Walnuts for Health: వాల్‌నట్స్‌తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే.. ఎవరైనా వారెవ్వా అనాల్సిందే..!

పోషకాహార నిపుణులు సూచనల ప్రకారం రోజుకు 5 వాల్ నట్స్‌ను తింటే చాలు.. శరీంరలో ఉన్న వ్యర్థాలు, సమస్యలకు ఉపశమనం కలుగుతుంది. అంతేకాక..

Walnuts for Health: వాల్‌నట్స్‌తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే.. ఎవరైనా వారెవ్వా అనాల్సిందే..!
Walnuts
Follow us

|

Updated on: Feb 20, 2023 | 5:53 PM

శరీర ఆరోగ్యాన్ని కాపాడడానికి కావలసిన పోషకాలు డ్రైనట్స్‌లో పుష్కలంగా ఉంటాయి. జీడిపప్పు, బాదం, వాల్ నట్స్, పీనట్స్, పిస్తా అంటూ అనేక రకాల డ్రైనట్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. వీటితో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలంటే.. తెలిసినవారు తినకుండా ఉండలేరు. అయితే వీటన్నింటిలోకి టాప్ వన్‌గా ఉండే వాల్ నట్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇందులో ఎన్నోరకాల పోషకాలు.. అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, మంచి ఫ్యాట్స్, ఓమేగా 2 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్ , విటమిన్స్, క్యాల్సియం, పొటాషియం, సోడియం వంటివి ఎన్నో పుష్కలంగా లభిస్తాయి. వీటితో పాటు వాల్ నట్స్‌లో యాంటీఆక్సిడెంట్స్, యాంటీఇన్పమేటరీ లక్షణాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. పోషకాహార నిపుణులు సూచనల ప్రకారం రోజుకు 5 వాల్ నట్స్‌ను తింటే చాలు.. శరీంరలో ఉన్న వ్యర్థాలు, సమస్యలకు ఉపశమనం కలుగుతుంది. అంతేకాక ఎన్నో రకాలుగా ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. మరి ఈ వాల్ నట్స్ ద్వారా ఏయే ప్రయోజనాలను పొందవచ్చో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

  1. హార్ట్ హెల్త్: వీటిలో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉన్నాయి. మోనో శ్యాచురేటెడ్ ఫ్యాట్స్ కూడా ఎక్కువే. ఇంకా వాల్ నట్స్ శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గించి..  మంచి కొలెస్ట్రాల్ లెవల్స్‌ను పెంచుతాయి.  హెల్తీ హార్ట్‌కు వాల్ నట్స్ ఒక మంచి సోర్స్ .
  2. బ్లడ్ ప్రెజర్: రోజుకు 5 వాల్ నట్స్ తింటే చాలు బ్లడ్ ప్రెజర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి. వాల్ నట్స్‌లో ఫాలీ శ్యాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇవి శరీరంలో బ్లడ్ ప్రెజర్ లెవల్స్‌ను తగ్గిస్తాయి.
  3. బరువు తగ్గడం: బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఆప్షన్ డ్రైడ్ ఫ్రూట్స్. ఇక వాల్ నట్స్‌లో ఫాలీ శ్యాచురేటెడ్ ఫ్యాట్స్ అధికంగా ఉండడం వల్ల తిన్నవారికి ఎక్కువ సమయం ఆకలి కాకుండా ఉంటుంది. ఇతర ఆహారాల మీద కోరికలను తగ్గిస్తుంది. తద్వారా బరువు తగ్గవచ్చు.
  4. బ్రెయిన్ హెల్త్: వాల్ నట్స్‌లో ఫ్యాటీయాసిడ్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇవి బ్రెయిన్‌ను హెల్తీగా ఉంచుతాయి. దాంతో బ్రెయిన్‌కు సంబంధించిన మతిమరుపు వంటి సమస్యలను నివారిస్తుంది.
  5. ఇవి కూడా చదవండి
  6. కొలెస్ట్రాల్ నియంత్రణ: వాల్ నట్స్‌లో ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, విటమిన్స్, ఎసెన్షియల్ మినిరల్స్ అధికంగా ఉన్నాయి. ఇవి శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి.
  7. డయాబెటిస్: వాల్ నట్స్‌లో పాలీఅన్‌శ్యాచురేటెడ్స్, మోనోఅన్‌శ్యాచురేటుడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉన్నాయి. వాల్ నట్స్ ఒక బెస్ట్ న్యూట్రీషియన్ కాబట్టి ఇది డయాబెటిస్‌ను అండర్ కంట్రోల్‌లో ఉంచుతుంది.
  8. బోన్ హెల్త్: వాల్ నట్స్‌లో ఎసెన్షియల్ ఫ్యాటీయాసిడ్స్ లేదా ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇవి క్యాల్షియంను ఎక్కువగా గ్రహించి బోన్ హెల్త్‌ను మెరుగుపరుస్తాయి.
  9. బాడీ మెటబాలిజం: వాల్ నట్స్‌లో మినిరల్స్, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండటం వల్ల.. బాడీ మెటబాలిజంను మెరుగుపరచడంలో గొప్పగా గా సహాయపడుతుంది.

ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి