AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bandla Ganesh: మరోసారి బండ్ల గణేష్ వివాదాస్పద వ్యాఖ్యలు.. ‘ప్రాణం పోయినా శ‌త్రువుతో మాట్లాడను’ అంటూ..

విషాద సమయంలో చేయాల్సిన కార్యక్రమాల గురించి ఇద్దరు మాట్లాడుకుంటున్నారని అంతా భావించారు. కానీ బండ్ల గణేష్..

Bandla Ganesh: మరోసారి బండ్ల గణేష్ వివాదాస్పద వ్యాఖ్యలు.. ‘ప్రాణం పోయినా శ‌త్రువుతో మాట్లాడను’ అంటూ..
Bandla Ganesh Tweet On Chandrababu And Vijauasai Reddy
శివలీల గోపి తుల్వా
| Edited By: Ravi Kiran|

Updated on: Feb 20, 2023 | 9:47 PM

Share

టాలీవుడ్ సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ మరో వివాదానికి కేంద్ర బిందువుగా మారారు. నందమూరి తారకరత్న భౌతికకాయానికి నివాళులర్పించేందుకు ఆయన ఇంటికి వెళ్లిన చంద్రబాబు.. అక్కడే ఉన్న విజయసాయిరెడ్డితో మాట్లాడారు. వీరిని ఉద్దేశించి బండ్ల గణేష్ చేసిన ట్వీట్ ప్రస్తుతం నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది. కాగా, తారకరత్నకు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మేనమామ వరుస అవుతారు. చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి.. తారకరత్నకు స్వయాన మేనత్త. అలాగే తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి విజయసాయిరెడ్డికి వరుసకు కూతురు అవుతుంది. విజయసాయి రెడ్డి భార్య సోదరి కూతురే అలేఖ్య రెడ్డి. ఈ క్రమంలోనే తారకరత్న మృతితో విషాదంలో ఉన్న అలేఖ్య రెడ్డి, ఇతర కుటుంబ సభ్యులను ఓదార్చేందుకు విజయసాయిరెడ్డి అక్కడే ఉన్నారు.

అంతేకాక అక్కడికి వచ్చినవారితో నందమూరి కుటుంబ సభ్యులు, ఇతరులతో ఆయన మాట్లాడటమే కాకుండా జరగాల్సిన  కార్యక్రమాల గురించి  చర్చిస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే అక్కడికి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, చంద్రబాబు, బాలకృష్ణ తదితరులతో కూడా విజయసాయిరెడ్డి మాట్లాడారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ప్రత్యర్థులైన చంద్రబాబు, విజయసాయిరెడ్డి పక్కపక్కనే కూర్చొని మాట్లాడుతున్న ఫొటో, వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీరిద్దరు కూడా తారకరత్నకు ఇరువైపులా బంధువులు కావడంతో.. విషాద సమయంలో చేయాల్సిన కార్యక్రమాల గురించి మాట్లాడుకుంటున్నారని అంతా భావిస్తున్నారు. చాలా వరకు ఈ ఘటనకు ఎలాంటి దురుద్దేశాలు అపాదించలేదు. కానీ బండ్ల గణేష్ మాత్రం ఈ ఫోటోను ట్టిట్టర్ వేదికగా షేర్ చేస్తూ సంచలన కామెంట్స్ చేశారు.

ఇవి కూడా చదవండి

తాను ప్రాణం పోయినా శత్రువు అనుకున్న వ్యక్తితో ఈ విధంగా కూర్చొని మాట్లాడనని అన్నారు. బతికితే సింహంలా బతకాలి.. చచ్చిపోతే సింహంలా చచ్చిపోవాలని కూడా పేర్కొన్నారు. దీంతో బండ్ల గణేష్ తీరును తప్పుబడుతూ పలువురు నెటిజన్లను ఆయనపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇక, ఇటీవలికాలంలో ట్విట్టర్‌లో బండ్ల గణేష్ చేస్తున్న పోస్టులు.. తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్న సంగతి కూడా మనకు తెలిసిందే. పలు సందర్భాల్లో ఆయన ట్వీట్స్‌పై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.