం ద్వారా కానీ ఈ ప్రయోజనాలను పొందవచ్చు.

రక్తపోటు నియంత్రణ: ప్రస్తుతం మానవాళి ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలలో అధిక రక్తపోటు, దాని కారణంగా వచ్చే గుండెపోటు ప్రథమ స్థానంలో ఉన్నాయి. అలాంటివారికి కివీ ఫ్రూట్‌ ఒక వరం లాంటిది. ఎందుకంటే కివీ పండులో పొటాషియం కంటెంట్‌ పుష్కలంగా ఉంటుంది. ఈ పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచడానికి తోడ్పడుతుంది. అంతేకాక రక్తపోటు కారణంగా వచ్చే పక్షవాతం, టైప్‌-2 డయాబెటిస్‌ ప్రమాదాన్ని కూడా ఇది తగ్గిస్తుంది.

ఇవి కూడా చదవండి

జీర్ణశక్తి: కివీ పండు జీర్ణశక్తికి కూడా బాగా పనిచేస్తుంది. ప్రతి 100 గ్రాముల కివీ పండులో 3 గ్రాముల ఫైబర్‌ ఉంటుంది. అంతేగాక, ప్రతిరోజూ మానవ శరీరానికి అవసరమైన ఫైబర్‌లో 12 శాతం అందుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ ఫైబర్‌లు సునాయాసమైన, ఆరోగ్యకరమైన జీర్ణశక్తికి దోహదం చేస్తాయి. కివీ పండులో ఎంజైమ్‌లను కరిగించే ప్రొటీన్‌ కూడా ఉంటుంది. దాంతో ఎంజైమ్‌లు అత్యంత వేగంగా అమైనో ఆసిడ్స్‌గా మారతాయి.

ప్రశాంతమైన నిద్ర: కివీ పండులో సెరటోనిన్‌ లాంటి నిద్రకు ఉపకరించే పదార్థాలు ఉన్నాయి. అందువల్ల తరచూ కివీ పండు తినేవారికి హాయిగా నిద్ర పడుతుంది. నిద్రలేమి సమస్యతో బాధపడేవారికి ఈ పండు మంచి మేలు చేస్తుంది. కివీ పండులోని పదార్థాలు సహజసిద్ధమైన నిద్రకు తోడ్పడుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

రోగనిరోధక శక్తి: సి విటమిన్‌కు కివీ పండు మంచి వనరు. ఈ విటమిన్‌ రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో కూడా బాగా పనిచేస్తుంది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ క్రమబద్ధీకరణకు తోడ్పడుతాయి. ఫ్రీ రాడికల్స్‌వల్ల శరీరానికి నష్టం జరగకుండా కాపాడుతాతాయి.

దృఢమైన ఎముకలు: ఎముకల పటిష్టత విషయంలో చాలా మందికి కివీ పండ్లు స్ఫురణకు కూడా రావకు. కానీ, వాస్తవానికి కివీ పండులో ఎముకలను బలోపేతం చేసే ఫోలేట్‌ ఉంటుంది. ఈ ఫోలేట్‌ ఎముక నిర్మాణానికి తోడ్పుడుతుంది. ఎముకల గట్టితనానికి కివీలోని విటమిన్‌ కే కూడా బాగా ఉపకరిస్తుంది. అందుకే గర్భిణిల డైట్‌లో కివీ పండును చేర్చడం చాలా ముఖ్యం.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..