AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UAE Vs AFG: 4 ఫోర్లు, 5 సిక్సర్లతో శివాలెత్తిన ఆల్‌రౌండర్.. 22 బంతుల్లో మ్యాచ్ బిగ్ ‘టర్న్’.. ఎవరంటే!

అసలే డిసైడర్ మ్యాచ్.. పైగా సిరీస్‌ చేజిక్కించుకోవాలంటే తప్పక గెలవాల్సిందే. ఈ తరుణంలో ఓ ప్లేయర్ ప్రత్యర్ధి బౌలర్లపై శివాలెత్తాడు..

UAE Vs AFG: 4 ఫోర్లు, 5 సిక్సర్లతో శివాలెత్తిన ఆల్‌రౌండర్.. 22 బంతుల్లో మ్యాచ్ బిగ్ 'టర్న్'.. ఎవరంటే!
Afg Vs Uae
Ravi Kiran
|

Updated on: Feb 20, 2023 | 8:25 PM

Share

అసలే డిసైడర్ మ్యాచ్.. పైగా సిరీస్‌ చేజిక్కించుకోవాలంటే తప్పక గెలవాల్సిందే. ఈ తరుణంలో ఓ ప్లేయర్ ప్రత్యర్ధి బౌలర్లపై శివాలెత్తాడు. 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 22 బంతుల్లో మ్యాచ్ మలుపు తిప్పాడు.. సీన్ కట్ చేస్తే.. ఆ ప్లేయర్ ఆడుతోన్న జట్టు సిరీస్ కైవసం చేసుకుంది. ఇంతకీ ఆ మ్యాచ్ ఏంటి.? ఆ బౌలర్ ఎవరంటే.?

3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం ఆఫ్గనిస్తాన్.. యూఏఈలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 19న ఆదివారం జరిగిన నిర్ణయాత్మక మూడో టీ20లో ఆఫ్ఘన్ 6 వికెట్ల తేడాతో యూఏఈపై అద్భుత విజయాన్ని అందుకుని.. సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన యూఏఈ.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ఆ జట్టు ఓపెనర్లు ముహమ్మద్‌ వసీం(75), అరవింద్‌ (59) అర్ధశతకాలతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. అఫ్గన్ బౌలర్లలో కెప్టెన్‌ రషీద్‌ ఖాన్‌, గుల్బదిన్‌ చెరో 2 వికెట్లు పడగొట్టారు.

అనంతరం 164 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్‌‌ జట్టును.. ఇబ్రహీం జద్రాన్‌ (60 నాటౌట్‌), కరీమ్‌ జనత్‌(56 నాటౌట్) ఆదుకున్నారు. ఈ ఇద్దరూ తుఫాన్ ఇన్నింగ్స్‌తో మరో 5 బంతులు మిగిలి ఉండగా లక్ష్యాన్ని చేదించింది ఆఫ్గనిస్తాన్ జట్టు. ముఖ్యంగా కరీం జనత్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 21 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ చేయడమే కాకుండా, సిక్సర్ కొట్టి తన జట్టును గెలిపించాడు. మొత్తంగా జనత్ 22 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 56 పరుగులు బాదేశాడు. ఇక యూఏఈ బౌలర్లలో జహుర్‌ ఖాన్‌ 2 వికెట్లు, అకీఫ్‌ రాజా, జవార్‌ ఫరీద్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్