AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dangerous Combination: వీటిని పొరపాటున కూడా కలిపి తినకూడదు.. తింటే తీవ్ర ఆరోగ్య సమస్యలు ఖాయం..! ఎందుకంటే..?

రోజూ పండ్లు తినేవారు డైటింగ్ నిమిత్తం కూడా ఫ్రూట్ సలాడ్ తీసుకుంటుంటారు. అయితే ఫ్రూట్ సలాడ్‌లో లేదా కలిపి తినే ఆహారాల విషయంలో..

Dangerous Combination: వీటిని పొరపాటున కూడా కలిపి తినకూడదు.. తింటే తీవ్ర ఆరోగ్య సమస్యలు ఖాయం..! ఎందుకంటే..?
Dangerous Fruit Combination
శివలీల గోపి తుల్వా
|

Updated on: Feb 21, 2023 | 5:48 PM

Share

మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే పండ్లు, కూరగాయలను తప్పనిసరిగా తినాలని వైద్యులు, ఆరోగ్య నిపుణుల సూచన. వీటిని తినడం వల్ల అనేక రకాల పోషకాలు శరీరానికి లభించడం ద్వారా పలు విధాలైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇంకా రోజూ పండ్లు తినే అలవాటు ఉన్నవారు ఫిట్ అండ్ స్లిమ్‌గా ఉంటారు. అంతేకాకుండా వీరికి చాలా రకాల వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి. డైటింగ్ నిమిత్తం కూడా చాలామంది ఫ్రూట్ సలాడ్ తీసుకుంటుంటారు. అయితే ఫ్రూట్ సలాడ్‌లో లేదా కలిపి తినే ఆహారాల విషయంలో కొన్ని రకాల నియమాలు పాటించవలసి ఉంటుంది. అలా పాటించకపోతే ఫుడ్ పాయిజనింగ్, లేదా పేగులు మాడిపోవడం వంటి తీవ్ర సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. మరి ఈ క్రమంలో ఏయే పండ్లు, కూరగాయలను కలిపి తినకూడదో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

ఏయే పండ్లు, కూరగాయలను కలిపి తినకూడదంటే.. 

ఆరెంజ్-క్యారట్: ఆరెంజ్, క్యారట్ కాంబినేషన్ ఆరోగ్యానికి అసలు మంచిది కాదు. ఈ కాంబినేషన్ కారణంగా మన ఆరోగ్యానికి ముప్పుగా పరిణమిస్తుంది. ఈ రెండింటినీ ఒకేసారి తీసుకోవడం వల్ల గుండె మంట సమస్య ఏర్పడుతుంది. కిడ్నీలు పాడయ్యే అవకాశం కూడా లేకపోలేదు. అంతేకాక ఇతర ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తవచ్చని నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు.

జామ-అరటి: జామకాయ, అరటిని కలిపి తీసుకోవడం కూడా మంచిది కాదు. ఈ కాంబినేషన్ ఆరోగ్యానికి సమస్యగా మారుతుంది. ఈ రెండు పండ్లను కలిపి ఒకేసారి తినడం వల్ల ఎసిడిటీ, తలనొప్పి వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి.

ఇవి కూడా చదవండి

పైనాపిల్-పాలు: పైనాపిల్‌లో బ్రోమెలెన్ అనే పోషక పదార్ధం ఉంటుంది. ఇది ఓ రకమైన ఎంజైమ్. ఇంకా ఇది పైనాపిల్ రసం నుంచి వస్తుంది. దీనిని పాలతో కలపడం వల్ల గ్యాస్, వాంటింగ్ సెన్సేషన్ వంటి పలు రకాల ఆరోగ్య సమస్యలు రావచ్చు.

బొప్పాయి-నిమ్మ: చాలామందికి పండ్లపై నిమ్మరసం పిండుకునే అలవాటు ఉంటుంది. అది మంచి అలవాటే అని కూడా నమ్ముతారు. కానీ బొప్పాయిపై పొరపాటున కూడా అలా చేయవద్దు. అంటే బొప్పాయిపై నిమ్మరసం పిండటం మంచిది కాదు. ఎందుకంటే బొప్పాయి, నిమ్మకాయ అనేది ప్రమాదకర కాంబినేషన్. ఎనీమియా, హిమోగ్లోబిన్ సమస్య ఉత్పన్నం కావచ్చు.

పండ్లు-కూరగాయలు: పండ్లతో కూరగాయల్ని కలిపి తీసుకోవడం కూడా మంచిది కాదు. ఇలా తినడం వల్ల అవి మన కడుపులో విష పదార్ధంగా మారుతాయి. ఫలితంగా ఫుడ్ పాయిజనింగ్, అజీర్తి, తలనొప్పి, విరేచనాలు వంటి సమస్యలు రావచ్చు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి