Jagadish Reddy: తెలంగాణలో కరెంట్ కోతలు తెచ్చేలా కుట్రలు.. కేంద్రంపై మంత్రి జగదీష్ రెడ్డి సంచలన ఆరోపణలు
బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ.. రెండు ప్రధాన పార్టీల నడుమ కొనసాగుతున్న విమర్శలు, ఆరోపణలతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. తాజాగా.. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి..
బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ.. రెండు ప్రధాన పార్టీల నడుమ కొనసాగుతున్న విమర్శలు, ఆరోపణలతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. తాజాగా.. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీకి కేసీఆర్ భయం పట్టుకుందంటూ విమర్శించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ను నిలువరించడమే పనిగా మోడీ పెట్టుకున్నారంటూ మండిపడ్డారు. తెలంగాణలో కరంట్ కోతలు తెచ్చేలా మోడీ అండ్ గ్యాంగ్ కుట్రలు చేస్తున్నారంటూ కేంద్రంపై మండిపడ్డారు. గుజరాత్‌లో వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్ట.. మోడీ రైతుల ఉసురు తీసుకుంటున్నారంటూ ఆరోపించారు. తెలంగాణలో వ్యవసాయాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని.. అందుకోసం ప్రణాళికలు రచించించదని ఆరోపించారు. బీజేపీని తరిమి కొట్టాలంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణలో కరెంటు కోతలే లక్ష్యంగా ప్రణాళిక చేస్తున్నారంటూ జగదీష్ రెడ్డి విమర్శించారు.
అంతకుముందు కూడా మంత్రి జగదీష్ రెడ్డి కేంద్రంపై పలు విమర్శలు చేశారు. విదేశీ బొగ్గు నిల్వలతో తయారు చేసిన విద్యుత్‌ని 50 రూపాయల వరకు అమ్ముకోవచ్చన్న కేంద్ర ఈఆర్‌సీ నిర్ణయాన్ని తప్పుబట్టిన మంత్రి.. ప్రజలకు విద్యుత్ సౌకర్యాన్ని దూరం చేసేందుకు కేంద్రం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ఆదాని లాంటి ప్రైవేట్ కంపెనీలకు లాభం చేకూర్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందంటూ మండిపడ్డారు. సంస్కరణల పేరుతో ప్రైవేట్ వ్యక్తులకు ప్రజల డబ్బులు దోచిపెట్టేందుకే కేంద్రం దుర్మార్గంగా వ్యవహరిస్తుందని మంత్రి జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..