AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raja Singh: చంపేస్తామంటూ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెదిరింపు కాల్స్‌.. పాకిస్థాన్‌ నుంచి..

తనను చంపుతామంటూ బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయని గోషామహల్‌ ఎమ్మెల్యే రాజా సింగ్‌ వెల్లడించారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, తెలంగాణ డీజీపీ అంజన్ కుమార్, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ను

Raja Singh: చంపేస్తామంటూ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెదిరింపు కాల్స్‌.. పాకిస్థాన్‌ నుంచి..
Mla Raja Singh
Shaik Madar Saheb
|

Updated on: Feb 20, 2023 | 8:53 PM

Share

తనను చంపుతామంటూ బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయని గోషామహల్‌ ఎమ్మెల్యే రాజా సింగ్‌ వెల్లడించారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, తెలంగాణ డీజీపీ అంజన్ కుమార్, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. ఓ పాకిస్థానీ నుంచి సోమవారం మధ్యాహ్నం 3.34 గంటలకు తనకు వాట్సాప్ కాల్ వచ్చిందని రాజాసింగ్ వెల్లడించారు.‘‘నన్ను చంపుతామంటూ బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయి. ఇవాళ సాయంత్రం 3.34 గంటలకు బెదిరింపు కాల్‌ వచ్చింది. పాకిస్థానీ వాట్సాప్‌ కాల్‌ ద్వారా చంపుతామంటున్నారు. తమ స్లీపర్‌ సెల్స్‌ యాక్టివ్‌గా ఉన్నాయంటున్నారు. ప్రతిరోజు ఇలాంటి బెదిరింపు కాల్స్‌ వస్తూనే ఉన్నాయి’’ అంటూ రాజాసింగ్ ట్వీట్‌ చేశారు.

తనకు కాల్ చేసిన వ్యక్తి వద్ద తన కుటుంబ వివరాలన్నీ ఉన్నాయంటూ రాజాసింగ్ పేర్కొన్నారు. ఇదిలాఉంటే.. వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఎమ్మెల్యే రాజాసింగ్‌ కు కొన్ని వారాల క్రితం హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఇటీవలే రాజాసింగ్‌ను పోలీసులు మరో వివాదంలో అరెస్టు చేసి విడిచిపెట్టారు.

అయితే, తెలంగాణ ప్రభుత్వం తనకు కేటాయించిన బుల్లెట్ ఫ్రూప్ వాహనం పదే పదే పాడవుతోందని.. దానికి నిరసనగా.. కారు ప్రగతి భవన్ వద్దకు రాజాసింగ్ తీసుకొచ్చి అక్కడ వదిలేసి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో రాజాసింగ్‌ను పోలీసులు అరెస్టు చేసి అనంతరం విడిచిపెట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

Follow Us
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలి? ఆరోగ్య నిపుణులు,పరిశోధనల ప్రకారం
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలి? ఆరోగ్య నిపుణులు,పరిశోధనల ప్రకారం
సెంచరీ కొట్టి కసి తీర్చుకున్న డికాక్.. ఐపీఎల్‌లో అరుదైన రికార్డు
సెంచరీ కొట్టి కసి తీర్చుకున్న డికాక్.. ఐపీఎల్‌లో అరుదైన రికార్డు
ఒకే బిల్లు.. మొత్తం ఫ్యామిలీకి ఇంటర్నెట్‌!
ఒకే బిల్లు.. మొత్తం ఫ్యామిలీకి ఇంటర్నెట్‌!
చల్లని కబురు చెప్పిన వాతావరణశాఖ.. రెండ్రోజుల పాటు వర్షాలు
చల్లని కబురు చెప్పిన వాతావరణశాఖ.. రెండ్రోజుల పాటు వర్షాలు
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఒక్కసారిగా ఛేంజ్.. లేటెస్ట్ రేట్లు..
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఒక్కసారిగా ఛేంజ్.. లేటెస్ట్ రేట్లు..
పంజాబ్ కొంపముంచిన చాహల్.. ఒక్క తప్పుకు 108 పరుగుల భారీ మూల్యం
పంజాబ్ కొంపముంచిన చాహల్.. ఒక్క తప్పుకు 108 పరుగుల భారీ మూల్యం
అద్భుతమైన ప్లాన్స్‌ తీసుకొచ్చిన BSNL.. ఓ లుక్కేయండి!
అద్భుతమైన ప్లాన్స్‌ తీసుకొచ్చిన BSNL.. ఓ లుక్కేయండి!
రాశిఫలాలు (17 ఏప్రిల్ 2026): ఆ రాశుల వారికి ఆదాయం, శుభవార్తలు..
రాశిఫలాలు (17 ఏప్రిల్ 2026): ఆ రాశుల వారికి ఆదాయం, శుభవార్తలు..
ఆ విషయంలో నాన్ననే ఫాలో అవుతా.. రామ్ చరణ్..
ఆ విషయంలో నాన్ననే ఫాలో అవుతా.. రామ్ చరణ్..
బాడీ బిల్డింగ్ కోసం చరణ్ రోజూ ఆ హీరో దగ్గరకు వెళ్లేవాడు.. కానీ
బాడీ బిల్డింగ్ కోసం చరణ్ రోజూ ఆ హీరో దగ్గరకు వెళ్లేవాడు.. కానీ