AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pomegranate benefits: దానిమ్మతో దిమ్మతిరిగే ప్రయోజనాలు.. తెలిస్తే తినకుండా ఉండనే ఉండరు..

ఒక దానిమ్మ పండులో దాదాపు 600 వరకు గింజలు ఉంటాయి. వీటిల్లో పోషకాలు చాలా నిండుగా ఉంటాయి. ఇవి శరీరం లోపల, బయట,..

Pomegranate benefits: దానిమ్మతో దిమ్మతిరిగే ప్రయోజనాలు.. తెలిస్తే తినకుండా ఉండనే ఉండరు..
Pomegranate benefits
శివలీల గోపి తుల్వా
|

Updated on: Feb 20, 2023 | 4:38 PM

Share

పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. మన శరీరానికి అవసరమైన పోషకాలను ఇవి పుష్కలంగా కలిగి ఉంటాయి. అంతేకాక వీటిలోని పోషకాలతో మనకు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇక అలాంటి పోషకాలను కలిగిన పండ్లలో దానిమ్మ కూడా ప్రముఖమైనది. అందుకే చాలా మంది డాక్టర్లు తమ వద్దకు వచ్చిన రోగులకు దానిమ్మ గింజలను తినాలని సూచిస్తారు. పలు పరిశోధనల ప్రకారం దానిమ్మ గింజలు, అధిక రక్తపోటు, ఎక్కువ కొలెస్ట్రాల్, ఆక్సిడేటివ్ స్ట్రెస్, వాపులు వంటి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలను నియంత్రించటం, తగ్గించటం చేస్తాయి. ఇక దానిమ్మ గింజలను నేరుగా పచ్చిగా తింటారు లేదా దానిమ్మ రసం తీసుకుని తాగుతారు. ఒక దానిమ్మ పండులో దాదాపు 600 వరకు గింజలు ఉంటాయి. వీటిల్లో పోషకాలు చాలా నిండుగా ఉంటాయి. ఇవి శరీరం లోపల, బయట, ఆరోగ్యానికి చాలా సానుకూల ప్రభావాలు చూపిస్తుంది. దానిమ్మ గింజలలో  విటమిన్ బి, సి, కె, ఇంకా యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇంకా పొటాషియం, క్యాల్షియం వంటి పలు రకాల మినరల్స్ కూడా వీటిలో ఉంటాయి. మరి ఇన్ని పోషకాలను కలిగిన దానిమ్మతో మన ఆరోగ్యానికి ఎటువంటి ప్రయోజనాలు చేకూరుతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

  1. దృఢమైన పళ్ళు: దానిమ్మ గింజలు చిగుళ్ళను బలపర్చి, వదులుగా మారిన పళ్ళను గట్టిపరుస్తాయి. ఈ గింజలు నోటిలోని బ్యాక్టీరియాతో కూడా పోరాడుతాయి.
  2. జీర్ణశక్తి: దానిమ్మ గింజలు జీర్ణ వ్యవస్థను మెరుగ్గా పనిచేసేలా చేస్తాయి. ఎందుకంటే వీటిలో బి- కాంప్లెక్స్ విటమిన్లు ఉంటాయి. ఈ విటమిన్లు మీ శరీరంలోని కొవ్వులు, ప్రొటీన్లు, కార్బొహైడ్రేట్లను శక్తిగా మార్చటానికి సాయపడతాయి. దానిమ్మ గింజలలో ఉండే పీచు పదార్థం జీర్ణప్రక్రియకి ముఖ్యమైనది కూడా.
  3. బరువు తగ్గడం: బరువు తగ్గాలనుకుంటే.. దానిమ్మ గింజలు ఎంతగానో సహాయపడతాయి. ఇవి బరువు తగ్గటంలో సాయపడతాయి. వాటిల్లో ఉండే పీచుపదార్థం చాలాసేపు వరకు మీ కడుపు నిండుగా వున్న ఫీలింగ్ కలిగిస్తుంది. దానిమ్మ గింజలు స్థూలకాయాన్ని కూడా నివారించి, కొవ్వును కరిగించటంలో సాయపడతాయి.
  4. రోగనిరోధక వ్యవస్థ: దానిమ్మ గింజలలో ఉండే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తాయి. ఈ గింజలలోని కొన్ని ప్రత్యేక లక్షణాలు మీ రోగనిరోధక వ్యవస్థను బలహీనపర్చే బ్యాక్టీరియా, వైరస్‌లతో అద్భుతంగా పోరాడతాయి.
  5. ఇవి కూడా చదవండి
  6. లైంగిక కోరికలు: దానిమ్మ గింజలలో రక్తపోటు, మూడ్ పై సానుకూల ప్రభావాలు చూపే లక్షణాలు ఉంటాయి. ఈ గింజలు రక్తప్రసరణను పెంచి అంగస్థంభన సమస్యలను నయం చేస్తాయి. ఇవి టెస్టోస్టిరాన్ హార్మోన్ స్థాయిని కూడా పెంచి తద్వారా లైంగిక కోరికలను పెంచుతాయి.
  7. ఆర్థరైటిస్: దానిమ్మ గింజలు కీళ్లవాతాన్ని, ఆర్థరైటిస్ జబ్బును నయం చేస్తాయి. ఎందుకంటే వీటిల్లో ఫ్లేవనాల్స్ అనే యాంటీఆక్సిడెంట్లు శరీరంలో వాపులను తగ్గించటానికి పనిచేస్తాయి. మీకు కీళ్ల నొప్పులు ఉంటే తరచుగా దానిమ్మలను తింటూ ఉండండి.
  8. గుండె ఆరోగ్యం: దానిమ్మ గింజలు గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి. ఇందులో ఉండే ఆంటీయాక్సిడెంట్లు మంచి కొలెస్ట్రాల్ పనితీరును మెరుగుపర్చి, హానికారక ఆక్సీకరణం చెందిన లిపిడ్లను విఛ్చిన్నం చేస్తాయి. అలా ఆర్థెరోస్క్లెరోసిస్ రిస్క్ ను తగ్గిస్తాయి.
  9. క్యాన్సర్ నివారిణి: దానిమ్మ గింజల వలన ప్రొస్టేట్ క్యాన్సర్ రిస్క్ నివారించబడుతుంది. ఈ గింజలలో వుండే క్యాన్సర్ వ్యతిరేక లక్షణాలు కాన్సర్ కణాలు పాకకుండా, ఎక్కువగా పెరగకుండా, క్యాన్సర్ సోకిన కణాలు చనిపోయేలాగా పురిగొల్పుతాయి.
  10. మధుమేహం: దానిమ్మ గింజలు డయాబెటిస్ ఉన్న వారికి చాలా ఉపయోగకరం. ఈ గింజలలో ఉండే కొన్నిరకాల యాసిడ్లు మధుమేహ వ్యతిరేక లక్షణాలను కలిగిఉంటాయి. దానిమ్మ గింజలలోని కార్బోహైడ్రేట్లలో కూడా కొన్ని ప్రత్యేక యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అవి టైప్ 2 డయాబెటిస్‌ను నివారించటంలో సాయపడతాయి.
  11. వాపులతో పోరాటం: దానిమ్మ గింజలను తినటం వలన వాపులు, వాపు సంబంధ సమస్యలతో పోరాటంలో సాయం లభిస్తుంది. అధ్యయనాల ప్రకారం శరీరంలో ఫ్రీగా తిరిగే హానికర రాడికల్స్ కారణంగా జరిగే ఆక్సిడేటివ్ నష్టాన్ని, వాపును దానిమ్మ గింజలు తగ్గిస్తాయి.

ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి