Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Harman Preet Kaur: అరుదైన ఘనత సాధించిన టీమిండియా సారథి.. కోహ్లీ, రోహిత్ సరసన చేరిన హర్మన్‌ప్రీత్..

షఫాలీ నిష్క్రమించిన తర్వాత  బ్యాటింగ్‌కు వచ్చిన  కౌర్.. ఏడు పరుగులు చేయగానే  టీ20లలో 3 వేల పరుగుల మైలురాయిని అందుకుంది. టీ20 క్రికెట్‌లో భారత్ తరఫున 3 వేల..

Harman Preet Kaur: అరుదైన ఘనత సాధించిన టీమిండియా సారథి.. కోహ్లీ, రోహిత్ సరసన చేరిన హర్మన్‌ప్రీత్..
Harmanpreet Kaur
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Feb 20, 2023 | 9:18 PM

టీమిండియా మహిళా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా దక్షిణాఫ్రికా వేదికగా.. ఐర్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆమె ఏడు పరుగులు చేయగానే  టీ20లలో 3వేల  పరుగుల మైలురాయిని  అందుకుంది. తద్వారా భారత్ తరఫున అత్యధిక పరుగులు సాధించిన మహిళా క్రికెటర్‌గా, అలాగే టీ20లలో మూడు వేల పరుగులు చేసిన క్రికెటర్‌గా రికార్డు పుటల్లోకెక్కింది. ఐర్లాండ్‌తో జరుగుతున్న ప్రస్తుత మ్యాచ్ టీమిండియా తరఫున హర్మన్‌ప్రీత్‌కు  టీ20లలో 150వ మ్యాచ్. ఇది కూడా ఓ రికార్డే. భారత్‌తో పాటు అంతర్జాతీయ టీ20లలో ఇన్ని మ్యాచ్‌లు ఆడిన తొలి మహిళ క్రికెటర్ కూడా ఆమెనే కావడం గమనార్హం.

కాగా ఈ మ్యాచ్‌లో షఫాలీ నిష్క్రమించిన తర్వాత  బ్యాటింగ్‌కు వచ్చిన  కౌర్.. ఏడు పరుగులు చేయగానే  టీ20లలో 3 వేల పరుగుల మైలురాయిని అందుకుంది. టీ20 క్రికెట్‌లో భారత్ తరఫున 3 వేల పరుగులు సాధించిన తొలి క్రికెటర్‌గా నిలిచిన  కౌర్.. మొత్తంగా ఈ జాబితాలో  నాలుగో బ్యాటర్‌గా  ఉంది. ఆ జాబితాలో ఆమె కంటే ఎవరెవరు ముందు ఉన్నారంటే.. bsp;

ఇవి కూడా చదవండి

టీ20లలో 3000 పరుగులు సాధించిన మహిళా క్రికెటర్లు..

  1. సుజన్న విల్సన్ బేట్స్ (న్యూజిలాండ్) : 143 మ్యాచ్‌లలో 3,820 రన్స్
  2. మెగ్ లానింగ్ (ఆస్ట్రేలియా) : 130 మ్యాచ్‌లలో 3,346 రన్స్
  3. – ఎస్ఆర్ టేలర్ (వెస్టిండీస్) : 113 మ్యాచ్‌లలో 3,346 రన్స్
  4. – హర్మన్‌ప్రీత్ (ఇండియా) : 150 మ్యాచ్‌లలో 3006 రన్స్

ఇక ఈ జాబితాకు చేరువలో టీమిండియా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన.. 115 మ్యాచ్‌లు ఆడి  2,800 పరుగులు చేసి ఆరో స్థానంలో నిలిచింది. ఆమె కంటే ముందు కివీస్ సారథి సోఫి డివైన్ 119 మ్యాచ్‌లలో 2,969 పరుగులు చేసి ఐదో స్థానంలో ఉంది. భారత్ నుంచి  అత్యధిక పరుగుల జాబితాలో హర్మన్‌ప్రీత్, మంధాన తర్వాత మిథాలీ రాజ్ (89 మ్యాచ్‌లలో 2,364 రన్స్)‌తో మూడో స్థానంలో ఉంది. టీమిండియా స్టార్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్.. 79 మ్యాచ్‌లలో  1,661  పరుగులు చేసింది. కాగా టీ20లలో భారత క్రికెట్(పురుషులు, స్త్రీలు)లో మూడు వేల పరుగులు సాధించిన క్రికెటర్లలో  హర్మన్ మూడో స్థానంలో ఉంది. విరాట్ కోహ్లీ (4008), రోహిత్ శర్మ (3,853) తర్వాత హర్మన్ ఉండటం గమనార్హం.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..